
హైదరాబాద్: భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న భాగ్యనగరంలో వరద సహాయక చర్యల కోసం ఆర్మీ రంగంలోకి దిగింది. మరి కొన్నిరోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో వరద తగ్గే వరకూ సహకారం అందించాలని ప్రభుత్వం ఆర్మీకి విజ్ఞప్తి చేయడంతో.. నాలుగు ఆర్మీ బృందాలు బేగంపేట్, నిజాంపేట, హకింపేట, అల్వాల్ ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. జీహెచ్ఎంసీ సమన్వయంతో ఆర్మీ సహాయకచర్యలు చేపడుతోంది. ఆర్మీతో సమన్వయం చేసుకునేందుకు జీహెచ్ఎంసీ తరఫున ముగ్గురు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆర్మీ సిబ్బంది ఇప్పటికే ఆల్వాల్లో పర్యటించి అక్కడి వరద ప్రభావిత ప్రాంతంలో అందించడానికి మెడికల్ కిట్లతో పాటు ఇతర సామాగ్రిని సిద్ధం చేసింది.


