ధోబీఘాట్ స్థలాన్ని ఆక్రమిస్తే ఉతికేస్తాం | Rajaka Welfare Association state president M. RAMBABU fire on government | Sakshi
Sakshi News home page

ధోబీఘాట్ స్థలాన్ని ఆక్రమిస్తే ఉతికేస్తాం

Published Tue, Mar 22 2016 4:08 AM | Last Updated on Sun, Sep 3 2017 8:16 PM

ధోబీఘాట్ స్థలాన్ని   ఆక్రమిస్తే ఉతికేస్తాం

ధోబీఘాట్ స్థలాన్ని ఆక్రమిస్తే ఉతికేస్తాం

రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రాంబాబు
 
కర్నూలు(అర్బన్)/న్యూసిటీ:  జిల్లాలోని ఆదోని పట్టణంలో ధోబీఘాట్‌కు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని తిరిగి ప్రభుత్వమే ఇతర అవసరాల పేరిట ఆక్రమించాలని చూస్తే ఉతికి ఆరేస్తామని రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రాంబాబు హెచ్చరించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక బీసీ భవన్‌లో ఆదోని నుంచి తరలి వచ్చిన వందలాది మంది రజకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆదోని పట్టణ రజక సంఘం అధ్యక్షుడు పి.ఉసేని అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి కె.రామక్రిష్ణ, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రంగముని నాయుడు, వీఆర్‌పీఎస్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మహేంద్రనాయుడు, రజక సంఘం రాయలసీమ కన్వీనర్ వాడాల నాగరాజు, నాయకులు కేతూరి మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతు ఆదోనిలో దాదాపు 700 పైగా రజక కుటుంబాలు కుల వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయన్నారు. వీరి జీవనోపాధికై 1914లో సర్వే నెంబర్లు 239, 240, 241, 242లో 15.18 ఎకరాల భూమిని ధోబీఘాట్ల నిర్మాణానికి కేటాయించారన్నారు. అప్పటి నుంచి రజకులు అక్కడే తమ కుల వృత్తి సాగిస్తున్నట్లు చెప్పారు.

 సహాయ నిరాకరణ చేస్తున్నా..
ధోబీఘాట్‌కు కేటాయించిన స్థలంలో దాదాపు 70 శాతం భూమి వివిధ అవసరాలకు ఉపయోగించుకోగా, ప్రస్తుతం 30 శాతం భూమి మాత్రమే మిగిలిందని రాంబాబు తెలిపారు. ప్రస్తుతం ఈ భూమిని కూడా మైనారిటీ హాస్టల్ నిర్మాణానికి లాక్కునే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ విషయంలో వారం రోజులుగా ఆదోని రజకులు సహాయ నిరాకరణ చేపడుతున్నా, రాజకీయ నాయకులు కానీ అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ధోబీఘాట్ స్థలాన్ని కాపాడేందుకు వెంటనే ప్రహరీ నిర్మించి, రజకులకు కమ్యూనిటీ హాల్ నిర్మించాలన్నారు. అంతకు ముందు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. సమావేశంలో రజక మహిళా సంఘం నాయకురాలు మంగమ్మ, నాయకులు ముక్కన్న, పి.వెంకటేష్, రజక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నాగరాజు, గురుశేఖర్, గౌరవాధ్యక్షుడు సి.గోవిందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement