
సాక్షి, ప.గో జిల్లా : మాజీ మంత్రి, తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు ప్రభుత్వ ఉద్యోగులపై ఫైర్ అయ్యారు. పెంటపాడు మండలంలోని జట్లపాలెం గ్రామంలో సీసీ రోడ్డు ఓపెనింగ్‌కు వెళ్లిన పైడికొండలకు ప్రోటోకాల్ ప్రకారం అక్కడి రెవెన్యూ అధికారులు, గ్రామ నాయకులు హాజరుకాకపోవడంతో వారిపై విరుచుకపడ్డారు. కావాలనే కొంతమంది ప్రజాప్రతినిధులు ఇదంతా చేయిస్తున్నారని, అధికారులంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండకపోతే..ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ప్రజలంతా కలిసి అధికారులను నిలదీయాలని, వారి ఆఫీసుల నుంచి బయటకు రానీయకుండా చేయాలంటూ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment