కాకినాడ :ప్రభుత్వ, ప్రైవేటు అవసరాల కోసం జిల్లాలోని 15 రీచ్‌ల నుంచి ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. అయితే ఇందుకయ్యే లోడింగ్, రవాణా చార్జీలను ఇసుక అవసరమైనవారే భరించాల్సి ఉంటుంది. కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ఇసుక నూతన విధానంపై సమీక్షించారు. సమావేశంలో రంపచోడవరం సబ్ కలెక్టర్ రవిసుభాష్ పట్టన్‌శెట్టి, అదనపు ఎస్పీలు ఏఆర్ దామోదర్, డి.సిద్ధారెడ్డి, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈలు వెంకటేశ్వరరావు, సీఎస్‌ఎన్ మూర్తి, రాజేశ్వరరావు, రవాణా శాఖ ఉప కమిషనర్
15 రీచ్‌ల నుంచి ఉచితం
మోహన్, గనుల శాఖ సహాయ సంచాలకుడు ఆర్.గొల్ల, డీపీవో ప్రవీణ, పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఏమన్నారంటే..
ముగ్గళ్ళ, వేమగిరి, ఆత్రేయపురం, మందపల్లి, జొన్నాడ, ఊబలంక-1, 2, అంకంపాలెం, అయినవిల్లిలంక - వీరవల్లిపాలెం, బొబ్బర్లంక - పేరవరం, వాడపాలెం - నారాయణలంక, వద్దిపర్రు, రాజవరం, గోపాలపురం-1, 2, బ్రిడ్జిలంక, కేతవానిలంక రీచ్‌లకు పర్యావరణ అనుమతులున్నాయి.
కోరుమిల్లి, కపిలేశ్వరపురం 1, 2, పులిదిండి, రాయన్నపేట రీచ్‌లకు అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఒకటి, రెండు రోజుల్లో అనుమతులు ఇస్తాం.
ఈ రీచ్‌లలో సుమారు 24.90 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది.
ఆయా రీచ్‌లలో పదిచోట్ల అప్రోచ్ రోడ్లు నిర్మించాలి. ఉపాధి హామీ పథకం కింద పంచాయతీరాజ్ అధికారులు వెంటనే అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి.
లోడింగ్, రవాణా చార్జీలు భరించి, ఇసుక ఉచితంగా పొందవచ్చు.
ఒక యూనిట్ ట్రాక్టర్‌కు రూ.175, రెండు యూనిట్ల మినీలారీకి రూ.400, 15 యూనిట్ల లారీకి రూ.1500 లోడింగ్ చార్జీగా నిర్ణయించారు.
అయిదు కిలోమీటర్ల పరిధిలో ట్రాక్టర్‌కు రూ.400, 10 కిలోమీటర్లకు రూ.600, అంతకు మించితే కిలోమీటర్‌కు రూ.28 చొప్పున రవాణా చార్జీలు భరించాలి.
పది టన్నుల లారీకి 5 కిలోమీటర్లలోపు రూ.600, 10 కిలోమీటర్లు వరకూ రూ.800, 10 కిలోమీటర్లు దాటితే ప్రతి కిలోమీటరుకు రూ.65 చొప్పున చెల్లించాలి.
15 టన్నుల లారీకి 5 కిలోమీటర్లలోపు రూ.800, 10 కిలోమీటర్లు దాటితే ప్రతి కిలోమీటరుకు రూ.90 చొప్పున చెల్లించాలి.
ఇసుక పొందేందుకు ఎలాంటి సీనరేజ్ చార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు.
అవసరానికి మించి అక్రమంగా ఇసుక నిల్వ చేయకుండా, సరిహద్దులు దాటిపోకుండా పోలీసు, రెవెన్యూ శాఖలు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి.
అక్రమాలకు పాల్పడితే రూ.లక్ష వరకూ జరిమానా విధిస్తారు.
15 రీచ్‌ల నుంచి ఉచితం
Published Wed, Mar 9 2016 1:38 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement