Railway budjet
-
రైల్వే బడ్జెట్ 2023: వందే భారత్ రైళ్లు, కేటాయింపులు, సామాన్యుడికి ఊరట!?
న్యూఢిల్లీ: 2023-24 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సర్వం సిద్ధం చేసుకున్నారు. కీలకమైన హల్వా వేడుక ముగిసింది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు, వేతన జీవులతో పాటు ఆర్థిక నిపుణులు,పెట్టుబడిదారులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే రైల్వేకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇదే బడ్జెట్లో చేయనున్నారు. ముఖ్యంగా త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ , మిజోరం మినహా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈశాన్య రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోడీ సర్కార్ రైల్వే కేటాయింపులపై మరింత ఉత్కంఠ నెలకొంది. రైల్వే బడ్జెట్ ఒకపుడు విడిగా 2017 వరకు కూడా రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌తో కాకుండా విడిగా ప్రవేశపెట్టేవారు. 1924లో తొలిసారిగా రైల్వే బడ్జెట్‌ను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.దేశంలో రైల్వే వ్యవస్థలను అభివృద్ధి చేయడం కోసం నాటి బ్రిటిష్ పాలకులు రైల్వేకు ఎక్కువ నిధులు కేటాయించేది అప్పటి ప్రభుత్వం. ఇది సరకు రవాణాకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. ఆ తరువాతి కాలంలో ఏర్పాటైన రైల్వే వ్యవస్థ జాతీయంపై 1920లో 10 మంది సభ్యుల సర్ విలియం అక్వర్త్ కమిటీ రైల్వే వ్యవస్థను సంఘటితం చేయాలని సూచించింది. అందుకోసం ప్రత్యేకంగా రైల్వేకు నిధులు కేటాయించాలని బ్రిటిష్ పాలకులకు సిఫార్సు చేసింది, దీనికి ఆమోదం లభించడంతో 1924 నుంచి రైల్వే బడ్జెట్‌ని ప్రభుత్వం విడిగా ప్రవేశపెడుతోంది. దాదాపు 93 ఏళ్ల పాటు రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టే సాంప్రదాయం కొనసాగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి టర్మ్‌లో రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో కలిపింది 2017లో తొలిసారిగా వార్షిక బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్‌ను ప్రకటించారు. అయితే తాజా బడ్జెట్లో కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు, కొత్త రైల్వే ఛార్జీలు,కేటాయింపులపై తదితర విషయాలపై భారీ ఆసక్తి నింపుతోంది. ఈ ఏడాది బడ్జెట్లో వందే భారత్ రైళ్లు, బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న మూడేళ్లలో 400 సెమీ హైస్పీడ్, నెక్స్ట్ జనరేషన్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికను రూపొందించినట్లు గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజా సమాచారం మేరకు కేంద్రం ఈసారి రైల్వే బడ్జెట్ ను పెంచబోతోంది. అలాగేప్రీ బడ్జెట్ మీటింగ్ రైల్వే బోర్డు తమకు 25 నుంచి 30 శాతం వరకూ బడ్జెట్ కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేసింది. ఈక్రమంలో రైల్వేలకు కేటాయింపులు ప్రస్తుత సంవత్సరంలో రూ. 1.4 లక్షల కోట్లుగా ఉండగా అది 2023-2024 ఆర్థిక సంవత్సరానికి 30 శాతం పెంచి రూ. 1.9 లక్షల కోట్లు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2.45 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్‌తో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం మూలధన వ్యయం రూ. 