కోస్తాకు వర్ష సూచన : విశాఖ వాతావరణ కేంద్రం
విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తాలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బంగ్లాదేశ్ వైపు తరలిందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్కు ఆనుకుని వాయుగండం కేంద్రీకృతమైందన్నారు. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని తెలిపారు. తీరం వెంబడి 45-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని...మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.