పులివెందులలో కౌన్సిలర్లతో వైఎస్ జగన్ భేటీ
కడప : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పులివెందుల మున్సిపాలిటీలో కౌన్సిలర్లతో సమావేశం అయ్యారు. తాగునీరు, ఇతర సమస్యలను కౌన్సిలర్లు ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. అలాగే పులివెందుల నియోజకవర్గంలోని తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యుఎస్, పీబీసీ, ఇతర అధికారులతో సాగు, తాగునీటితోపాటు పలు అభివృద్ది కార్యక్రమాలపై వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం పులివెందుల కార్యాలయంలోనే ప్రజలతో మమేకం కానున్నారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వైఎస్ జగన్‌ను కలవనున్నారు.