3 ట్రిలియన్లకు అంటే 20 శాతానికి పైగా పెరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ బడ్జెట్లో నూతన రైల్వే లైన్లను ప్రతిపాదనతోపాటు, ఆయా రాష్ట్రాల్లో రైల్వే వ్యవస్థలను మెరుగు పరిచేందుకుప్రాధాన్యత ఇవ్వనుంది. అంచనాలు 2023 బడ్జెట్ కేటాయింపుల్లో వేగవంతమైన రైళ్లకు అనుగుణంగా ట్రాక్స్ అప్‌గగ్రేడేషన్‌పై దృష్టి సారించాలని రైల్వే నిపుణులు చెబుతున్నారు. అధికంగా నిధులు, ముఖ్యంగా కొత్త లైన్ల నిర్మాణం, లైన్ల గేజ్‌లు మార్పు, ఎలక్ట్రిఫికేషన్ చేయడం, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తేవడం లాంటివాటిపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ►డిసెంబర్ 2023 నాటికి బ్రాడ్ గేజ్ రైల్వేల 100 శాతం విద్యుదీకరణ పూర్తి. ►మెట్రో రైల్వే వ్యవస్థను టైర్-2 నగరాలు , టైర్-1 నగరాల వెలుపలి ప్రాంతాలలో అభివృద్ధి ►తద్వారా భారతీయ రైల్వేలు 2030 నాటికి ప్రపంచంలోనే తొలి100 శాతం గ్రీన్ రైల్వే సర్వీస్‌గా అవిష్కారం ► హైపర్‌లూప్ టెక్నాలజీని అవలంబిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. ► దీనితో పాటు సామాన్యులకు ఊరటనిచ్చేలా ప్రాథమిక సౌకర్యాలపై భారీ ప్రకటన రానుందని అంచనా. ►వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 4000 కి.మీ పొడవు లైన్ వేయడం ఉద్దేశ్యం ►రాబోయే రైల్వే బడ్జెట్లో 7,000 కి.మీ బ్రాడ్ గేజ్ లైన్ విద్యుదీకరణప్రకటన ► రైల్వే విజన్ 2024 ప్రాజెక్ట్ కింద, కొత్త ప్రత్యేక ఫ్రైట్ కారిడార్లు హై-స్పీడ్ ప్యాసింజర్ కారిడార్లను పరిచయం చేయడంతో పాటు, రద్దీ మార్గాల్లో మల్టీట్రాకింగ్ , సిగ్నలింగ్ అప్‌గ్రేడ్స్ లక్క్ష్యం. ► కోవిడ్ సమయంలో తొలగించిన రైల్వేలో సీనియర్ సిటిజన్ల కుల్పిస్తున్న 50 శాతం రాయితీని పునరుద్ధించాలని కూడా పలువురు కోరుతున్నారు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బడ్జెట్ 2021: పదేళ్ల మెగా ప్రణాళిక
న్యూఢిల్లీ: కరోనా అన్ని రవాణా వ్యవస్థలతో పాటు భారతీయ రైల్వేపైనా పెను ప్రభావం చూపించింది. కొన్ని నెలల పాటు రైళ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో.. రైల్వే కోసం 2021–22 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ.1,10,055 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రూ.1,07,100 కోట్లు మూలధన వ్యయంగా పేర్కొన్నారు. ‘రికార్డు’బడ్జెట్‌గా అభివర్ణించినా 2020–21 సవరించిన బడ్జెట్ (రూ.1.11 లక్షల కోట్లు) కంటే ఇది తక్కువే. మరోవైపు 2030 కల్లా భవిష్యత్ అవసరాలకు తగిన (ఫ్యూచర్ రెడీ) రైల్వే వ్యవస్థను సృష్టించడం ప్రధాన లక్ష్యంగా భారత జాతీయ రైలు ప్రణాళిక 2030కి రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా.. మేక్ ఇన్ ఇండియా వ్యూహానికి ఊతం ఇచ్చేలా పరిశ్రమల రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు వీలుగా.. 2022 జూన్ కల్లా తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు (డీఎఫ్సీ) ప్రారంభించాలని నిర్ణయించారు. ఈడీఎఫ్‌సీలో భాగంగా 2021–22లో సోన్నగర్–గోమోహ్ సెక్షన్‌ను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో చేపడతారు. ఆ తర్వాత గోమోహ్–డాంకుని సెక్షన్ చేపడతారు. భవిష్యత్తులో ఖరగ్‌పూర్ – విజయవాడ ఈస్ట్ కోస్ట్ కారిడార్‌ను, భూసావాల్ – ఖరగ్‌పూర్ – డాంకుని ఈస్ట్ వెస్ట్ కారిడార్, అలాగే ఇటార్సీ – విజయవాడ నార్త్ సౌత్ కారిడార్‌ను చేపడతారు. ⇔ 2022 జూన్‌కల్లా తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు ⇔ భవిష్యత్తులో ఖరగ్‌పూర్ – విజయవాడ ఈస్ట్ కోస్ట్ కారిడార్, ఇటార్సీ – విజయవాడ నార్త్ సౌత్ కారిడార్, భూసావాల్–ఖరగ్‌పూర్–డాంకుని ఈస్ట్ వెస్ట్ కారిడార్లు ⇔ 2023 కల్లా బ్రాడ్‌గేజ్ రూట్ల 100 శాతం విద్యుదీకరణ ⇔ రైళ్ల ప్రమాదాల నివారణకు ఆటోమేటిక్ రైలు భద్రత విధానం 2020 అక్టోబర్ 1 నాటికి 41,548 రూట్ కిలోమీటర్లు (ఆర్కేఎం)గా ఉన్న బ్రాడ్ గేజ్ రూట్ విద్యుద్దీకరణ 2021 చివరి నాటికి 46,000 రూట్ కిలోమీటర్లకు (72%)చేరుకుంటుంది. 2023 కల్లా 100% విద్యుద్దీకరణ పూర్తవుతుంది. పర్యాటక రూట్లలో మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణాలకు వీలుగా ఆకర్షణీయంగా డిజైన్ చేసిన విస్టా డోమ్ ఎల్‌హెచ్‌బీ రైల్వే కోచ్‌లను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు భద్రత వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ‘మానవ తప్పిదాల కారణంగా రైళ్లు ఢీకొనడం వంటి ప్రమాదాలు నివారించేందుకు దేశీయంగా డిజైన్ చేసిన ఆటోమేటిక్ వ్యవస్థను అన్ని ప్రధానమైన రూట్లలో ప్రవేశపెడతాం..’అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలపై దృష్టి మెట్రో రైళ్ల విస్తరణలో భాగంగా చెన్నై మెట్రో రైల్వే ఫేజ్–2 కోసం రూ.63,246 కోట్ల కేంద్ర నిధులు కేటాయించారు. బెంగళూరు మెట్రో రైల్వే ఫేజ్ 2ఏ, 2బీ కోసం రూ.14,788 కోట్లు, కొచ్చి మెట్రో రైల్వే ఫేజ్–2 కోసం 1,957.05 కోట్లు, నాగ్‌పూర్ మెట్రో రైల్వే ఫేజ్–2 కోసం రూ.5,976 కోట్లు, నాసిక్ మెట్రో కోసం రూ.2,092 కోట్లు ప్రకటించారు. సోమవారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా.. లాక్డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా నిత్యావసర సరుకులు సరఫరా చేసిన రైల్వేని ఆర్థికమంత్రి అభినందించారు. ఇది పూర్తిగా భిన్నమైన, పరివర్తనతో కూడిన బడ్జెట్‌గా రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సునీశ్ శర్మ అభివర్ణించారు. -
ఇక.. వేగంగా ట్రిప్లింగ్
కాజీపేట– బల్లార్షా మధ్య నిర్మాణం రూ. 2063 కోట్ల అంచనా వ్యయం ప్రణాళిక సిద్ధం చేసిన కేంద్రం బీవోటీ పద్ధతిలో పనులు ? సాక్షి, హన్మకొండ : నాలుగేళ్లుగా నత్తనడకన సాగుతున్న కాజీపేట–బల్లార్ష ట్రిప్లింగ్ పనులు వేగం పుంజుకోనున్నాయి. ఐదేళ్ల వ్యవధిలో ఈ పనులు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారీగా నిధులు సమీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మహారాష్ట్రలోని బల్లార్ష–కాజీపేట మధ్య ఉన్న 201 కిలోమీటర్ల డబ్లింగ్ (అప్‌లైన్, డౌన్‌లైన్) రైలు మార్గాన్ని ట్రిప్లింగ్ (మూడోలైను)గా అభివద్ధి చేస్తున్నారు. ఐదేళ్ల కిందట ఈ పనులు ప్రారంభమైనా నిధుల లేమి కారణంగా నత్తనడకన సాగుతున్నాయి. ఐదేళ్ల వ్యవధిలో కనీసం యాభై కిలోమీటర్ల ట్రాక్‌ను నిర్మించలేక పోయారు. కేవలం మంచిర్యాల వద్ద గోదావరి నదిపై మూడో వంతెన నిర్మాణం పూర్తయింది. ఈ వంతెనకు అటు ఇటు కొన్ని కిలోమీటర్ల వరకే ట్రిప్లింగ్ పనులు జరిగాయి. రోజురోజుకి ఈ మార్గంలో పెరుగుతున్న రద్దీని తట్టుకునేందుకు మూడో మార్గం తప్పనిసరైంది. దీంతో ట్రిప్లింగ్ పనులు వేగం పెంచేందుకు నిధుల సమీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. బల్లార్షా – కాజీపేట ట్రిప్లింగ్‌కు నిర్మాణంపై ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు ట్రిప్లింగ్ పనులకు రూ.2063 కోట్ల వ్యయం అవుతుందని కేంద్ర ఆర్థికశాఖ అంచనా వేసింది. ఈ నిధులను రైల్వేశాఖ, ప్రైవేటు సంస్థల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. మూడోలైను ద్వారా ఎక్కువగా వాణిజ్య పరమైన సరుకుల రవాణా (గూడ్సు)కు ఉపయోగించనున్నారు. దీంతో ట్రిప్లింగ్ పనులను బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (బీఓటీ) పద్ధతిలో చేపట్టడంపై చర్చలు జరుగుతున్నాయి. ఐదేళ్లుగా.. చెన్నై – న్యూఢిల్లీ గ్రాండ్‌ట్రంక్ మార్గంలో నాగ్‌పూర్ – విజయవాడ వరకు ఉన్న మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది. ఈ మార్గంలో బల్లార్ష – కాజీపేట – విజయవాడల మధ్య ఉన్న 400 కిలోమీటర్ల మార్గంలో ప్రస్తుతం అప్‌లైన్, డౌన్లైను నిరంతరం రద్దీగా ఉంటున్నాయి. ఈ మార్గంలో కొత్త రైలును ప్రవేశపెట్టడం కష్టమయ్యే పరిస్థితి నెలకొంది. రద్దీ కారణంగా గూడ్సు రైళ్లు గంటల తరబడి ఆలస్యమవుతున్నాయి. ఈ సమస్యను నివారించేందుకు 2012–13 రైల్వే బడ్జెట్లో బల్లార్షా – కాజీపేట – విజయవాడ మార్గాన్ని ట్రిప్లింగ్ (మూడోలైను) చేస్తామని రైల్వేమంత్రి ప్రకటించారు. గత నాలుగేళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. బెల్లంపల్లి – పెద్దపల్లిల మధ్య ఈ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. -
ఎంపీ మిథున్‌రెడ్డి కృషి వల్లే ఆర్యూబీ
రాజంపేటః రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కృషి వల్లే రాజంపేటకు ఆర్యూబీ (రైల్వే అండర్ బ్రిడ్జి) మంజూరైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తెలిపారు. బుధవారం ఆర్యూబీ నిర్మిత ప్రదేశాన్ని పట్టణ వైఎస్సార్సీపీ కన్వీనరు పోలా శ్రీనువాసులరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఆకేపాటి మురళీరెడ్డి, చొప్పాయల్లారెడ్డితో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆకేపాటి మీడియాతో మాట్లాడుతూ ఈ యేడాది రైల్వే బడ్జెట్ నిర్వహించిన క్రమంలో రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. కేంద్రమంత్రి స్పందించి ఆర్యూబీని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. రైల్వే , ఆర్అండ్బీ అధికారులు సమన్వయంగా త్వరితగతిన ఆర్యూబీని పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్యూబిని మంజూరు చేసి నిర్మించడం వల్ల రాయచోటి–రాజంపేట మార్గంలో రాకపోకలు సులభతరంగా కొనసాగుతున్నాయన్నారు. అలాగే రాజంపేటకు కేంద్రీయ విద్యాలయంను తీసుకురావడంలో ఎంపీ మిథున్‌రెడ్డి కృషిని ఆయన గుర్తు చేశారు. ఇలా రాజంపేటకు అభివృద్ధికి తన వంతుగా ఎంపీ కృషి చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకేపాటి మురళీరెడ్డి మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చే అభివృద్ధి పథకాలను తామే తీసుకొచ్చినట్లుగా ఎమ్మెల్యే చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఏనాడైనా ఢిల్లీకి వెళ్లి ఈ పథకాల గురించి మంత్రులను కలిసారా అని ప్రశ్నించారు. . -
రైల్వే బడ్జెట్ తంతు
ఇదేం బడ్జెట్ మహాప్రభూ! ప్రతిసారీ ఇంతే ఏదో మేలు జరుగుతుం దని అనుకుని కోటి ఆశలు పెట్టుకుంటే ప్రతిసారీ నిరాశపర్చడమే రైల్వే బడ్జెట్ తంతుగా మారింది. మన నేతలు పార్లమెంట్లో కూర్చుని చోద్యం చూడటమే తప్ప మాట్లాడిన సందర్భాలు ఎక్కడ? కేంద్రానికి ఎప్పుడూ తెలుగు రాష్ట్రాలు అంటే చిన్నచూపే. ‘కొత్త రైలు మాట దేవుడెరుగు. ఉన్న వాటిని చక్కదిద్దితే చాలు’ అని అనుకునే సామాన్య మధ్యతరగతి ప్రయాణికుడికి మొండిచేయి మాత్రమే మిగిలింది. ప్రతి బడ్జెట్ ప్రసంగంలోనూ ప్రయాణికు లకు పెద్దపీట అని ఊక దంపుడు ఉపోద్ఘాతం చేయడమే తప్ప చేసింది మాత్రం శూన్యం. ఇంక పరిశుభ్రత గురిం చి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంక రైల్లో మామూలు బోగీలలో వెతలు వర్ణణాతీతం. ఫ్యాన్లు తిరగవు. టాయ్ లెట్లో దుర్గంధం, చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత సమ స్యలు. రైల్లో దొంగతనాల విషయం చెప్పపనిలేదు. ఐనా ఓట్లు వేసి ఇలాంటి నేతలను పార్లమెంటుకు పంపించినందుకు అనుభవించక తప్పదురా! అనుకుని సరిపెట్టుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు. ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఈ బడ్జెట్లో రైల్వే చార్జీలు బాదలేదు. అదే పదివేలు అని అనుకోవాలి. ఆందరూ ఊహించినట్లే ఆఖరుకి కలల బండి పట్టాలెక్కింది అనుకోవాలి. ఎస్. విశ్వనాథం చిక్కడపల్లి, హైదరాబాద్ -
'రైల్వే బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉంది'
హైదరాబాద్:పార్లమెంట్ లో శుక్రవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఆ బడ్జెట్ రైల్వే వ్యవస్థ అభివృద్ధికి సహకరించేలా బడ్జెట్ ఉందన్నారు. భద్రతకు, స్వచ్ఛత, శుభ్రతకు రైల్వే బడ్జెట్ లో పెద్ద పీట వేయడం గర్వించదగ్గ విషయమన్నారు. మొత్తంగా చూస్తే రైల్వే వ్యవస్థ అభివృద్ధికి సహకరించేలా ప్రస్తుత బడ్జెట్ ఉందని వెంకయ్య తెలిపారు. ధృడమైన నిర్ణయాలు తీసుకోవాలనే ప్రజలు తమకు ఓటేశారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
గౌడ.. మా గోడు ఇదీ
మెరుగైన సౌకర్యాలను పక్కనపెడితే.. కనీస సౌకర్యాలు కల్పించలేని దయనీయ స్థితి నెలకొంది. ప్రతి బడ్జెట్లో జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకోవడం.. తీరా ఆ శాఖ మంత్రి ప్రకటనలో ఎలాంటి విశేషాలు ఉండకపోవడం పరిపాటిగా మారుతోంది. ఈ అన్యాయంపై గళం విప్పే నాయకులు లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. రైల్వే శాఖ సహాయ మంత్రిగా కోట్ల కంటితుడుపు పురోగతి సాధించగా.. శాశ్వత ప్రాతిపదికన రూపురేఖలు తీసుకురాలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ సర్కారు మంగళవారం పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఎప్పటిలానే జిల్లా ప్రజలు రైల్వే శాఖ మంత్రి సదానందగౌడపై కోటి ఆశలు పెట్టుకున్నారు. గత ఫిబ్రవరి 12న యూపీఏ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చివరి ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టినా జిల్లాకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. కనీసం ఈసారైనా పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కలిగించాలని.. 44 ఏళ్ల డిమాండ్ అయిన మంత్రాలయం-కర్నూలు మధ్య కొత్త రైల్వే లైన్‌కు పచ్చజెండా ఊపాలని ప్రజలు కోరుతున్నారు. కర్నూలు (రాజ్‌విహార్): రాయలసీమ ముఖద్వారం.. రాష్ట్ర తొలి రాజధాని కర్నూలు జిల్లా అన్ని రంగాల్లో వెనుకబాటే. పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి ఎక్కడి గొంగళి అక్కడే చందంగా మారింది. ప్రధానంగా రైల్వే బడ్జెట్లో సవతి ప్రేమ కారణంగా ఏటా నిరాశే మిగులుతోంది. ప్రభుత్వాలు మారినా.. జిల్లాకు చెందిన నేత రైల్వే శాఖ బాధ్యతలు చేపట్టినా ఒరిగింది శూన్యమే కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఓ డివిజన్‌కు నోచుకోకపోగా.. కనీసం డబుల్ ట్రాక్ కూడా కరువైంది. గరీబ్థ్ ్రఊసే కరువవగా.. పలు సూపర్‌ఫాస్ట్‌లకు స్టాపింగ్ లభించని పరిస్థితి. కర్నూలుకు ప్రాధాన్యతనివ్వాలి రవాణా రంగంలో వెనుకబడిన కర్నూలుకు రైల్వే బడ్జెట్లో ప్రాధాన్యతనివ్వాలి. కర్నూలు-మంత్రాలయం కొత్త లైను ఏర్పాటుతో పాటు గతంలో ప్రకటించిన వర్క్ షాపు నిర్మాణం, కోసిగి-ఎర్నగల్లు-మంత్రాలయం డబుల్ లైను, కొల్లాపూర్-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న రైళ్లను కోసిగిలో ఆపాలి. మంత్రాలయం స్టేషన్‌ను ఆధునీకరించి మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలి. కర్నూలులో అదనపు రిజర్వేషన్ కౌంటరు ఏర్పాటు, సికింద్రాబాద్-బెంగళూరు మధ్య గరీభ్థ్ ్రరైలు, కర్నూలు-జైపూరు మధ్య కొత్త రైలు, సికింద్రాబాద్ నుంచి కర్నూలు మీదుగా గోవాకు కొత్త రైలును ఏర్పాటు చేయాలి. బెంగళూరు నుంచి కర్నూలు, సికింద్రాబాద్ మీదుగా ముంబైకి నేరుగా రైలు వేయాలి. కర్నూలు మీదుగా వెళ్లే ప్రతి రైలు సిటీ స్టేషన్లో నిలపాలి. ఈ డిమాండ్లతో ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవతో పాటు ఆ శాఖ మంత్రి సదానందగౌడను కలిసి వినతిపత్రం అందించా. కేంద్ర ప్రభుత్వం కరుణ చూపుతుందని భావిస్తున్నా. - బుట్టా రేణుక, కర్నూలు ఎంపీ ఆధ్యాత్రిక కేంద్రం మంత్రాలయం నుంచి కర్నూలు వరకు నిర్మించాల్సిన కొత్త రైల్వే లైన్ పనులకు రాజకీయ గ్రహణం పట్టింది. రెండు సార్లు సర్వే చేయగా.. నిధుల వృథాయే తప్పిస్తే ‘మార్గం’ కరువైంది. 