ఇక.. వేగంగా ట్రిప్లింగ్‌ | The rapid tripling .. | Sakshi
Sakshi News home page

ఇక.. వేగంగా ట్రిప్లింగ్‌

Published Wed, Aug 24 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

ఇక.. వేగంగా ట్రిప్లింగ్‌

ఇక.. వేగంగా ట్రిప్లింగ్‌

  • కాజీపేట– బల్లార్షా మధ్య నిర్మాణం
  •  రూ. 2063 కోట్ల అంచనా వ్యయం
  •  ప్రణాళిక సిద్ధం చేసిన కేంద్రం
  •  బీవోటీ పద్ధతిలో పనులు ?
  • సాక్షి, హన్మకొండ : నాలుగేళ్లుగా నత్తనడకన సాగుతున్న కాజీపేట–బల్లార్ష ట్రిప్లింగ్‌ పనులు వేగం పుంజుకోనున్నాయి. ఐదేళ్ల వ్యవధిలో ఈ పనులు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారీగా నిధులు సమీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మహారాష్ట్రలోని బల్లార్ష–కాజీపేట మధ్య ఉన్న 201 కిలోమీటర్ల డబ్లింగ్‌ (అప్‌లైన్, డౌన్‌లైన్‌) రైలు మార్గాన్ని ట్రిప్లింగ్‌ (మూడోలైను)గా అభివద్ధి చేస్తున్నారు. ఐదేళ్ల కిందట ఈ పనులు ప్రారంభమైనా నిధుల లేమి కారణంగా నత్తనడకన సాగుతున్నాయి.
     
    ఐదేళ్ల వ్యవధిలో కనీసం యాభై కిలోమీటర్ల ట్రాక్‌ను నిర్మించలేక పోయారు. కేవలం మంచిర్యాల వద్ద గోదావరి నదిపై మూడో వంతెన నిర్మాణం పూర్తయింది. ఈ వంతెనకు అటు ఇటు కొన్ని కిలోమీటర్ల వరకే ట్రిప్లింగ్‌ పనులు జరిగాయి. రోజురోజుకి ఈ మార్గంలో పెరుగుతున్న రద్దీని తట్టుకునేందుకు మూడో మార్గం తప్పనిసరైంది. దీంతో ట్రిప్లింగ్‌ పనులు వేగం పెంచేందుకు  నిధుల సమీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. బల్లార్షా – కాజీపేట ట్రిప్లింగ్‌కు నిర్మాణంపై ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు ట్రిప్లింగ్‌ పనులకు రూ.2063 కోట్ల వ్యయం అవుతుందని కేంద్ర ఆర్థికశాఖ అంచనా వేసింది. ఈ నిధులను రైల్వేశాఖ, ప్రైవేటు సంస్థల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. మూడోలైను ద్వారా ఎక్కువగా వాణిజ్య పరమైన సరుకుల రవాణా (గూడ్సు)కు ఉపయోగించనున్నారు. దీంతో ట్రిప్లింగ్‌ పనులను బిల్డ్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ (బీఓటీ) పద్ధతిలో చేపట్టడంపై చర్చలు జరుగుతున్నాయి.
     
    ఐదేళ్లుగా..
    చెన్నై – న్యూఢిల్లీ గ్రాండ్‌ట్రంక్‌ మార్గంలో నాగ్‌పూర్‌ – విజయవాడ వరకు ఉన్న మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది. ఈ మార్గంలో బల్లార్ష – కాజీపేట – విజయవాడల మధ్య ఉన్న 400 కిలోమీటర్ల మార్గంలో ప్రస్తుతం అప్‌లైన్, డౌన్‌లైను నిరంతరం రద్దీగా ఉంటున్నాయి. ఈ మార్గంలో కొత్త రైలును ప్రవేశపెట్టడం కష్టమయ్యే పరిస్థితి నెలకొంది. రద్దీ కారణంగా గూడ్సు రైళ్లు గంటల తరబడి ఆలస్యమవుతున్నాయి. ఈ సమస్యను నివారించేందుకు 2012–13 రైల్వే బడ్జెట్‌లో బల్లార్షా – కాజీపేట – విజయవాడ మార్గాన్ని ట్రిప్లింగ్‌ (మూడోలైను) చేస్తామని రైల్వేమంత్రి ప్రకటించారు. గత నాలుగేళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. బెల్లంపల్లి – పెద్దపల్లిల మధ్య ఈ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement