
సాక్షి, విశాఖపట్నం: రాయలసీమ, తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో జూన్ 1, 2 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు మబ్బులతో కూడిన వాతావరణం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు ఆదివారం 1 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో భీమిలిలో 3 సెం.మీ, సాలూరు, వెంకటగిరి కోటలో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది.
మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని తూర్పు మధ్య అరేబియా సముద్రం, లక్షదీవుల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. సోమవారం ఇదే ప్రాంతంలో వాయుగుండంగా మారనుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తదుపరి 24 గంటల్లో తుపానుగా మారుతుందని పేర్కొంది. తుపానుగా మారిన తర్వాత ఉత్తర దిశగా ప్రయాణించి ఈ నెల 3వ తేదీ నాటికి ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ తీరాలకు చేరుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment