అట్టుడుకుతున్న తమిళనాడు
చెన్నై: చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. తమిళ సంఘాలు చేపట్టిన ఆందోళనలు గురువారం మూడో రోజుకు చేరుకున్నాయి. చెన్నై సెంట్రల్లో తమిళ సంఘాలు రైల్రోకో నిర్వహించారు. మద్రాస్ హైకోర్టు ముందు న్యాయవాద సంఘాలు ధర్నా చేపట్టాయి. వేలూరులో చంద్రబాబు దిష్టిబొమ్మను డీకే కార్యకర్తలు దగ్ధం చేశారు.
కోయంబత్తూరు, తిరుచ్చిలో నాన్ తమిళర్ కచ్చి కార్యకర్తలు నిరసన చేపట్టారు. తిరువణ్ణామలై, విల్లుపురం వేలూరులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఏపీ బస్సులు ఎక్కడివక్కడ నిలిపివేశారు. తమిళనాడులోని తెలుగు సంఘాలు, టీటీడీ దేవస్థానం, ఆంధ్రాబ్యాంకుల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.