110 కిలోమీటర్ల పొడవైన ఈ లైను ఏర్పాటుకు రూ.1100 కోట్లు అవసరమని అంచనా. కర్నూలు, పాణ్యం, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు ఉపయోగకరం. కర్నూలులో రైల్వే మిడ్‌లైఫ్ రీహాబిలిటేషన్ వర్క్‌షాపు నిర్మాణాన్ని 2013 బడ్జెట్లో ప్రతిపాదించారు. స్థల సేకరణ చేపట్టినా వివిధ కారణాలతో రద్దయినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.250కోట్లు అవసరమని అంచనా. దూపాడు వద్ద ట్రైన్ మెయింటెన్స్(నిర్వహణ) షెడ్ ఏర్పాటు చేస్తామని గతంలో మాజీ మంత్రి కోట్ల చెప్పారు. ఇందుకు రూ.2కోట్లు అవసరం. పూర్తయితే దాదాపు 5వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. జిల్లా కేంద్రం కర్నూలు నుంచి విజయవాడ వెళ్లేందుకు ఒక్క రైలు కూడా అందుబాటులో లేదు. విజయవాడ వరకు కనీసం రెండు రోజు వారీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాల్సిన అవసరం ఉంది. గుంటూరు-డోన్-గుంతకల్లు మధ్య 400 కిలోమీటర్ల మేర డబుల్ లైను, విద్యుదీకరణకు సర్వే పూర్తయినా నిధుల విడుదల మరిచారు. డోన్ మీదుగా గుంటూరు వరకు సింగిల్ లైనులో రెండు మూడు రైళ్లు మాత్రమే నడుపుతున్నారు. సిటీగా మారిన కర్నూలు స్టేషన్ ఆధునికీకరణ, మల్టీప్లెక్స్ భవన నిర్మాణం, రెండో ప్లాట్ ఫాంపై పూర్తి స్థాయి షెడ్ నిర్మాణం, ఆదోని స్టేషన్‌ను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు రూ.2కోట్లకు పైగా నిధులు అసవరం. గుత్తి నుంచి డోన్, కర్నూలు మీదుగా సికింద్రబాద్ వరకు డబుల్ లైన్, విద్యుదీకరణకు సర్వే చేసినా పెండింగ్‌లో ఉంది. తాత్కాలికంగా హాల్ట్ ఇచ్చిన కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు పూర్తి స్థాయి స్టాపింగ్ ఇవ్వాలి. అన్ని ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్టు రైళ్లను కర్నూలు రైల్వేస్టేషన్లో నిలపాలి. హోస్పెట్-మంత్రాలయం-కర్నూలు-నంద్యాల-శ్రీశైలం మీదుగా గుంటూరు రైల్వే లైన్‌ను కలుపుతూ కొత్త రైలు మార్గం నిర్మించాలి. డోన్ నుంచి కర్నూలు, గద్వాల, రాయచూరు మీదుగా ముంబైకి రైలు. అర్ధాంతరంగా నిలిచిపోయిన కడప జిల్లా ఎర్రగుంట్ల-బనగానపల్లె-నంద్యాల లైను పనులు. పెండింగ్‌లోని 20 కిలోమీటర్ల(నంద్యాల క్రాస్‌లైన్ వెంకటేశ్వరపురం వరకు) పనులు పూర్తి చేసేందుకు, అసంపూర్తిగా ఉన్న బనగానపల్లె, కోవెలకుంట్ల రైల్వే స్టేషన్ల పనుల పూర్తికి రూ.70 కోట్లు అవసరం. సికింద్రాబాద్ నుంచి బెంగళూరు వరకు గరీబ్థ్ ్రనడపాలి. విజయవాడ నుంచి నంద్యాల, ద్రోణాచలం, కర్నూలు, హైదరాబాద్ మీదుగా రాజ్‌కోట్ వరకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఆదోని మీదుగా ఔరంగాబాద్ నుంచి రేణిగుంట, యశ్వంత్‌పూర్ నుంచి ఆదోని మీదుగా కాటా(ఉత్తరప్రదేశ్) వరకు రైలు. కర్నూలు నంద్యాల మధ్య వారంలో ఐదు రోజులు నడుస్తున్న డెమూ ప్యాసింజరు రైలును ప్రతి రోజూ నడపడంతోపాటు ఇందులో మూత్రశాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. కర్నూలు-హైదరాబాద్ మధ్య నడుస్తున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలును డోన్ వరకు పొడిగించాలి. కర్నూలు- విజయవాడ మధ్య ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు. కర్నూలులోని కృష్ణానగర్, గుత్తి పెట్రోల్ బంక్ వద్ద, డోన్, బేతంచెర్ల వద్ద అండర్‌గ్రౌండ్ బ్రిడ్జి, ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు శంకుస్థాపన చేసి నాలుగు నెలలు గడిచినా లభించని మోక్షం. తెనాలి, రేపల్లె, గుంటూరు మధ్య నడుస్తున్న ప్యాసింజరు రైలును ఇటీవలే ప్రకాశం జిల్లా మార్కాపురం వరకు పొడగించారు. దీనిని నంద్యాల మీదుగా డోన్, కర్నూలు వరకు నడపాలి. మచిలీపట్నం నుంచి ముంబయికి డోన్ మీదుగా రైలు ప్రవేశపెట్టాలని రెండేళ్ల క్రితం బడ్జెట్లో ప్రకటించినా అమలు కాకపోవడం. డోన్ రైల్వేస్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్‌ను 8 నుంచి 12 గంటల వరకు పొడిగించాలి. మరో రెండు ప్లాట్‌ఫాంల నిర్మాణం చేపట్టాలి. -
ఖర్గే రైలూ కర్ణాటకకేనా?
సందర్భం: వి. దిలీప్ కుమార్, ఎం. రోజాలక్ష్మి రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు రాకపోవటానికి మన ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. వారికి స్వప్రయోజనాలు, ప్రాంతీయవాదాలు తప్ప, ప్రజల ప్రయోజనాలు, సామాజిక అవసరాల పట్ల శ్రద్ధ లేదు. దీనితో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైలు ప్రయాణం ఓ శాపంలా, అదే సమయంలో ఒక కలగా మిగిలింది. రైలు ప్రయాణం ఓ మధురానుభూతి. కానీ నూట ఇరవై కోట్ల భారతీయులను ఆ అనుభూతులకు ఆమడ దూరంలో ఉంచటంలో పాలకులు 65 ఏళ్లుగా సఫలీకృతులవుతూనే ఉన్నారు. ఆంగ్లేయులు దేశంలో 54 వేల కిలోమీటర్ల రైలు మార్గాన్ని నిర్మిస్తే, మన పాల కులకు కేవలం 12 వేల కి.మీ. మార్గాన్ని నిర్మించేందుకు ఆరున్నర దశాబ్దాలు పట్టింది. రైల్వేల మీద మన పాలకుల శ్రద్ధకు ఇదే నిదర్శనం. పొరుగున ఉన్న చైనా 92 వేల కి.మీ. రైలు మార్గం నిర్మించి సత్తా చాటుకుంది. మన రైల్వేల విస్తరణ , ప్రగతి యావత్ భారతావనికి చెందక, రైల్వే మంత్రుల సొంత రాష్ట్రాలకే పరిమి తమైంది. నేడు పార్లమెంటు ముందుకు మరో రైల్వే బడ్జెట్ రాబోతు న్నది. ఇది కర్ణాటకకే పరిమితమౌతుందా? లేక భారతీయులందరికీ ఉపయోగపడుతుందా? రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే రైలు స్వరాష్ట్రం కర్ణాటకకేనా? ఇతర రాష్ట్రాలకూ వస్తుందా? వేచి చూడాలి. నత్తనడకన మార్గాల నిర్మాణం దేశంలో 1853లో రైల్వే ప్రస్థానం ప్రారంభమయ్యింది. ఆంగ్లేయులు 93 ఏళ్ల కాలంలో 54 వేల కి.మీ. రైలు మార్గాన్ని నిర్మించి వెళ్లారు. మన పాలకులు, రైలు మార్గాల నిర్మాణాన్ని దశాబ్దాల కాలం పొడిగిస్తూ, వ్యయ అంచనాలు పెంచుతూ ప్రజలను అవస్థలపాలు చేస్తున్నారు. 1947లో దేశ జనా భా 35 కోట్లు. గత 66 ఏళ్లలో 120 కోట్లకు చేరింది. పెరిగిన 85 కోట్ల జనాభాకు మనం నిర్మించుకున్న రైలు మార్గం 11 వేల కి.మీ. మాత్రమే. ఇక్కడా ఒక రక మైన వివక్షే. తమిళనాడులో (1,000 కి.మీ. వైశాల్యంలో) 37 కి.మీ. రైలు మార్గం, బెంగాల్లో 41.8 కి.మీ. రైలు మార్గం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించినది 8.8 కి.మీ. రైల్వే శాఖను చేపట్టిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ (బీహార్), మమతా బెనర్జీ(పశ్చిమ బెంగాల్) జాఫర్ షరీఫ్ (కర్ణాటక) రైల్వేల అభివృద్ధిని వారి సొంత రాష్ట్రాలకే పరిమితం చేసుకున్నారు. పెరిగిన ప్రమాదాలు ఉన్న మార్గాలలోనే కొత్త రైళ్లు ప్రవేశపెట్టడంతో ఒత్తిడి పెరిగి, తరచూ ప్రమా దాలు జరుగుతున్నాయి. వాటి తీవ్రత, నష్టం పెరిగిపోతున్నాయి. రైల్వేల భద్ర తపై అనిల్ కకోద్కర్ సారథ్యంలో హైలెవల్ సేఫ్టీ కమిటీని నియమించారు. లక్ష కోట్ల వ్యయం కాగల సిఫారసులను కకోద్కర్ చేశారు. రైల్వేల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన శ్యాంపిట్రోడా కమిటీ ఆధునీకరణకు 8,39,140 కోట్ల వ్యయం అవుతుందని, ఈ వ్యంలో 2,50,000 కోట్లను ప్రభుత్వమే గ్రాంటుగా ఇవ్వాలని సిఫారసు చేసింది. కానీ 2013లో ప్రభుత్వం ఇందుకు విదిల్చింది 24 వేల కోట్లు. 1963-64లో 74 శాతం ఉన్న నిర్వహణ వ్యయం ప్రస్తుతం 95 శాతానికి చేరింది. ఇది రైల్వేల ఉనికికే పెనుముప్పుగా మారింది. సిబ్బంది కొరత సరేసరి. చాలినంత మంది డ్రైవర్లు లేక రేయింబవళ్లు విశ్రాంతి లేకుండా వారే పని చేస్తూ ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పట్టాల మార్పిడి, నిర్వహణలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా రైళ్లు నడుస్తుండటం వలన వాటి మరమ్మతులు కష్టసాధ్యంగా మారింది. ఒకప్పుడు 16 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 13.80 లక్షలకు చేరింది. ఖాళీగా ఉన్న దాదాపు రెండు లక్షల ఉద్యోగాలను త్వరితగతిన భర్తీ చేయనిదే రైల్వేల నిర్వహణ మెరుగుపడదు. గౌతమి ఎక్స్‌ప్రెస్, తమిళనాడు ఎక్స్‌ప్రెస్, నాందేడ్ ఎక్స్‌ప్రెస్, అమృత్సర్ ఎక్స్‌ప్రెస్‌ల అగ్ని ప్రమాదాలన్నీ వేకువ జామున జరిగినవే. సిబ్బంది అప్రమత్తంగాలేక, విధినిర్వహణలో అలసత్వం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. మనకి ఎప్పుడూ మొండిచేయే మన రాష్ట్రం సంగతి చూస్తే రైల్వే మంత్రివర్యులు ఎప్పుడూ మొండిచేయి చూప డం ఆనవాయితీగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 10 సంవత్సరాలకు సికిం ద్రాబాద్ కేంద్రంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఏర్పడింది. ఆనాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో పూర్తయిన మార్గం నడికుడి-బీబీనగర్ లైను మాత్రమే. దశాబ్దాల క్రితం చేపట్టిన పెద్దపల్లి- కరీంనగర్- నిజామాబాద్ లైను నిర్మాణం నత్తనడకన సాగుతోంది. పెద్దపల్లి-కరీంనగర్ మధ్య 12 సంవత్సరాల క్రితం పూర్తయినా, కరీంనగర్-నిజామాబాద్‌ల మధ్య రెండు దశాబ్దాలకు పైగా పనులు నడుస్తూనే ఉన్నాయి. గద్వాల- రాయచూర్, మునీరాబాద్ - మహబూబ్‌నగర్, మనోహరా బాద్ - కొత్తపల్లి, మాచర్ల- నల్లగొండ, ధర్మవరం -పాకాల, విష్ణుపురం, కడప- బెంగళూరులు ఉన్నాయి. ఇవికాక శ్రీకాళహస్తి- నడికుడి (380 కి.మీ.), భద్రా చలం- కొవ్వూరు (150 కి.మీ) ఒంగోలు- దొనకొండ (87 కి.మీ). జడ్చర్ల- నంద్యాల (188 కి.మీ.), మణుగూరు - రామగుండం (190 కి.మీ), కంభం - ప్రొద్దుటూరు (110 కి.మీ) లైన్లు ఎన్నిసార్లు సర్వేలు పూర్తి చేసుకున్నప్పటికీ, రైల్వే బోర్డు ఆమోదం కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్నాయి. ఇవికాక కొండపల్లి-కొత్తగూడెం, తడికలపూడి - కొయ్యలగూడెం, గద్వాల్- మాచర్ల, గూడూరు- దుర్గరాజపట్నం, మార్కాపూర్ రోడ్డు - శ్రీశైలం, సికింద్రా బాద్- భువనగిరి (3వ లైను) నిర్మాణానికి సర్వే పనులు జరుగుతుండగా సికింద్రాబాద్- భువనగిరి మధ్య మూడవ లైను నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టవలసి ఉంది. సికింద్రాబాద్ స్టేషన్లో ప్లాట్‌ఫారాల సంఖ్య పెంచటం, ఎంఎంటీఎస్ రెండవ దశ పనులను చేపట్టడం లాంటివి ఎంతో ముఖ్యమైనవి. నడికుడి - శ్రీకాళహస్తి, కొవ్వూరు- భద్రాచలం లైన్లకు అనుమతి లభించి 4 సంవ త్సరాలు గడచినా, ఇంత వరకు ఈ లైన్ల నిర్మాణ పనులు మొదలు కాలేదు. ఈ లైన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే మంత్రి త్వశాఖ 50:50 శాతం నిధులు సమకూర్చేందుకు అంగీకరించాయి. ఈ రెండు లైన్ల నిర్మాణం జరిగితే చెన్నై- హైదరాబాద్ మధ్య దూరం తగ్గుతుంది. అంతేకాక గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలకు రైలు సౌక ర్యం ఏర్పడుతుంది. రాష్ట్రంలో ముఖ్య నగరాలు విశాఖ, కాకినాడ, తిరుపతిల నుంచి వచ్చే రైళ్లు రద్దీగా ఉండటమే కాక, మూడు నెలల ముందే రిజర్వేషన్లు చేసుకోవాల్సి వస్తున్నది. అత్యవసరంగా రైలు ప్రయాణం అంటే 8 గంటల ప్రయాణానికి 8 గంటలు తత్కాల్ క్యూలలో నిలబడి మనవాళ్లు టికెట్ తీసుకో వలసివస్తున్నది. రైలు రిజర్వేషన్ కన్నా విమానం టికెట్ తీసుకోవటం సులభం. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే కారణం రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు రాకపోవటానికి మన ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. వారికి స్వప్రయోజనాలు, ప్రాంతీయ వాదాలు తప్ప, ప్రజల ప్రయోజనాలు, సామాజిక అవసరాల పట్ల శ్రద్ధ లేదు. దీనితో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైలు ప్రయాణం ఓ శాపంలా, అదే సమయంలో ఒక కలగా మిగిలింది. రైల్వేల అభివృద్ధి విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు ప్రజావ్యతి రేకమైనవి. ఇప్పుడు ఉన్నది ఎల్లలు లేని ప్రపంచం. ఆ ప్రపంచంలో దేశాలన్నీ స్వేచ్ఛగా పరుగులు తీస్తున్నాయి. కేంద్రం వైఖరితో రాష్ట్రంలోనే ఒక చోట నుంచి మరో చోటుకు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లలేని దయనీయస్థితి. ఇక నైనా కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరిగేలా చూడాలి. రాష్ట్రాలలో జరిగే కొత్త లైన్ల నిర్మాణానికి, ఆయా రాష్ట్రాలు సగం వాటా భరించేలా నిర్ణయాలు జర గాలి. అవసరాలు, ప్రజాప్రయోజనాల ప్రాతిపదికన నిధులు ఇవ్వాలి. ఎక్కువ లైన్ల నిర్మాణానికి అరకొర నిధులు ఇవ్వటం కాదు. ప్రతి రాష్ట్రంలో ఒకటి, లేదా రెండు లైన్లకు ఎక్కువ నిధులు కేటాయించి, త్వరితగతిన కొన్ని రైల్వే లైన్లు అందుబాటులోకి తేవాలి. అలాగే నిర్ణయాలు తీసుకోవడం కాదు, వాటి అమ లుకు కేంద్రం మొద్దు నిద్ర నుంచి వెంటనే మేల్కొనాలి. (వ్యాసకర్తలు సోషల్ అవేర్నెస్ కాంపెయిన్ సంస్థ సభ్యులు)