అమరావతి : ఇండో పాక్ బోర్డర్లోని సరిహద్దులో భద్రత, ఇతర విషయాలను చూసి వచ్చిన మాస్టర్ రవికర్, వారి తల్లిదండ్రులు నరసింహారెడ్డి, ఇందిరతో కలిసి ఆదివారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశాడు. ఈ సందర్భంగా మాస్టర్ రవికర్ను చంద్రబాబు అభినందించారు. మహానాడులో పాల్గొనే అవకాశం కల్పించాలని రవికర్ కోరగా తదుపరి మహానాడులో పాల్గొనేందుకు అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
కాగా అయిదో తరగతి చదువుతున్న మాస్టర్ రవికర్ రెడ్డి సరిహద్దు భద్రతా సేవలను ప్రత్యక్షంగా చూడాలని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్కు లేఖ రాయడంతో బీఎస్ఎఫ్ డీజీ కె.కె.శర్మ స్పందించి బోర్డర్లో మార్చి 21 నుంచి 26 వరకు పర్యటనకు అనుమతించారు. పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత రవికర్ సీఎంను కలిశాడు.
Met Ravikar, a young & bright student who was invited by KK Sharma, Director General- BSF, to visit the Indo-Pak border zone in March. pic.twitter.com/ClMkbLfoJM
— N Chandrababu Naidu (@ncbn) 18 June 2017