ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టై కడప సెంట్రల్ జైలులో ఉన్న చైనా స్మగ్లర్ ప్రేమ్‌థార్ మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశాడు.
కడప: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టై కడప సెంట్రల్ జైలులో ఉన్న చైనా స్మగ్లర్ ప్రేమ్‌థార్ మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. మూడు నెలలుగా ప్రయత్నిస్తున్నా బెయిల్ రాకపోవడంతో మనస్తాపానికి గురైన ప్రేమ్‌థార్ బాత్‌రూమ్‌కు వేసిన రేకులతో చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
గమనించిన తోటి ఖైదీలు జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. డాక్టర్‌ను పిలిపించి ప్రేమ్థార్కు చికిత్స అందించారు. ప్రస్తుతానికి అతనికి ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు.