కడప: వైఎస్సార్ జిల్లా కడప కేంద్రంలో ఇద్దరు ఎర్ర చందనం దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని చాపాడు మండలానికి చెందిన వీరిద్దరూ కడప జిల్లా ఒంటిమిట్ట పోలీసు స్టేషన్‌లోని 18 ఎర్ర చందనం దుంగలను గతవారం మాయం చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శనివారం రాత్రి పోలీసులు చాపాడు వద్ద స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వీరి నుంచి 18 ఎర్ర దుంగలను, రెండు బైకులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.