నేటి నుంచి సిమెంట్ కొనుగోళ్లు బంద్ | Realtors in AP, Telangana to go on 'cement purchase holiday' | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సిమెంట్ కొనుగోళ్లు బంద్

Published Sat, Jul 5 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM

Realtors in AP, Telangana to go on 'cement purchase holiday'

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం నుంచి సిమెంట్ కొనుగోళ్లను నిలిపి వేయనున్నట్లు బిల్డర్ల జేఏసీ ప్రకటించింది. సిమెంట్ ధరల పెరుగుదలను నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ధరలను తక్షణమే తగ్గించకపోతే 12వ తేదీ తర్వాత అవసరమైతే నిర్మాణాలనూ ఆపేస్తామని హెచ్చరించింది.

రెండు రాష్ట్రాల్లో సిమెంట్‌కు ఏర్పడే డిమాండ్ నుంచి లబ్ధి పొందడానికే సిమెంట్ కంపెనీలు రేట్లు పెంచుతున్నాయని ఆరోపించింది. నెలక్రితం రూ.175-190 మధ్య ఉన్న ధరను ప్రస్తుతం రూ.320కు చేరడంతో నిర్మాణ వ్యయం పెరుగుతుందని చెబుతోంది. దీంతో అనివార్యంగా ఫ్లాట్ల ధరలను పెంచడంతో పాటు గడువులోగా నిర్మాణాలను పూర్తి చేయలేమని చెప్పింది.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement