హమ్మయ్య... వానలొచ్చాయి
హమ్మయ్య... వానలొచ్చాయి
Published Sat, Aug 27 2016 10:22 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
మచిలీపట్నం :
ముఖం చాటేసిన వరుణులు ఎట్టకేలకు కరుణించాడు. వేసవిని తలపించిన ఎండలు, సెగల నుంచి ఉపశమనం లభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రెండురోజులుగా జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అల్పపీడనం ప్రభావంతో మరో రెండురోజుల పాటు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షం కురవటంతో మచిలీపట్నం, పెడన, కృత్తివెన్ను, బంటుమిల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. శనివారం ఉదయం 8గంటల వరకు జిల్లాలో సగటు వర్షపాతం 9.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. కోడూరులో అత్యధికంగా 54.6 మిల్లీమీటర్లు, కంకిపాడులో అత్యల్పంగా 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాలువలకు నీరు సక్రమంగా రాని నేప«థ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు వ్యవసాయ పనులకు ఎంతగానో ఉపయోగపడతాయని రైతులు చెబుతున్నారు. వర్షాలతో వరినాట్లు కొంతమేర ఊపందుకున్నాయి. పశ్చిమకృష్ణాలో సాగు చేసిన పత్తికి ఈ వర్షాలు మేలు చేస్తాయని రైతులు చెబుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి.
జిల్లాలో వర్షపాతం వివరాలు
జగ్గయ్యపేట 42.4 మిల్లీమీటర్లు, వత్సవాయి 7.6, పెనుగంచిప్రోలు 12.0, నందిగామ 15.4, చందర్లపాడు 45.6, కంచికచర్ల 10.4, వీరులపాడు 6.6, ఇబ్రహీంపట్నం 1.2, ఎ.కొండూరు 8.8, గంపలగూడెం 17.8, తిరువూరు 6.2, విస్సన్నపేట 13.4, విజయవాడ రూరల్, అర్బన్ 23.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెనమలూరు 7.5 మిల్లీమీటర్లు, తోట్లవల్లూరు 5.0, నూజివీడు 1.2, ఉయ్యూరు 3.2, మొవ్వ 1.2, చల్లపల్లి 3.6, మోపిదేవి 3.2, అవనిగడ్డ 11.2, నాగాయలంక 16.4, గూడూరు 15.2, పామర్రు 10.0, గుడ్లవల్లేరు 5.6, పెడన 4.8, బంటుమిల్లి 51.2, ముదినేపల్లి 8.2, కైకలూరు, కలిదిండి 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Advertisement