ఎర్రచందనం దుంగల స్వాధీనం | Redwood logs seized | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగల స్వాధీనం

Published Sat, Oct 19 2013 5:11 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

Redwood logs seized

రాపూరు, న్యూస్‌లైన్: వెలుగొండ అడవుల నుంచి అక్రమం తరలిస్తున్న ఎర్రచందనం దుంగలతో పాటు ఓ వాహనాన్ని శుక్రవారం తెల్లవారుజామున అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ శాఖ ఏసీఎఫ్ మహబూబ్‌బాషా కథనం మేరకు.. ఆకలివలస సమీపంలో ఎర్రచందనం దుంగలను ఓ ట్రక్కులో లోడ్ చేస్తున్నట్లు అధికారులకు సమాచారమందింది. వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతంలో గాలింపు ప్రారంభించారు. 6 దుంగలతో వస్తున్న ట్రక్కును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దుంగల విలువ రూ.60 వేలు, వాహనం విలువ రూ.6 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
 
 వాహనం నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన పేరు రఘురాముడని అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వాడినని ఆ వ్యక్తి వెల్లడించారు. తమ యజమాని కమ్మకోడూరు ఆచారి ఆదేశాల మేరకు రాపూరు మండలం గరిమెనపెంటకు చెందిన నరసింహులుకు వాహనం అప్పగించేందుకు వచ్చినట్లు వివరించారు.  దుంగలతో పాటు వాహనాన్ని ఆదూరుపల్లిలోని అటవీశాఖ గోదాముకు తరలించారు. తనిఖీల్లో డీఆర్వో రమణయ్య, స్క్వాడ్ సెక్షన్ అధికారులు వేదయ్య, పి.వి.కృష్టయ్య సిబ్బంది శ్రీరాములు, సలీం, వెంకటేశ్వర్లు, విజయ్, ఏఆర్ కానిస్టేబుళ్లు శ్రావణ్,చంద్ర పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement