కొత్త రైల్వే బడ్జెట్ కూడా పాత సంప్రదాయాన్నే కొనసాగించిందని నేతలు మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్‌కు అన్యాయం చేసే విధానాన్ని కొత్త ప్రభుత్వమూ కొనసాగించిందని, ఈ బడ్జెట్‌తో రాష్ట్రానికి ఒరిగే ప్రయోజనాలు శూన్యమని వారు అభిప్రాయపడ్డారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గురువారం రైల్వే బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. చాలా కాలంగా ైరె ల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సారైనా అమాత్యులు దయ చూపిస్తారని ఆశ పడినా, చివరకు నిరాశే మిగిలిందని నాయకులు, ప్రజలు తెలిపారు. బీజేపీ, టీడీపీ నేతలు మాత్రం దీనికి భిన్నంగా స్పందించారు.
- విజయనగరం టౌన్, ఫోర్‌ట, కురుపాం
కొత్తదనం లేని రైల్వే బడ్జెట్..
కొత్తదనం లేని బడ్జెట్‌తో ఈ సారి కూడా జిల్లాకు మొండి చేయే మిగిలింది. దశాబ్దాలుగా ఇచ్చిన హామీలు ఇచ్చినట్లే ఉండి పోయాయి. కనీసం కొత్త రైళ్లు లేవు, లైన్లూ లేవు. ఈ బడ్జెట్‌తో ఉత్తరాంధ్రాకు తీవ్ర అన్యాయమే జరిగింది.
- పాముల పుష్పశ్రీవాణి, కురుపాం ఎమ్మెల్యే
నిరాశే...
రైల్వే బడ్జెట్ ప్రజలకు నిరాశే మిగి ల్చింది. రైల్లో ప్రయాణించే వారి వద్ద నుంచి వసూలు చేసే చార్జీలు పెంచకున్నా రవాణా చార్జీలు పెంచటం ద్వారా పరోక్షంగా భారం మోపారు. ఈ విధానం ద్వారా నిత్యావసరల ధరలు పెరుగుతాయి. ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి ఒనగూరింది ఏమీ లేదు. ఎప్పటి నుంచో విశాఖను ప్రత్యేక రైల్వే జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తు న్నా అది జరగని పరిస్థితి. ఇంత మంది ఎంపీలు, ముఖ్యమంత్రులు ఉన్నా ప్రయోజనం లేకపోతోంది.
- కోలగట్ల వీరభద్రస్వామి,
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
ఎప్పటిలాగానే అన్యాయం...
రైల్వే బడ్జెట్ ప్రకటనలో ఎప్పటిలా నే ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశా రు. బీజేపీ సర్కారు రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తోంది. అత్యధిక ఆదాయాన్నిస్తున్న విశాఖను ప్రత్యేక రైల్వేజోన్‌గా ప్రకటించకపోవటం అన్యాయం. ఈ రైల్వే బడ్జెట్ ద్వారా ఆంధ్రులకు కలిసొచ్చేది లేకున్నా అదనంగా రవణా చార్జీల పేరుతో డబ్బు గుంజు కుంటున్నారు. ఈ వైఖరిని వ్యతిరేకిస్తున్నాం.
- పెనుమత్స సాంబశివరాజు, కేంద్రపాలక మండలి సభ్యుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ
సామాన్యులకు అందుబాటులో...
ఎలాంటి ప్రయాణచార్జీలు , రవాణా చార్జీలు పెంచకుండా సామాన్య ప్రజ లకు అందుబాటులో రైల్వే బడ్జెట్ ఉం ది. మహిళల భద్రత కోసం, సీసీ కెమెరాలతో కోచ్‌లు ఏర్పాటు చేయడం, మహిళల పట్ల బడ్జెట్‌లో ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. రైతులకు వారు పండించే పంటకు గిట్టుబాటు ధర వచ్చేవిధంగా పచ్చి సరుకులు రవాణాకు ప్రత్యేక బోగీలు కేటాయించడం అభినందనీయం.
- బవిరెడ్డి శివప్రసాదరెడ్డి,
బీజేపీ జిల్లా అధ్యక్షుడు
పనిభారమే...
ఇప్పటికే సగానికి పైగా ఉద్యోగులు రిటైరయ్యారు. ప్రైవేటీకరణ దిశగా చేసే ఆలోచనలు మానుకోవాలి. దీనివల్ల నిరుద్యోగిత పెరుగుతుంది. ఉన్న వారికి పనిభారం రెట్టింపవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత విశాఖ నుంచి విజయవాడ వరకూ ఇంటర్ సిటీ ఏర్పాటుచే యాల్సి ఉంది. ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరం.
- జి.కాశిబాబు, శ్రామిక్ కాంగ్రెస్ బ్రాంచ్ సెక్రటరీ, విజయనగరం
మొండిచేయి
కొత్త రైళ్ల ప్రతిపాదన లేకండా ఉత్తరాంధ్రకు మరోసారి మొండిచేయి చూపించారు. పేపర్‌లెస్ టికెటింగ్ విధానం వల్ల ఉన్న ఉద్యోగాలు తగ్గిపోతాయి. కొత్తగా ఉద్యోగకల్పన ఉండదు. జనరల్ బోగీలు పెంచడం శుభపరిణామం. - జి.నాగేశ్వరరావు,
శ్రామిక్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి, విజయనగరం
తీరని అన్యాయం...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు, తెలుగు ప్రజలకు తీరని అ న్యాయం జరిగింది. కొత్తరైళ్లు, లైన్ల గురించి ప్రస్తావించకుండా కంటి తుడుపుగా మరుగుదొడ్లు నిర్మిస్తాం, మినరల్ వాటర్ ఇస్తామనం హాస్యాస్పదం. - యడ్ల రమణమూర్తి,
పీసీసీ ప్రధాన కార్యదర్శి
ఇది తీవ్ర అన్యాయం
రైల్వే మంత్రి ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. 20వేల మంది అభిప్రాయాలు తీసుకున్న ఆయన ఇచ్చే బడ్జెట్ గొప్పగా వస్తుందనకునే వా రందరి ఆశలను నీరు గార్చారు. ఖాళీగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల భర్తీ గురించి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉంది.
- డాక్టర్ పెదిరెడ్ల రాజశేఖర్, రైల్వే ఓబీసీ సెల్ నాయకులు
ఆశాజనకంగా లేదు
ప్రయాణికులకు భద్రత, సౌకర్యం, సంతృప్తి పరంగా కొన్ని చర్యలు చేపట్టారు. కొత్త జోన్‌గానీ, రైళ్లుగానీ ఇవ్వలేదు. ఏదేమైనప్పటికీ ఆశాజనకంగా లేని బడ్జెట్ ఇది. కొత్త రైళ్లు లేవు. ప్రాజెక్టులు లేవు. చార్జీలు పెంచకపోవడం, వైఫై వంటి సౌకర్యాలు పెట్టడం హర్షణీయం.
- ద్వారపు రెడ్డి జగదీష్, టీడీనీ జిల్లా అధ్యక్షుడు
కొత్తదనమేమీ లేదు
రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగలేదు. ప్రైవేటీకరణకు పెద్దపీట వేశారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. రాబోయే ఐదేళ్లలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది. బడ్జెట్‌లో కొత్తదనమేమీ లేదు. కొత్త రైళ్ల ఊసేలేదు.
- తమ్మినేని సూర్యనారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి
ఏం ఒరిగిందని...!
Published Fri, Feb 27 2015 1:45 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement