మునిసి‘పోల్స్’కు రెడీ | ready to muncipal polls | Sakshi
Sakshi News home page

మునిసి‘పోల్స్’కు రెడీ

Published Sun, Mar 2 2014 4:19 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

మునిసి‘పోల్స్’కు రెడీ - Sakshi

మునిసి‘పోల్స్’కు రెడీ

 నగరపాలక, పురపాలక సంఘాల ఎన్నికలకు రంగం సిద్ధం
 రిజర్వేషన్లు ప్రకటించిన ప్రభుత్వం
 ఏలూరు మేయర్, జంగారెడ్డిగూడెం
 నగర పంచాయతీ పదవులు బీసీ మహిళలకే
 మిగిలిన పట్టణాలన్నీ జనరల్‌కు

 
 సాక్షి, ఏలూరు:
 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పురపాలక సంఘాల పాలకవర్గ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఏళ్ల తరబడి ఎన్నికలు జరపకుండా ప్రత్యేకాధికారుల పాలనతో వాటిని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం తీర్పుకు తలవంచి ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. తాత్సారం చేయాలని భావించినప్పటికీ కుదరదని సుప్రీంకోర్టు చెప్పడంతో మునిసిపల్ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలోని నగరపాలక, పురపాలక, నగర పంచాయతీ చైర్‌పర్సన్ల పదవులకు సంబంధించి రిజర్వేషన్లను శనివారం రాత్రి ప్రకటించింది. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.
 
 మేయర్ పదవి బీసీ మహిళకు
 ఏలూరు నగరపాలక సంస్థకు రెండోసారి ఎన్నికలు జరుగనున్నాయి. ఏలూరు నగరపాలక సంస్థగా అవతరించాక తొలిసారి 2005లో ఎన్నికలు జరిగారుు. అప్ప ట్లో మేయర్ స్థానాన్ని ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ చేశారు. రొటేషన్ పద్ధతిలో ఇప్పుడు బీసీ మహిళకు కేటాయించారు. తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నిడదవోలు, నరసాపు రం, తణుకు, భీమవరం, పాల కొల్లు పురపాలక సంఘాల చైర్‌పర్సన్ పదవులకు అన్ రిజర్వుడు కేటగిరీ (జనరల్)లో పెట్టారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ పదవిని బీసీ మహిళకు రిజర్వ్ చేశారు.  మునిసిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. బీసీ ఓటర్ల జాబితాలను గతంలోనే సిద్ధం చేసింది. పోలింగ్ కేంద్రాల జాబితాను సైతం రూపొందించింది. పోలింగ్ కేం ద్రాలు, ఓటర్ల జాబితాను ఆదివా రం ప్రదర్శించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement