నెల్లూరు: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం గుడిగుంట అటవీప్రాంతంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని గమనించిన ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులపై దాడికి దిగారు. అయితే ఆ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. అదికాక భారీ సంఖ్యలో పోలీసులు ఉండటంతో స్మగ్లర్లు పారిపోయేందుకు యత్నించారు.
దీంతో పోలీసులు నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్మగ్లర్లును పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో ముగ్గురు అటవీశాఖ సిబ్బంది సహకారంతో తాము ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు వారు వెల్లడించారు. దాంతో సదరు అటవీశాఖ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గాయపడిన స్మగ్లర్లను నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు.