ఖర్గే రైలూ కర్ణాటకకేనా? | Mallikarjun Kharge will show partiality on on Karnataka | Sakshi
Sakshi News home page

ఖర్గే రైలూ కర్ణాటకకేనా?

Published Wed, Feb 12 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM

ఖర్గే రైలూ కర్ణాటకకేనా?

ఖర్గే రైలూ కర్ణాటకకేనా?

 సందర్భం: వి. దిలీప్ కుమార్, ఎం. రోజాలక్ష్మి
 
 
 రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు రాకపోవటానికి మన ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. వారికి స్వప్రయోజనాలు, ప్రాంతీయవాదాలు తప్ప, ప్రజల ప్రయోజనాలు, సామాజిక అవసరాల పట్ల శ్రద్ధ లేదు. దీనితో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైలు ప్రయాణం ఓ శాపంలా, అదే సమయంలో ఒక కలగా మిగిలింది.
 
 రైలు ప్రయాణం ఓ మధురానుభూతి. కానీ నూట ఇరవై కోట్ల భారతీయులను ఆ అనుభూతులకు ఆమడ దూరంలో ఉంచటంలో పాలకులు 65 ఏళ్లుగా సఫలీకృతులవుతూనే ఉన్నారు. ఆంగ్లేయులు దేశంలో 54 వేల కిలోమీటర్ల రైలు మార్గాన్ని నిర్మిస్తే, మన పాల కులకు కేవలం 12 వేల కి.మీ. మార్గాన్ని నిర్మించేందుకు ఆరున్నర దశాబ్దాలు పట్టింది. రైల్వేల మీద మన పాలకుల శ్రద్ధకు ఇదే నిదర్శనం. పొరుగున ఉన్న చైనా 92 వేల కి.మీ. రైలు మార్గం నిర్మించి సత్తా చాటుకుంది. మన రైల్వేల విస్తరణ , ప్రగతి యావత్ భారతావనికి చెందక, రైల్వే మంత్రుల సొంత రాష్ట్రాలకే పరిమి తమైంది. నేడు పార్లమెంటు ముందుకు మరో రైల్వే బడ్జెట్ రాబోతు న్నది. ఇది కర్ణాటకకే పరిమితమౌతుందా? లేక భారతీయులందరికీ ఉపయోగపడుతుందా? రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే రైలు స్వరాష్ట్రం కర్ణాటకకేనా? ఇతర రాష్ట్రాలకూ వస్తుందా? వేచి చూడాలి.
 
 నత్తనడకన మార్గాల నిర్మాణం
 
 దేశంలో 1853లో రైల్వే ప్రస్థానం ప్రారంభమయ్యింది. ఆంగ్లేయులు 93 ఏళ్ల కాలంలో 54 వేల కి.మీ. రైలు మార్గాన్ని నిర్మించి వెళ్లారు. మన పాలకులు, రైలు మార్గాల నిర్మాణాన్ని దశాబ్దాల కాలం పొడిగిస్తూ, వ్యయ అంచనాలు పెంచుతూ ప్రజలను అవస్థలపాలు చేస్తున్నారు. 1947లో దేశ జనా భా 35 కోట్లు. గత 66 ఏళ్లలో 120 కోట్లకు చేరింది. పెరిగిన 85 కోట్ల జనాభాకు మనం నిర్మించుకున్న రైలు మార్గం 11 వేల కి.మీ. మాత్రమే. ఇక్కడా ఒక రక మైన వివక్షే. తమిళనాడులో (1,000 కి.మీ. వైశాల్యంలో) 37 కి.మీ. రైలు మార్గం, బెంగాల్‌లో 41.8 కి.మీ. రైలు మార్గం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించినది 8.8 కి.మీ. రైల్వే శాఖను చేపట్టిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ (బీహార్), మమతా బెనర్జీ(పశ్చిమ బెంగాల్) జాఫర్ షరీఫ్ (కర్ణాటక) రైల్వేల అభివృద్ధిని వారి సొంత రాష్ట్రాలకే పరిమితం చేసుకున్నారు.
 
 పెరిగిన ప్రమాదాలు
 
 ఉన్న మార్గాలలోనే కొత్త రైళ్లు ప్రవేశపెట్టడంతో ఒత్తిడి పెరిగి, తరచూ ప్రమా దాలు జరుగుతున్నాయి. వాటి తీవ్రత, నష్టం పెరిగిపోతున్నాయి. రైల్వేల భద్ర తపై అనిల్ కకోద్కర్ సారథ్యంలో హైలెవల్ సేఫ్టీ కమిటీని నియమించారు. లక్ష కోట్ల వ్యయం కాగల సిఫారసులను కకోద్కర్ చేశారు. రైల్వేల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన శ్యాంపిట్రోడా కమిటీ ఆధునీకరణకు 8,39,140 కోట్ల వ్యయం అవుతుందని, ఈ వ్యంలో 2,50,000 కోట్లను ప్రభుత్వమే గ్రాంటుగా ఇవ్వాలని సిఫారసు చేసింది. కానీ 2013లో ప్రభుత్వం ఇందుకు విదిల్చింది 24 వేల కోట్లు.
 
 1963-64లో 74 శాతం ఉన్న నిర్వహణ వ్యయం ప్రస్తుతం 95 శాతానికి చేరింది. ఇది రైల్వేల ఉనికికే పెనుముప్పుగా మారింది. సిబ్బంది కొరత సరేసరి. చాలినంత మంది డ్రైవర్లు లేక రేయింబవళ్లు విశ్రాంతి లేకుండా వారే పని చేస్తూ ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పట్టాల మార్పిడి, నిర్వహణలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా రైళ్లు నడుస్తుండటం వలన వాటి మరమ్మతులు కష్టసాధ్యంగా మారింది.
 
 ఒకప్పుడు 16 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 13.80 లక్షలకు చేరింది. ఖాళీగా ఉన్న దాదాపు రెండు లక్షల ఉద్యోగాలను త్వరితగతిన భర్తీ చేయనిదే రైల్వేల నిర్వహణ మెరుగుపడదు. గౌతమి ఎక్స్‌ప్రెస్, తమిళనాడు ఎక్స్‌ప్రెస్, నాందేడ్ ఎక్స్‌ప్రెస్, అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్‌ల అగ్ని ప్రమాదాలన్నీ వేకువ జామున జరిగినవే. సిబ్బంది అప్రమత్తంగాలేక, విధినిర్వహణలో అలసత్వం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి.
 
 మనకి ఎప్పుడూ మొండిచేయే
 
 మన రాష్ట్రం సంగతి చూస్తే రైల్వే మంత్రివర్యులు ఎప్పుడూ మొండిచేయి చూప డం ఆనవాయితీగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 10 సంవత్సరాలకు సికిం ద్రాబాద్ కేంద్రంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఏర్పడింది. ఆనాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో పూర్తయిన మార్గం నడికుడి-బీబీనగర్ లైను మాత్రమే. దశాబ్దాల క్రితం చేపట్టిన పెద్దపల్లి- కరీంనగర్- నిజామాబాద్ లైను నిర్మాణం నత్తనడకన సాగుతోంది. పెద్దపల్లి-కరీంనగర్ మధ్య 12 సంవత్సరాల క్రితం పూర్తయినా, కరీంనగర్-నిజామాబాద్‌ల మధ్య రెండు దశాబ్దాలకు పైగా పనులు నడుస్తూనే ఉన్నాయి. గద్వాల- రాయచూర్, మునీరాబాద్ - మహబూబ్‌నగర్, మనోహరా బాద్ - కొత్తపల్లి, మాచర్ల- నల్లగొండ, ధర్మవరం -పాకాల, విష్ణుపురం, కడప- బెంగళూరులు ఉన్నాయి. ఇవికాక శ్రీకాళహస్తి- నడికుడి (380 కి.మీ.), భద్రా చలం- కొవ్వూరు (150 కి.మీ) ఒంగోలు- దొనకొండ (87 కి.మీ). జడ్చర్ల- నంద్యాల (188 కి.మీ.), మణుగూరు - రామగుండం (190 కి.మీ), కంభం - ప్రొద్దుటూరు (110 కి.మీ) లైన్లు ఎన్నిసార్లు సర్వేలు పూర్తి చేసుకున్నప్పటికీ, రైల్వే బోర్డు ఆమోదం కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్నాయి.
 
 ఇవికాక కొండపల్లి-కొత్తగూడెం, తడికలపూడి - కొయ్యలగూడెం, గద్వాల్- మాచర్ల, గూడూరు- దుర్గరాజపట్నం, మార్కాపూర్ రోడ్డు - శ్రీశైలం, సికింద్రా బాద్- భువనగిరి (3వ లైను) నిర్మాణానికి సర్వే పనులు జరుగుతుండగా సికింద్రాబాద్- భువనగిరి మధ్య మూడవ లైను నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టవలసి ఉంది. సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్లాట్‌ఫారాల సంఖ్య పెంచటం, ఎంఎంటీఎస్ రెండవ దశ పనులను చేపట్టడం లాంటివి ఎంతో ముఖ్యమైనవి. నడికుడి - శ్రీకాళహస్తి, కొవ్వూరు- భద్రాచలం లైన్లకు అనుమతి లభించి 4 సంవ త్సరాలు గడచినా, ఇంత వరకు ఈ లైన్ల నిర్మాణ పనులు మొదలు కాలేదు. ఈ లైన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే మంత్రి త్వశాఖ 50:50 శాతం నిధులు సమకూర్చేందుకు అంగీకరించాయి. ఈ రెండు లైన్ల నిర్మాణం జరిగితే చెన్నై- హైదరాబాద్ మధ్య దూరం తగ్గుతుంది. అంతేకాక గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలకు రైలు సౌక ర్యం ఏర్పడుతుంది. రాష్ట్రంలో ముఖ్య నగరాలు విశాఖ, కాకినాడ, తిరుపతిల నుంచి వచ్చే రైళ్లు రద్దీగా ఉండటమే కాక, మూడు నెలల ముందే రిజర్వేషన్లు చేసుకోవాల్సి వస్తున్నది. అత్యవసరంగా రైలు ప్రయాణం అంటే 8 గంటల ప్రయాణానికి 8 గంటలు తత్కాల్ క్యూలలో నిలబడి మనవాళ్లు టికెట్ తీసుకో వలసివస్తున్నది. రైలు రిజర్వేషన్ కన్నా విమానం టికెట్ తీసుకోవటం సులభం.
 
 ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే కారణం
 
 రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు రాకపోవటానికి మన ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. వారికి స్వప్రయోజనాలు, ప్రాంతీయ వాదాలు తప్ప, ప్రజల ప్రయోజనాలు, సామాజిక అవసరాల పట్ల శ్రద్ధ లేదు. దీనితో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైలు ప్రయాణం ఓ శాపంలా, అదే సమయంలో ఒక కలగా మిగిలింది.
 
  రైల్వేల అభివృద్ధి విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు ప్రజావ్యతి రేకమైనవి. ఇప్పుడు ఉన్నది ఎల్లలు లేని ప్రపంచం. ఆ ప్రపంచంలో దేశాలన్నీ స్వేచ్ఛగా పరుగులు తీస్తున్నాయి. కేంద్రం వైఖరితో రాష్ట్రంలోనే ఒక చోట నుంచి మరో చోటుకు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లలేని దయనీయస్థితి. ఇక నైనా కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరిగేలా చూడాలి. రాష్ట్రాలలో జరిగే కొత్త లైన్ల నిర్మాణానికి, ఆయా రాష్ట్రాలు సగం వాటా భరించేలా నిర్ణయాలు జర గాలి. అవసరాలు, ప్రజాప్రయోజనాల ప్రాతిపదికన నిధులు ఇవ్వాలి. ఎక్కువ లైన్ల నిర్మాణానికి అరకొర నిధులు ఇవ్వటం కాదు. ప్రతి రాష్ట్రంలో ఒకటి, లేదా రెండు లైన్లకు ఎక్కువ నిధులు కేటాయించి, త్వరితగతిన కొన్ని రైల్వే లైన్లు అందుబాటులోకి తేవాలి. అలాగే నిర్ణయాలు తీసుకోవడం కాదు, వాటి అమ లుకు కేంద్రం మొద్దు నిద్ర నుంచి వెంటనే మేల్కొనాలి.
 
 (వ్యాసకర్తలు సోషల్ అవేర్‌నెస్ కాంపెయిన్ సంస్థ సభ్యులు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement