రాంగోపాల్ వర్మకు తాత్కాలిక ఊరట | Ram Gopal Varma is a temporary relief | Sakshi
Sakshi News home page

రాంగోపాల్ వర్మకు తాత్కాలిక ఊరట

Published Thu, Sep 18 2014 1:42 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM

రాంగోపాల్ వర్మకు తాత్కాలిక ఊరట - Sakshi

రాంగోపాల్ వర్మకు తాత్కాలిక ఊరట

హైదరాబాద్: వినాయకునిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై నమోదైన కేసులో తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయవాది కరుణాసాగర్ ఫిర్యాదు మేరకు సరూర్‌నగర్ పోలీసులు రాంగోపాల్ వర్మపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో వర్మ హైకోర్టును ఆశ్రయించారు. వినాయకునిపై తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమైనవి కావని, వాటికి ఇప్పటికే క్షమాపణలు చెప్పానని ఆయన కోర్టుకు వివరించారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ రెండువారాలపాటు నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement