'చిన్నబాస్కు రూ. 500 కోట్లు ముడుపులు'
గుంటూరు: చిన్నపరిశ్రమలకు 1400 కోట్ల రూపాయల సబ్సిడీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో చిన్నబాస్కు 500 కోట్లు ముడుపులు ముట్టాయని ఆయన ఘాటుగా విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టిసీమ పేరుతో మరో 500 కోట్లను కొల్లగొట్టబోతున్నారంటూ దుయ్యబట్టారు. కరెంట్ కొనుగోలు పేరుతో ప్రతి యూనిట్కు 25 పైసల పేరుతో లంచాలు తీసుకున్నారని రఘువీరా ధ్వజమెత్తారు.
వీటిన్నింటిపై సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోలేని ప్రభుత్వం కూలీలను చంపిందంటూ మండిపడ్డారు. తమిళనాడులో తెలుగువారికి రక్షణ కల్పించే బాధ్యత ఏపీ ప్రభుత్వం తీసుకోవాలని రఘువీరా రెడ్డి కోరారు.