ఇదేం బడ్జెట్ మహాప్రభూ! ప్రతిసారీ ఇంతే ఏదో మేలు జరుగుతుం దని అనుకుని కోటి ఆశలు పెట్టుకుంటే ప్రతిసారీ నిరాశపర్చడమే రైల్వే బడ్జెట్ తంతుగా మారింది. మన నేతలు పార్లమెంట్లో కూర్చుని చోద్యం చూడటమే తప్ప మాట్లాడిన సందర్భాలు ఎక్కడ? కేంద్రానికి ఎప్పుడూ తెలుగు రాష్ట్రాలు అంటే చిన్నచూపే. ‘కొత్త రైలు మాట దేవుడెరుగు. ఉన్న వాటిని చక్కదిద్దితే చాలు’ అని అనుకునే సామాన్య మధ్యతరగతి ప్రయాణికుడికి మొండిచేయి మాత్రమే మిగిలింది. ప్రతి బడ్జెట్ ప్రసంగంలోనూ ప్రయాణికు లకు పెద్దపీట అని ఊక దంపుడు ఉపోద్ఘాతం చేయడమే తప్ప చేసింది మాత్రం శూన్యం. ఇంక పరిశుభ్రత గురిం చి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంక రైల్లో మామూలు బోగీలలో వెతలు వర్ణణాతీతం. ఫ్యాన్లు తిరగవు. టాయ్ లెట్లో దుర్గంధం, చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత సమ స్యలు. రైల్లో దొంగతనాల విషయం చెప్పపనిలేదు. ఐనా ఓట్లు వేసి ఇలాంటి నేతలను పార్లమెంటుకు పంపించినందుకు అనుభవించక తప్పదురా! అనుకుని సరిపెట్టుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు. ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఈ బడ్జెట్‌లో రైల్వే చార్జీలు బాదలేదు. అదే పదివేలు అని అనుకోవాలి. ఆందరూ ఊహించినట్లే ఆఖరుకి కలల బండి పట్టాలెక్కింది అనుకోవాలి.
ఎస్. విశ్వనాథం చిక్కడపల్లి, హైదరాబాద్
రైల్వే బడ్జెట్ తంతు
Published Tue, Mar 3 2015 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM
Advertisement