
'రైల్వే బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉంది'
హైదరాబాద్:పార్లమెంట్ లో శుక్రవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఆ బడ్జెట్ రైల్వే వ్యవస్థ అభివృద్ధికి సహకరించేలా బడ్జెట్ ఉందన్నారు. భద్రతకు, స్వచ్ఛత, శుభ్రతకు రైల్వే బడ్జెట్ లో పెద్ద పీట వేయడం గర్వించదగ్గ విషయమన్నారు.
మొత్తంగా చూస్తే రైల్వే వ్యవస్థ అభివృద్ధికి సహకరించేలా ప్రస్తుత బడ్జెట్ ఉందని వెంకయ్య తెలిపారు. ధృడమైన నిర్ణయాలు తీసుకోవాలనే ప్రజలు తమకు ఓటేశారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.