శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం చింతాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన వారి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ క్రమంలో గ్రామ సర్పంచి రామచంద్రనాయుడు, మాజీ సర్పంచి కళావతి రెండు వర్గాలుగా విడిపోయారు.
శుక్రవారం ఉదయం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రెండు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. ఆ దాడిలో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిపై ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్కు చేరి ఒక వర్గంపై మరో వర్గం కేసులు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.