పురందేశ్వరి రాజీనామాకు ఆమోదం!
పురందేశ్వరి రాజీనామాకు ఆమోదం!
Published Tue, Mar 11 2014 11:40 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
కేంద్ర మంత్రి పదవికి పురందేశ్వరి సమర్పించిన రాజీనామాను మంగళవారం రాత్రి ఆమోదించారు. పురందేశ్వరి రాజీనామాను ఆమోదించినట్టు రాష్ట్రపతి భవన్ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి ఎంపికై కేంద్ర మంత్రి పదవిని చేపట్టిన పురందేశ్వరి ఇటీవల బీజేపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర విభజన అంశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన తీరును పురందేశ్వరి తప్పు పట్టారు. యూపీఏ అనుసరించిన తీరును ఎండగడుతూ పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీ, మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Advertisement
Advertisement