D Purandeswari
-
నడ్డా టీంలో పురందేశ్వరి, డీకే అరుణ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా బాధ్యతల స్వీకరణ అనంతరం తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గం(పదాధికారులు)లో తెలుగు రాష్ట్రాల నుంచి డీకే అరుణ, పురందేశ్వరిలకు కీలక పదవులు దక్కాయి. తెలంగాణ మాజీ మంత్రి డి.కె.అరుణకు కీలకమైన జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి దక్కగా.. ఏపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి లభించింది. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవి లభించడం విశేషం. ఏపీ నుంచి సత్యకుమార్‌కు జాతీయ కార్యదర్శి పదవి దక్కింది. పార్టీ జాతీయ కార్యవర్గంలో కీలక నేతలుగా ఉన్న రాంమాధవ్, పి.మురళీధర్‌రావుల స్థానంలో కొత్త వారికి చోటు లభించింది. ఇక, జాతీయ అధికార ప్రతినిధిగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఉండగా.. ఆయన స్థానంలో ఎంపీ అనిల్ బెలూనీకి చోటు కల్పించారు. మొత్తం 23 మంది అధికార ప్రతినిధుల్లో..దక్షిణాది నుంచి అధికార ప్రతినిధులుగా రాజీవ్ చంద్రశేఖర్, టామ్ వడక్కన్‌లు ఇద్దరికే చోటు దక్కింది. 12 మంది ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు, ఒక ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ సహా మొత్తం 70 మంది ఉన్న ఈ నూతన కార్యవర్గానికి తోడు కార్యవర్గ సభ్యులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. కర్ణాటకకు చెందిన బీజేపీ యువ ఎంపీ తేజస్వీ సూర్యకు పూనమ్ మహాజన్ స్థానంలో బీజేపీ యువ మోర్చా అధ్యక్ష పదవి దక్కడం విశేషం. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరి కొద్దికాలమే అయినప్పటికీ డీకే అరు ణకు, ము కుల్ రాయ్(పశ్చిమబెంగాల్)కు ఉపాధ్యక్ష పదవులు దక్కడం విశేషం. ఉపాధ్యక్షులుగా మాజీ ముఖ్యమంత్రులు రమణ్‌సింగ్, వసుంధర రాజే, ముకుల్‌రాయ్æ తదితరులు ఎంపికయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా భూపేందర్ యాదవ్, కైలాష్ విజయ్‌వర్గీయ, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు)గా బి.ఎల్.సంతోష్ ఎంపికయ్యారు. పురందేశ్వరి.. సామాజిక సమీకరణలే కీలకం.. ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా.. మరో బలమైన సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం నుంచి దగ్గుబాటు పురందేశ్వరిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికచేయడం సామాజిక సమీకరణాల సమతుల్యం చేయడమేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సామాజిక వర్గం అండగా ఉన్న టీడీపీ క్రమంగా బలహీనపడుతున్న తరుణంలో ఏపీలో బలోపేతమయ్యే దిశగా ఈ సమతుల్యం అవసరమని విశ్లేషిస్తున్నాయి. పురందేశ్వరికి యూపీఏ ప్రభుత్వంలో కీలకమైన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఈ కీలక పదవి దక్కడంలో దోహదపడింది. డీకే అరుణ.. రెడ్డి సామాజిక వర్గంపై గురి.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బీసీ నేత బండి సంజయ్ ఉండగా.. ఇక్కడ మరో బలమైన సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని ఉంది. టీఆర్ఎస్ వ్యూహాలతో బలహీనపడిన కాంగ్రెస్ నుంచి ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకునే దిశగా డీకే అరుణకు జాతీయస్థాయిలో కీలకమైన ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం అరుణకు కలిసొచ్చిందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేబినెట్లో చోటు దక్కనుందా? బిహార్ ఎన్నికల అనంతరం కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాంమాధవ్‌కు చోటు దక్కవచ్చని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఆయన కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడియూరప్ప నుంచి స్పష్టమైన హామీ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ఎయిర్ ఇండియా డైరెక్టర్‌గా పురందేశ్వరి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్రం గురువారం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఆమె మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన పురందేశ్వరి ప్రస్తుతం మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. -
పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆశాజనకంగా లేవు: పురందేశ్వరి
విజయవాడ : కృష్ణానదీ జలాల వినియోగం సంపూర్ణంగా జరిగిపోయిందని తెలంగాణ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడం దురదృష్టకరం అని బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. శనివారం విజయవాడలో పురందేశ్వరి మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్ట్ పనులు అనుకున్నంత ఆశాజనకంగా లేవన్నారు. పోలవరంపై న్యాయ సలహా తీసుకుని కేంద్రంతో మాట్లాడతానని పురందేశ్వరి తెలిపారు. -
అనుబంధం తెగిపోయిందా చిన్నమ్మా?
మరిదిగారిపై కోపంతో హస్తంపార్టీకి స్నేహ హస్తం అందించింది. దాంతో ఖుషీ అయిపోయిన హస్తం పార్టీ ఏకంగా విశాఖపట్నం లోక్‌సభ ఎంపీ టికెటు ఇచ్చింది. కేవలం సూట్‌కేసుతో వెళ్లి నామినేషన్ వేసి... ఎంపీగా గెలిచింది. అంతేనా కేంద్రంలో సహాయమంత్రి పదవిని సైతం చేజిక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదే పార్టీ టికెట్‌పై గెలిచి మరోసారి కేంద్ర మంత్రి పదవి దక్కించుకుంది. ఆమె ఎవరో ఇప్పటికే గుర్తు వచ్చి ఉంటుంది. ఆమె దగ్గుబాటి పురందేశ్వరీ అలియాస్ చిన్నమ్మ. తనను ఇంతగా అందలం ఎక్కించిన మీకూ ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలనంటు ఒకానొక సమయంలో చిన్నమ్మ విశాఖ ప్రజలను పొగడ్తలతో ముంచెత్తింది. విశాఖ అంటే నేను... నేను అంటే విశాఖ అన్నట్లు మమేకమైపోయినా ఆమె రాష్ట్ర విభజన సమయంలో మీరు రాజీనామా చేయమంటే చేసేస్తా.... కేంద్రంతో పోరాడమంటే పోరాడతా నంటూ నాటి విశాఖ సభలలో చిన్నమ్మ ఉదరగొట్టింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిపోవడం... హస్తం పార్టీకే హ్యాండ్ ఇచ్చి కాషాయ వస్త్రం కప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. కాషాయం పార్టీ టికెట్టుపై ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైంది. అది వేరే సంగతి. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలను హుదూద్ తుపాను అతలాకుతలం చేసింది. అందునా ఆమె ఒకప్పటి లోక్‌సభ నియోజకవర్గమైన విశాఖలో అయితే బీభత్సం సృష్టించింది. విశాఖ ప్రజలకు ఇంత జరిగిన ఆమె అటు వైపు కన్ను ఎత్తి కూడా చూడ లేదు. హుదూద్ తుపాను నేపథ్యంలో దేశంలోని వివిధ పారిశ్రామికవేత్తలు, బడా రాజకీయనాయకులు, పలు చిత్ర పరిశ్రమలకు చెందిన హీరోహీరోయిన్లు భారీగా తమ విరాళాలు ప్రకటించారు. కానీ హుదూద్ తుపాను పై చిన్నమ్మ కనీసం స్పందించలేదు. విశాఖతో ఇక తన అనుబంధం తెగిపోయిందని చిన్నమ్మా భావిస్తున్నారో ఏమో. కనీసం ఉలుకుపలుకు లేకుండా ఉండి పోయారు. -
పోలవరానికి టీఆర్ఎస్సే అడ్డంకి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని టీఆర్ఎస్ యత్నిస్తోందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుపాటి పురందేశ్వరీ ఆరోపించారు. శుక్రవారం విజయవాడ నగరంలో జరిగిన ఆంధప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో పురందేశ్వరీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పురందేశ్వరీ మాట్లాడుతూ... రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు బీజేపీ వల్లే మేలు జరిగిందన్నారు. విభజనతో సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ అధిష్టానానికి ఎన్నో విజ్ఞప్తి చేశామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. అయిన తమ విజ్ఞప్తులను అధిష్టానం పెడ చెవిన పెట్టిందని ఆరోపించారు. బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు తమ పార్టీ సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు ఒత్తిడి చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం దిగిరాక తప్పలేదన్నారు. సీమాంధ్రకు మేలు జరిగిందంటే అది బీజేపీ పుణ్యమేనని పురందేశ్వరీ స్పష్టం చేశారు. ఆ సభకు హాజరైన బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్ కూడా మాట్లాడారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి బీజేపీతోనే సాధ్యమైందని అన్నారు. విభజన సందర్బంగా బిల్లులో సీమాంధ్ర కోసం ఉద్దేశించిన ప్యాకేజీలు అమలు కావాలంటే బీజేపీ అధికారంలోని రావాలని ఆయన ఉద్ఘాటించారు. విజయవాడలో ఈ రోజు ఉదయం ప్రారంభమైన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబుతోపాటు వివిధ జిల్లా పార్టీ అధ్యక్షులులతోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
పురందేశ్వరి రాజీనామాకు ఆమోదం!
కేంద్ర మంత్రి పదవికి పురందేశ్వరి సమర్పించిన రాజీనామాను మంగళవారం రాత్రి ఆమోదించారు. పురందేశ్వరి రాజీనామాను ఆమోదించినట్టు రాష్ట్రపతి భవన్ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి ఎంపికై కేంద్ర మంత్రి పదవిని చేపట్టిన పురందేశ్వరి ఇటీవల బీజేపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన అంశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన తీరును పురందేశ్వరి తప్పు పట్టారు. యూపీఏ అనుసరించిన తీరును ఎండగడుతూ పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీ, మంత్రి పదవికి రాజీనామా చేశారు.