సాక్షి, అమరావతి: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు అనుమతినిచ్చింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓట్లు లెక్కించాలని సూచించింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా మార్చి 10న ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, కోవిడ్ జాగ్రత్తల మధ్య జరిగిన ఈ ఎలక్షన్‌లో 56.86% పోలింగ్ నమోదైంది.
ఇక ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీవీ అన్నపూర్ణ శేషుకుమారి అనే అభ్యర్థి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి, ఫలితాలను వెల్లడించవద్దంటూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, తాజా విచారణలో భాగంగా, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించవచ్చని పేర్కొంటూ తీర్పునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment