రేషన్ డీలర్ ఆత్మహత్య | Ration dealer suicide | Sakshi
Sakshi News home page

రేషన్ డీలర్ ఆత్మహత్య

Published Sat, Mar 21 2015 2:21 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Ration dealer suicide

అధికార పార్టీ ఒత్తిడికి తాళలేక.. రైలు కిందపడిన వైనం
 
గుంతకల్లు రూరల్ : అధికార పార్టీ ఆగడాలకు తాళలేక వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త, రేషన్ డీలర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే... పాత గుంతకల్లు శివాలయం సమీపంలో నివాసం ఉంటున్న చాకలి రంగనాయకులు, గౌరమ్మలకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా అందులో పెద్దవాడు మధుబాబు (32). కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్న మధుబాబు వైఎస్‌ఆర్‌సీపీలో చురుకైన కార్యకర్తగా గుర్తింపు పొందాడు. చిన్నపాటి ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇదిలా ఉంటే తెలుగుదేశం అధికారంలోకి రావడంతో రేషన్ డీలర్లకు కష్టాలు మొదలయ్యాయి.

వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల రేషన్ షాపులను లాక్కొడానికి రెవెన్యూ వారితో సైతం ఒత్తిడి తీసుకువచ్చి అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధుబాబుపై కూడా అధికార పార్టీతో పాటు రెవెన్యూ అధికారుల వేధింపులు మొదలయ్యాయి. కారణం లేకుండానే దుకాణంపై దాడులు చేయడం, సస్పెండ్ కూడా చేశారు.  దీంతో ఆయన కోర్టులో స్టే తెచ్చు కున్నాడు. ఈ పరిణా మా లన్నింటితో తీవ్ర మనస్తాపం చెందిన మధుబాబు గురువారం రాత్రి ఇంటి నుంచి బయటికి వచ్చి ఎస్‌జెపీ పాఠశాల సమీపంలోని గుంతకల్లు -గూళ్లపాళ్యం ట్రాక్‌పై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నా డు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీ రు మున్నీరయ్యారు.
 
వైవీఆర్ దిగ్బ్రాంతి: మధుబాబుఆత్మహత్యచేసుకున్న విషయం తెలుసుకున్న ఆ పార్టీ సమన్వయకర్త వై వెంకటరామిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.  
 
వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల పరామర్శ:
 మధుబాబు మృతి విషయం తెలియగా నే వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సం దీప్‌రెడ్డి, మున్సిపల్ ప్రతిపక్ష నాయకు డు  మహబూబ్ బాషా, పట్టణ కన్వీనర్ వైసుధాకర్, జింకల రామాంజనేయు లు మధుబాబు మృతదేహాన్ని పరిశీ లించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
 
డీలర్ మృతిపై ఆర్డీఓ విచారణ :  డీలర్ మధుబాబు ఆత్మహత్యకు సంబంధించి హుస్సేన్ శుక్రవారం విచారణ చేప ట్టారు.  గుంతకల్లులో మధుబాబు ఇం టికి వెళ్లి కుటుంబ సభ్యులను  మధు ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. కుటుంబ కారణాలు, అప్పులు కూడా మధు ఆత్మహత్యకు కారణాలుగా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement