మధ్యాహ్నం 'రావూరి' అంత్యక్రియాలు
హైదరాబాద్ : నవలా రచయిత, సాహితీవేత్త జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం జరగనున్నాయి. విజయనగర్ కాలనీలోని స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రావూరి నిన్న రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. రావూరి భరద్వాజ రాసిన 'పాకుడురాళ్లు' నవలకు 2012లో జ్ఞానపీఠ్ అవార్డు లభించింది.