రాష్ట్ర శాసనసభ
హైదరాబాద్: రేపు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. సభ ప్రారంభం కాగానే నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)పై చర్చ ప్రారంభిస్తారు.
ఇదిలా ఉండగా, మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో మాట్లాడుతూ రేపటి నుంచి రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ ప్రశాంతంగా జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు. బీఏసీలో ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేసినా అసెంబ్లీలో చర్చ జరగవలసి ఉందని చెప్పారు. చర్చ జరిగితే కచ్చితంగా విభజనను వ్యతిరేకిస్తామని గంటా స్పష్టం చేశారు.