ఏలూరు: లైంగికదాడి కేసులో ఓ నిందితుడిని ఏలూరు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 21న ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం గ్రామంలో వడ్లమూడి బాలకృష్ణ(28) అనే యువకుడు ఓ ఇంట్లోకు చోరబడ్డాడు.
ఇంటి యజమాని రాంబాబుని గాయపరిచి ఆమె భార్యను రేప్ చేయడానికి ప్రయత్నించగా... ఆమె ప్రతిఘటించడంతో రాడ్తో కొట్టి చంపబోయాడు. ఆ తర్వాత వాళ్ల ఇద్దరు కూతుర్లపై కూడా అత్యాచారయత్నం చేయబోయాడు. వీలుకాకపోవడంతో గ్యాస్ లీక్ చేసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. స్థానికులు వచ్చి మంటలు ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడిని బుధవారం పట్టుకున్నారు. నిందితుడి స్వగ్రామం దెందులూరు మండలం గంగన్న గూడెంగా పోలీసులు తెలిపారు.