Eluru Municipal Corporation
-
ఏలూరు నగరపాలక సంస్థ ప్రాంగణంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
-
ఏలూరు కార్పొరేషన్ ఎలక్షన్: కౌంటింగ్‌కు హైకోర్టు అనుమతి
-
ఏలూరు కార్పొరేషన్ ఎలక్షన్: కౌంటింగ్‌కు హైకోర్టు అనుమతి
సాక్షి, అమరావతి: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు అనుమతినిచ్చింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓట్లు లెక్కించాలని సూచించింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా మార్చి 10న ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, కోవిడ్ జాగ్రత్తల మధ్య జరిగిన ఈ ఎలక్షన్లో 56.86% పోలింగ్ నమోదైంది. ఇక ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీవీ అన్నపూర్ణ శేషుకుమారి అనే అభ్యర్థి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి, ఫలితాలను వెల్లడించవద్దంటూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, తాజా విచారణలో భాగంగా, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించవచ్చని పేర్కొంటూ తీర్పునిచ్చింది. చదవండి: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలపై తీర్పు వాయిదా -
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలపై తీర్పు వాయిదా
సాక్షి, అమరావతి: ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికకు సంబంధించి దాఖలైన అప్పీళ్లపై వాదనలు ముగిశాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీవీ అన్నపూర్ణ శేషుకుమారి అనే అభ్యర్థి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి, ఫలితాలను వెల్లడించవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తాజాగా సోమవారం ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. తప్పుల సవరణకు సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేశామన్నారు. తమ పేర్లు ఓటర్ల జాబితాలో తప్పుగా ఉన్నాయని భావిస్తే, ఆ వ్యక్తులు సంబంధిత అధికారులను ఆశ్రయించి తప్పులను సవరించుకునే వెసులుబాటు ఉందన్నారు. కానీ పిటిషనర్లు కోర్టుకొచ్చి, మొత్తం ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయించారన్నారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి అనుమతివ్వాలని కోరారు. శేషుకుమారి తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. ఓటర్ల జాబితాలో తప్పులున్నాయన్న కారణంతో ఎన్నికలను నిలిపివేయడం సరికాదన్నారు. ఎన్నికల నిలుపుదలకు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ వేసిన చిరంజీవి తదితరుల తరఫు న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. ఈ అప్పీళ్లకు విచారణార్హత లేదని, వీటిని కొట్టేయాలని కోరారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. -
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కేసు విచారణ 19కి వాయిదా
సాక్షి, అమరావతి: ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వంతోపాటు మరికొందరు హైకోర్టులో దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. అంతకుముందు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. 2020 ఫిబ్రవరి 3న తుది ఓటర్ల జాబితా ప్రచురించామని తెలిపారు. అభ్యంతరాల సమర్పణకు గడువు కూడా ఇచ్చామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే వరకు తమ దృష్టికి వచ్చిన లోపాలన్నింటినీ సవరిస్తూనే ఉన్నామని కోర్టుకు వివరించారు. ఎన్నికలు కూడా నిర్వహించామని, అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఫలితాలను వెల్లడించలేదన్నారు. ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారని, ఫలితాల వెల్లడికి అనుమతినిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్ధించారు. అయితే ఇతర న్యాయవాదుల వాదనల నిమిత్తం విచారణ 19కి వాయిదా పడింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులిచి్చన సంగతి తెలిసిందే. -
ఏలూరులో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలిగాయి. షెడ్యూల్ ప్రకారమే ఎన్నిక నిర్వహించవచ్చని, ఓట్ల లెక్కింపు మాత్రం చేపట్టవద్దని, ఫలితాలను ప్రకటించవద్దని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై ధర్మాసనం మంగళవారం స్టే విధించింది. బ్యాలెట్ బాక్సులను జాగ్రత్త చేయాలని, హైకోర్టు ఆదేశిస్తే కానీ వాటిని తెరవడానికి వీల్లేదని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం, ఇతరులు దాఖలు చేసిన అప్పీళ్లను సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉంచదలచుకోలేదని ఈ సందర్భంగా పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఎన్నికల నిలిపివేతపై సర్కార్ అప్పీల్... ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓటర్ల జాబితాలో తప్పులను సవరించాలంటూ గత ఏడాది హైకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు అమలు చేయలేదంటూ టీడీపీ నేత ఎస్వీ చిరంజీవి, మరో 33 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఓటర్ల జాబితాలో తప్పులను సవరించేందుకు వీలుగా కార్పొరేషన్ ఎన్నికను నిలిపేస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాలు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్లు లంచ్‌మోషన్ రూపంలో అత్యవసర అప్పీల్ దాఖలు దాఖలు చేశారు. ఇలాగే మరో వ్యక్తి కూడా అప్పీల్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, టీడీపీ నేతలు ఎస్వీ చిరంజీవి తదితరుల తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. చిలకలూరిపేట ఎన్నికలకు హైకోర్టు ఓకే గుంటూరు జిల్లా చిలకలూరిపేట మునిసిపల్ పాలకవర్గ ఎన్నికల నిర్వహణకు కూడా హైకోర్టు అనుమతి ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఎన్నిక నిర్వహించుకోవచ్చన్న న్యాయస్థానం ఎన్నికల ఫలితాలు మాత్రం తుది తీర్పునకు లోబడి ఉంటాయని తెలిపింది. ఈ విషయాన్ని అభ్యర్థులకు అందజేసే ధ్రువీకరణ పత్రాల్లో స్పష్టంగా పేర్కొనాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. మానుకొండవారిపాలెం, పసుమర్రు, గణపవరం పంచాయతీలను చిలకలూరిపేట మునిసిపాలిటీలో విలీనం చేస్తూ గతేడాది జనవరిలో పంచాయతీరాజ్, పురపాలక శాఖలు జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూæటి.పూర్ణచంద్రరావు, జి.రవితేజ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఆ జీవోల అమలును నిలిపేస్తూ గతేడాది అక్టోబర్‌లో మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలని ప్రభుత్వ న్యాయవాది సత్యశివాజీ మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులను అభ్యర్థించారు -
‘ఏలూరు’ ఎన్నికలకు బ్రేక్
సాక్షి, అమరావతి: ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ నెల 10న జరగాల్సిన ఎన్నికపై స్టే విధించిన హైకోర్టు ఓటర్ల జాబితాలో తప్పులను సవరించే వెసులుబాటును అధికారులకు కల్పించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తుది ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పులున్నాయని, అభ్యంతరాలను స్వీకరించకుండానే తుది ఓటర్ల జాబితాను ప్రచురించారంటూ టీడీపీ నేత ఎస్వీ చిరంజీవి, మరికొందరు గత ఏడాది హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఓటర్ల జాబితాలో కుక్క ఫొటో ముద్రించడంపై మండిపడుతూ పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఓటర్ల జాబితాలో తప్పులను సవరించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ గత ఏడాది మార్చి 5న తీర్పునిచ్చారు. ఈ తీర్పును అధికారులు అమలు చేయలేదంటూ చిరంజీవి, మరో 33 మంది హైకోర్టును ఆశ్రయించగా.. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు సోమవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకటించిన తరువాత నిబంధనల ప్రకారం పబ్లిక్ నోటీసులు ఇచ్చి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించలేదని, తుది ఓటర్ల జాబితా తయారీ విషయంలో నిబంధనలు పాటించలేదని ఆక్షేపించారు. గత ఏడాది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో వందలాది ఓటర్ల ఇంటి నంబర్లు 000గా చూపారని, అనేక మంది ఓటర్ల పేర్లు తప్పుగా ఉన్నాయని తెలిపారు. న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వుల అమలును వాయిదా వేయడానికి వీల్లేదని, కోర్టు ఉత్తర్వులను అమలు చేసి తీరాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఎవరు ఎంత పెద్ద వారైనా, చట్టం వారి కంటే పెద్దదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితా ఎన్నిక ప్రక్రియకు పునాది అని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. చట్టం నిర్దేశించిన విధంగా ఓటర్ల జాబితా తయారు చేయకపోవడాన్ని కేవలం సాంకేతిక లోపంగా మాత్రమే చూడలేమన్నారు. ఓటర్ల జాబితా సక్రమంగా లేదని కోర్టు తేల్చిన తరువాత దానిని సరిచేయకుండా ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. ఎన్నికను వాయిదా వేయడం వల్ల కలిగే కష్టం కంటే, ఓటర్ల జాబితాను సవరించడం వల్లే కలిగే ప్రజోపయోగమే ప్రధానమైనదని తెలిపారు. ఈ కారణాలతో ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గ ఎన్నికలపై స్టే విధిస్తున్నట్టు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా ?
సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : ఏలూరు కార్పొరేషన్లో గతంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఏమాత్రం నాణ్యత లేదని, పనుల వ్యయాన్ని పెంచుకుంటూ పోవడంతో పాటు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని నగరపాలకసంస్థ అధికారులపై ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని మండిపడ్డారు. స్థానిక నగరపాలకసంస్థ కార్యాలయంలో బుధవారం ఆళ్లనాని, నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ ముత్యాలరాజులు సమీక్షించారు. డివిజన్లలో పర్యటించిన సమయంలో ప్రజలు అనేక విషయాల్ని తన దృష్టికి తీసుకువచ్చారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిఫార్సులు చేస్తామని నాని అన్నారు. కాగితాలపై కాకి లెక్కలు తప్ప సరైన సమాచారం ఇచ్చే స్థితిలో అధికారులు లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ అంశాన్ని ప్రస్తావించినా అవగాహనలేని మాటలే తప్ప వాస్తవ పరిస్థితులపై అధికారులకు అవగాహన లేదని అన్నారు. 14వ ఆర్ధిక సంఘం నిధుల వినియోగంపై పొంతన లేకుండా లెక్కలు చెబుతున్నారని, ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం వహించారని, నిబంధనలకు విరుద్ధంగా నిధులు వెచ్చించారని విమర్శించారు. పనులు చేయకుండానే చేసినట్లు లెక్కలు చూపారని, కార్పొరేషన్లో అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్దితి నెలకొందని అన్నారు. రోడ్లు వేసిన నెల రోజులకే దెబ్బతిన్న తీరు చూస్తుంటే నాణ్యతను పట్టించుకోలేదని, తనిఖీ చేయాల్సిన అధికారులు కూడా ఎక్కడ ఏ పని జరిగిందో చెప్పలేని స్థితిలో ఉండటాన్ని మంత్రి తప్పుపట్టారు.టూటౌన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విధానం లేనప్పుడు తంగెళ్లమూడిలో పనులకు ప్రతిపాదన ఎలా చేశారని, వన్‌టౌన్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా సరిదిద్దకుండా ప్రజాధనాన్ని వృథా చేశారని అన్నారు. రాబోయే మూడు రోజుల్లో పనుల వివరాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం వచ్చినా డ్రెయిన్ల పూడికతీత పనులు ఎందుకు పూర్తి కాలేదని మంత్రి ప్రశ్నించారు. నగరంలో ఫుట్‌పాత్‌ల నిర్మాణంలో నాణ్యత కరువైందని, వెంటనే పనులను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పైపులైన మరమ్మతుల నిమిత్తం రూ.6 కోట్ల వరకు నిధులు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతున్నారని, చాలా చోట్ల పనులు జరగకుండానే జరిగినట్లు బిల్లు డ్రా చేసినట్లు తనకు ఫిర్యాదులు అందాయని మంత్రి అన్నారు. తనకు తెలియకుండా ఏ ఒక్క అధికారిని రిలీవ్ చేయవద్దని ఈ సందర్భంగా నగరపాలకసంస్థ కమిషనర్ ఏ.మోహన్‌రావును కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశించారు. తెల్లముఖం వేసిన అధికారులు దేనికి అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. సమీక్షా సమావేశాలకు స్పష్టమైన వాస్తవ వివరాలతో రావాలని, ఏమాత్రం సమాచారం లేకుండా టైంపాస్‌కు వస్తే ఇక మీద సహించేది లేదని హెచ్చరించారు. గత ఏడాది రూ. 27 కోట్లు ఆస్తి పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకుని కేవలం రూ. 15 కోట్లు మాత్రమే వసూలు చేశారని, ఈ ఆర్థిక సంవత్సరం మళ్ళీ రూ.28 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారని.. గత బకాయిలతో కలిపి రూ. 40 కోట్లు ఎలా వసూలు చేయగలరని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ నిధులతో ఎస్ఎంఆర్ నగర్లో ఓ కుల కల్యాణమండపాన్ని ఎలా నిర్మిస్తున్నారని, అలా నిర్మించేందుకు ఏమైనా అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించగా.. ఎలాంటి అనుమతులు లేవని, గత పాలకులు ఆదేశాలతో చేపట్టామని అధికారులు వివరణ ఇచ్చారు. సమావేశంలో కమిషనర్ ఎ.మోహనరావు, హెల్త్ ఆఫీసర్ సూర్యారావు, ఏసీపీలు వి.శ్రీనివాస్, అప్పారావు, ఆర్వోలు పాల్గొన్నారు. -
కొలువయ్యారు
- నగర, ‘పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారం - నరసాపురం మినహా అన్నిచోట్లా ఏకగ్రీవమే సాక్షి, ఏలూరు : ఏలూరు నగరపాలక సంస్థ, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు, తణుకు, కొవ్వూరు పురపాలక సంఘాలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల్లో పాలకవర్గా లు కొలువుతీరారు. ఏలూరులో 50 మంది కార్పొరేటర్లు, మిగిలిన మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో 241 మంది కౌన్సిలర్లు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఏలూరు మేయర్, మునిసిపల్ చైర్మన్ల ఎన్నిక, ఆ వెంటనే ఏలూరు డెప్యూటీ మేయర్, మునిసిపల్ వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వ హించారు. నరసాపురం మినహా అన్నిచోట్లా ఎన్నికలు ఏకగ్రీవమయ్యూయి. రాజకీయ పార్టీల తరఫున విప్‌లను ఎన్నుకున్నారు. అన్నిచోట్లా ప్రశాంత వాతావరణంలో ప్రమాణ స్వీకారం, ఎన్నికలు జరిగాయి. సారథులు వీరే : ఏలూరు నగరపాలక సంస్థ మేయర్‌గా షేక్ నూర్జహాన్డెప్యూటీ మేయర్‌గా ఏడాదిన్నర కాలానికి చోడే వెంకటరత్నంను ఎన్నుకున్నారు. నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ కార్పొరేటర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు హాజరై విజేతలకు అభినందనలు తెలిపారు. భీమవరం మునిసిపల్ చైర్మన్‌గా కొటికలపూడి గోవిందరావు (చినబాబు), వైస్ చైర్మన్‌గా ముదునూరి సూర్యనారాయణరాజు ఎన్నికయ్యారు. తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్‌గా బొలిశెట్టి శ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా గొర్రెల శ్రీధర్ ఎంపికయ్యూరు. పాలకొల్లు చైర్మన్‌గా వల్లభు నారాయణమూర్తి, వైస్ చైర్‌పర్సన్‌గా కర్నేని రోజారమణి ఎన్నికయ్యూరు. తణుకు చైర్మన్‌గా దొమ్మేటి వెంకట సుధాకర్, వైస్ చైర్మన్‌గా మంత్రిరావు వెంకటరత్నం ఎంపికయ్యారు. కొవ్వూరు చైర్మన్‌గా సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్ (చిన్ని), వైస్ చైర్మన్‌గా దుద్దుపూడి రాజా రమేష్‌ను ఎన్నుకున్నారు. ఇక్కడ వైస్‌చైర్మన్ పదవిని బీసీకి కేటాయించాలంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. నాయకులు సర్ధిచెప్పడంతో శాంతిం చారు. నిడదవోలు చైర్మన్‌గా బొబ్బా కృష్ణమూర్తి, వైస్ చైర్మన్‌గా పేరూరి సాయిబాబా ఎన్నికయ్యారు. రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ హాజరై పదవులు చేపట్టిన వారిని అభినందించారు. జంగారెడ్డిగూడెం చైర్‌పర్సన్‌గా బంగారు శివలక్ష్మి, వైస్ చైర్మన్‌గా అట్లూరి రామ్మోహనరావును ఎన్నుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ల సాయంతో... నరసాపురంలో 14 వార్డులను టీడీపీ, మరో 14 వార్డులను వైఎస్సార్ సీపీ గెలుచుకోగా, మూడుచోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ముగ్గురు ఇండిపెండెంట్లు టీడీపీ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ బలం 19కి చేరింది. దీంతో టీడీపీ నుంచి పసుపులేటి రత్నమాల చైర్‌పర్సన్‌గా, పొన్నాల నాగబాబు వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. -
‘పుర’పోరు.. ఇక హోరు
ఏలూరు, న్యూస్‌లైన్ : మునిసిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఏలూరు నగరపాలక సంస్థలో 50 డివి జన్లు, ఏడు మున్సిసిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో పరిధిలోని 241 వార్డులకు మొత్తం 940మంది అభ్యర్థులు బరిలో మిగి లారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 281 మంది, టీడీపీ నుంచి 280 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కేవలం 47 మంది మాత్రమే పోటీకి నిలవడం విశేషం. అభ్యర్థులు దొరక్కపోవడంతో అధికార పార్టీ నామినేషన్ల దశలోనే చతికిలపడిం ది. బీజేపీ 23, సీపీఎం 13, సీపీఐ నాలుగు వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దింపారుు. 291 వార్డులు/డివిజన్లకు కలిపి మొత్తం 1,980 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు ఉపసంహరణ చివరి రోజు మంగళవా రం సాయంత్రం నాటికి 1,026 మంది పోటీనుంచి నిష్ర్కమించారు. అతి స్వల్పంగా అభ్యర్ధులు స్క్రూటినీలో అనర్హతకు గురయ్యారు. ఏకగ్రీవ కౌన్సిలర్లు నలుగురు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం అనంతరం టీడీపీ నుంచి ముగ్గురు, ఇండిపెండెం టు ఒకరు కౌన్సిలర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థులు అనర్హతకు గురికావటం, పోటీ నుంచి తప్పుకోవటంతో ఆ నలుగురు విజేతలుగా నిలిచారు. నిడదవోలులోని 13 వార్డు అభ్యర్థి తీపర్తి ప్రసన్న, 19 వార్డు అభ్యర్థి మారిశెట్టి పద్మజ, పాలకొల్లు 14వ వార్డు నుంచి మల్లంపల్లి ఫకీర్బాబు, తాడేపల్లిగూడెం నుంచి 16వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్ధి పెండ్యాల చంద్రశేఖరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యూరు. వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యే పోటీ తాజా అంకెలతో పుర పోరులో పోటీ వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం మధ్యేనని తేలి పోయింది. ఏలూరు నగరపాలకసంస్థ, 7 మునిసిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో ఈ రెండు పార్టీలే ప్రత్యర్థులుగా ఉన్నాయి. తణుకు, కొవ్వూరు, నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకే ఒక్కరు బరిలో నిలవడం విశేషం. ఏకగ్రీవాలు పోగా మిగిలిన 287 వార్డులకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఏలూరు బరిలో 174 మంది ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. వైఎస్సార్ సీపీ, టీడీపీల నుంచి 50మంది చొప్పున పోరుకు సిద్ధం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 13మంది, బీజేపీ నుంచి ఐదుగురు, స్వతంత్రులు 61మంది బరిలో నిలిచారు. మిగిలిన చోట్ల ఇలా... తాడేపల్లిగూడెం మునిసిపాలిటీలో 34వార్డులకు 124మంది బరిలో మిగి లారు. వైఎస్సార్ సీపీ నుంచి 33 మంది, టీడీపీ నుంచి 33మంది, సీపీఎం నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి నలుగురు, స్వతంత్రులు 48మంది పోటీలో ఉన్నారు. తణుకు మునిసిపాలిటీలో 34వార్డుల్లో 97మంది పోరుకు సై అంటున్నా రు. వైఎస్సార్ సీపీ 32చోట్ల బరిలో నిల వగా, రెండుచోట్ల సీపీఎంకు మద్దతు ఇస్తోంది. టీడీపీ 32చోట్ల, సీపీఐ-1, కాంగ్రెస్-1, బీజేపీ-5, బీఎస్పీ-3, స్వ తంత్రులు 21చోట్ల పోటీ చేస్తున్నారు. నిడదవోలు మునిసిపాలిటీలో 28 వార్డులకు 91మంది పోరుకు సిద్ధపడ్డారు. వైఎస్సార్ సీపీ నుంచి 26మంది తలపడుతున్నారు. టీడీపీ రెండు వార్డులను ఏకగ్రీవంగా గెలుచుకోగా, 26వార్డుల్లో పోటీలో ఉంది. కాంగ్రెస్-15, బీజేపీ-5, బీఎస్పీ-3, లోక్‌సత్తా-1, సీపీఎం-3, ఇతరులు 13మంది పోటీలో ఉన్నారు. కొవ్వూరు మునిసిపాలిటీలో 23 వార్డులు ఉండగా 80 మంది రంగంలో మిగిలారు. వైఎస్సార్ సీపీ నుంచి 26 మంది, టీడీపీ నుంచి 25, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు బరిలో ఉన్నారు. స్వతంత్రులు 26మంది పోటీ చేస్తున్నారు. నరసాపురం మునిసిపాలిటీలో 31వార్డులకు 107మంది బరిలో ఉన్నా రు. వైఎస్సార్ సీపీ నుంచి 29 మంది బరిలో ఉన్నారు. రెండుచోట్ల సీపీఎంకు మద్దతు ఇస్తున్నారు. టీడీపీ నుంచి 29 మంది బరిలో ఉండగా, 3చోట్ల బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్-1, స్వ తంత్రులు 43చోట్ల పోటీచేస్తున్నారు. పాలకొల్లు మునిసిపాలిటీలో 31 వార్డులకు 86మంది బరిలో ఉన్నారు. ఇక్కడ ఓ వార్డును టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. వైఎస్సార్ సీపీ-29, టీడీపీ-30, బీఎస్పీ-1, సీపీఐ-1, సీపీఎం-1, కాంగ్రెస్-1, స్వతంత్రులు 23చోట్ల పోటీలో ఉన్నారు. భీమవరం మునిసిపాలిటీలో 39 వార్డులుండగా 110మంది బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి 37మంది పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి 36మంది, కాంగ్రెస్ నుంచి 11మంది, స్వతంత్రులు 22మంది బరిలో నిలిచారు. బీజేపీ 3చోట్ల, సీపీఎం ఒకచోట పోటీ చేస్తున్నారుు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ పరిధిలో 20వార్డులకు గాను 71 మంది బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి 20మంది, టీడీపీ నుంచి 19మంది పోటీకి నిలిచారు. బీజేపీ, లోక్‌సత్తా, సీపీఐ ఒక్కొక్క వార్డులో పోటీ చేస్తుం డగా, సీపీఎం అభ్యర్థులు మూడుచోట్ల బరిలో ఉన్నారు. 26 మంది స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. -
మునిసి‘పోల్స్’కు రెడీ
నగరపాలక, పురపాలక సంఘాల ఎన్నికలకు రంగం సిద్ధం రిజర్వేషన్లు ప్రకటించిన ప్రభుత్వం ఏలూరు మేయర్, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ పదవులు బీసీ మహిళలకే మిగిలిన పట్టణాలన్నీ జనరల్‌కు సాక్షి, ఏలూరు: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పురపాలక సంఘాల పాలకవర్గ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఏళ్ల తరబడి ఎన్నికలు జరపకుండా ప్రత్యేకాధికారుల పాలనతో వాటిని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం తీర్పుకు తలవంచి ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. తాత్సారం చేయాలని భావించినప్పటికీ కుదరదని సుప్రీంకోర్టు చెప్పడంతో మునిసిపల్ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలోని నగరపాలక, పురపాలక, నగర పంచాయతీ చైర్పర్సన్ల పదవులకు సంబంధించి రిజర్వేషన్లను శనివారం రాత్రి ప్రకటించింది. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. మేయర్ పదవి బీసీ మహిళకు ఏలూరు నగరపాలక సంస్థకు రెండోసారి ఎన్నికలు జరుగనున్నాయి. ఏలూరు నగరపాలక సంస్థగా అవతరించాక తొలిసారి 2005లో ఎన్నికలు జరిగారుు. అప్ప ట్లో మేయర్ స్థానాన్ని ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ చేశారు. రొటేషన్ పద్ధతిలో ఇప్పుడు బీసీ మహిళకు కేటాయించారు. తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నిడదవోలు, నరసాపు రం, తణుకు, భీమవరం, పాల కొల్లు పురపాలక సంఘాల చైర్పర్సన్ పదవులకు అన్ రిజర్వుడు కేటగిరీ (జనరల్)లో పెట్టారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ పదవిని బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. మునిసిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. బీసీ ఓటర్ల జాబితాలను గతంలోనే సిద్ధం చేసింది. పోలింగ్ కేంద్రాల జాబితాను సైతం రూపొందించింది. పోలింగ్ కేం ద్రాలు, ఓటర్ల జాబితాను ఆదివా రం ప్రదర్శించనున్నారు.