sharavan
-
ప్రయోగాత్మకంగా.. నీటి పంటను 'షెల్ఫ్'లో పండిద్దాం!
శరవణన్ తాత సేంద్రియ సేద్యం చేశాడు, తండ్రి కెమికల్ ఫార్మింగ్ వెంట పరుగెత్తి దిగుబడి పెంచాడు. ఆ పరుగునే వారసత్వంగా అందుకున్న శరవణన్ కూడా 2006 వరకు కొనసాగించాడు. ఆ తర్వాత అతడు తన జీవితానికి తానే పరిశోధకుడయ్యాడు. పంటపొలం నుంచి ఇంటి అల్మరాల వరకు సాగిన ప్రయోగాల్లో మొక్కజొన్నను ఇంటిలోపల అరల్లో నీటితో పండిస్తున్నాడు. శరవణన్ ప్రయోగాలకు మెచ్చిన శాస్త్రీయమైన శాస్త్రవేత్తల సమాఖ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అతడిని ‘ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డ్’తో సత్కరించింది. శరవణన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే తమిళనాడు, నమక్కల్ జిల్లాలోని ‘అరియగౌండమ్ పట్టి’ బాట పట్టాల్సిందే. మట్టిలేని పంట.. అది 2005, ప్రభుత్వం వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు చేపడుతూ మైక్రో ఇరిగేషన్ విధానాన్ని తెచ్చింది. డ్రిప్, స్ప్రింక్లర్ సాగును పరిచయం చేసింది. అందుకు అవసరమైన పరికరాలను రాయితీతో ఇచ్చింది. అప్పుడు ఓ తొలి అడుగు వేశాడు శరవణన్. అది తనను గేమ్ చేంజర్‌గా మారుస్తుందని ఊహించలేదతడు. ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టాలనే ఆలోచన అలా ఉండగానే అతడు అప్పటి వరకు సాగు చేస్తున్న రసాయన ఎరువుల పంటను అంతు చిక్కని తెగులు తినేసింది. కృషి విజ్ఞానకేంద్రాల శిక్షణతో కొత్తపంథాలో నడిచాడతడు. వర్మీ కంపోస్ట్, పంచగవ్య, వేపచెక్క వంటి ప్రయోగాలన్నీ చేశాడు. ఆరు ఎకరాల పొలంలో పసుపు, వేరు శనగ, కూరగాయలు పండించాడు. వీటితోపాటు అక్వాకల్చర్, పాడి, కోళ్ల పరిశ్రమ, బయోగ్యాస్ ప్లాంట్లను కూడా నిర్వహించాడు. ఒక వ్యర్థాలు మరొక పంటకు ఎరువుగా మారే విధానాలన్నింటినీ ఏర్పాటు చేశాడు. తనకైతే వ్యవసాయ భూమి ఉంది కాబట్టి పాడి పశువులకు కావలసిన గడ్డికి సమస్య లేదు. పొలం లేని వాళ్లు పాడిపరిశ్రమ మీద ఉపాధి పొందేవారి కోసం ఓ ప్రత్యామ్నాయం ఉండాలనుకున్నాడు. ఆ ప్రయోగంలో భాగంగా హైడ్రోఫోనిక్ కల్చర్ మొదలు పెట్టారు. అంటే నీటితో పంటలు పండించే విధానం అన్నమాట.హైడ్రోఫోనిక్ కల్చర్‌లో కూరగాయలు పండించుకునే వాళ్లు సంబంధిత సామగ్రిని ఇంటి పైకప్పు మీద ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. శరవణన్ అదే ప్రయత్నాన్ని మొక్కజొన్న పంటను ఒక అల్మైరాలో చేసి చూపించాడు. శరవణన్ ప్రయోగాన్ని రైతులకు మోడల్‌గా చూపించింది కృషి విజ్ఞాన్ కేంద్రం. షెల్ఫ్ అరల్లో దశలవారీగా మొక్కజొన్న గింజలను వేస్తూ ఏడాదంతా పాడి పశువులకు పచ్చిగడ్డి అందేలా రూపొందించాడు. రైతులకు సౌకర్యంగా ఉండేటట్లు ఒక కిట్‌ను రూపొందించాడు. అర కేజీ మొక్కజొన్న గింజలతో ఐదుకేజీల గడ్డిని వారం రోజుల్లో సాధించవచ్చు. ఎనిమిదవ రోజు ఆ అరను ఖాళీ చేసి మళ్లీ కొత్తగింజలను వేసుకోవచ్చన్నమాట. ఇంట్లో నాలుగు షెల్ఫ్లుంటే చాలు రెండు పాడిగేదెల కడుపు నింపే మేత చేతికొస్తుంది. విజయవంతమైన ప్రయోగాలు చేయాలంటే పెద్ద పెద్ద చదువులు చదివి ఉండాల్సిన అవసరం లేదు, ఆసక్తి, నిరంతర శ్రమ ఉంటే సాధించవచ్చని నిరూపించాడు శరవణన్. అతడు రైతులకు మార్గదర్శనం చేయడంతోపాటు వ్యవసాయ విద్యార్థులకు పాఠ్యాంశం అవుతున్నాడు. ఇవి చదవండి: Jahnavi Falki: 'సామాన్య శాస్త్రానికి' తను ఒక మారుపేరు! -
బీజేపీకి బై.. బై.. కాషాయ పార్టీలో ఊహించని ట్విస్టులు
సాక్షి, చెన్నై: మంత్రి పళనివేల్ త్యాగరాజన్ వాహనంపై చెప్పు విసిరిన వ్యవహారం మదురై బీజేపీలో కలకలం రేపింది. మదురై నగర బీజేపీ అధ్యక్షుడు శరవణన్ తీవ్ర మనస్తాపంతో పార్టీకి బై..బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఇక మంత్రితో భేటీ కావడంతో ఆయన్ని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆదివారం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా డీఎంకే ఎమ్మెల్యే డాక్టర్ శరవణన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో మదురై నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యాడు. అయినా, బీజేపీ పెద్దలు ఆయనకు మదురై నగర పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. డీఎంకేపై ఇన్నాళ్లు విమర్శనాస్త్రాలు ఎక్కుబెడుతూ వచ్చిన శరవణన్‌కు శనివారం తుది నిర్ణయం ప్రకటించారు. మంత్రిపై దాడితో.. ముష్కరుల దాడిలో అమరుడైన ఆర్మీ జవాన్ లక్ష్మణన్‌కు మదురై విమానాశ్రయంలో మంత్రి పళని వేల్ త్యాగరాజన్ శనివారం నివాళులర్పించిన విషయం తెలిసిందే. బయటకు వెళ్తున్న సమయంలో ఆయన వాహనంపై బీజేపీ నాయకులు విరుచుకుపడ్డారు. చెప్పు విసరడంతో పోలీసులు రంగంలోకి దిగి, బీజేపీ నాయకులు ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనను మదురై నగర బీజేపీ అధ్యక్షుడు శరవణన్ తీవ్రంగా పరిగణించారు. మంత్రికి క్షమాపణలు చెప్పాలని నిర్ణయించారు. అర్ధరాత్రి వేళ మంత్రిని కలిసిసారి చెప్పడమే కాకుండా, బీజేపీ మతతత్వ పార్టీ అని, ఇటీవల కాలంలో రాష్ట్రంలో పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు తనను బాగా కలిచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ చర్యలను ఖండిస్తూ ఆ పార్టీ నుంచి వైదొలగనున్నానని శరవణన్ ప్రకటించారు. దీంతో ఆదివారం ఉదయాన్నే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై శరవణన్‌ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. శరవణన్ స్పందిస్తూ డీఎంకే తన మాతృ సంస్థ అని అయితే, ఇక డాక్టర్ వృత్తిపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. ఇది కూడా చదవండి: విద్య, వైద్యంపై ఖర్చు ‘ఉచితాలు’ కావు.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ -
చనిపోయాకే వేలిముద్రలు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఉపఎన్నికల్లో పోటీచేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థుల బీఫారం కోసం అపోలో ఆస్పత్రిలో అప్పటికే మరణించిన జయలలిత నుంచి వేలిముద్రలు సేకరించారని డీఎంకే వైద్య విభాగ కార్యదర్శి డాక్టర్ శరవణన్ ఆరోపించారు. సంబంధిత ఆధారాలను జయ మరణంపై దర్యాప్తు చేస్తున్న విచారణ కమిషన్‌కు బుధవారం ఆయన అందజేశారు. జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న జయను గత ఏడాది చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించడం తెలిసిందే. ఆమె ఆస్పత్రిలో ఉన్నప్పుడే తంజావూరు, తిరుప్పరగున్రం, అరవకురిచ్చి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. పోటీలో నిలిచిన పార్టీ అభ్యర్థులకు ఇచ్చే బీఫారంలపై పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో జయ సంతకం చేయాల్సి ఉంది. దాంతో అప్పటికే మరణించిన జయ వేలిముద్రలను బీఫారంలపై వేయించారని శరవణన్ కమిషన్ ముందు వాంగ్మూలమిచ్చారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు బాలాజీ సమక్షంలోనే జయ స్వయంగా వేలిముద్రలు వేశారని అప్పట్లో అన్నాడీఎంకే వర్గాలు చెప్పాయి. జయ త్వరగా కోలుకుంటున్నారని చికిత్స రోజుల్లో అపోలో ఆస్పత్రి బులెటిన్లు కూడా విడుదల చేసింది. ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జి కావాలనేది జయ అభీష్టమని అపోలో ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి స్వయంగా ప్రకటించారు. అన్నాడీఎంకే శ్రేణులు సైతం త్వరలో అమ్మ డిశ్చార్జి అంటూ ప్రచారం చేశాయి. కానీ, జయ ఆరోగ్యం విషమించి ఆస్పత్రిలో కన్నుమూశారు. అయితే, ఆమె మరణం వెనుక మిస్టరీ దాగి ఉందని రాష్ట్రవ్యాప్తంగా అనుమానాలు పెరిగాయి. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అన్నా డీఎంకే చీలిక నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం సైతం న్యాయవిచారణకు పట్టుపట్టారు. దీంతో జయ మరణంపై రిటైర్డు జడ్జి నేతృత్వంలో సర్కారు విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. జయ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మరణం వరకు జరిగిన ఘటనలపై నవంబర్ 22లోగా ప్రమాణపత్రాలివ్వాలని సంబంధిత వ్యక్తులను కమిషన్ ఆదేశించింది. జయ నివాసం పోయెస్ గార్డెన్‌లోని సిబ్బంది, అపోలో వైద్యులు, జయకు చికిత్స చేసిన లండన్ వైద్యుడు, ఎయిమ్స్ డాక్టర్లు, ఇద్దరు ప్రభుత్వ డాక్టర్లు, ఉన్నతాధికారులు తదితరులకు ఈ సమన్లు ఇచ్చింది. కాగా, కమిషన్‌కు ఇప్పటివరకు 12 ప్రమాణపత్రాలు, 70కి పైగా అఫిడవిట్లు అందాయి. డాక్టర్ శరవణన్, జయ మేనకోడలు దీప, ఆమె భర్త మాధవన్, అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు..ఇలా మొత్తం ఏడుగురు ప్రమాణపత్రాలు ఇచ్చారు. -
ఎర్రచందనం దుంగల స్వాధీనం
రాపూరు, న్యూస్‌లైన్: వెలుగొండ అడవుల నుంచి అక్రమం తరలిస్తున్న ఎర్రచందనం దుంగలతో పాటు ఓ వాహనాన్ని శుక్రవారం తెల్లవారుజామున అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ శాఖ ఏసీఎఫ్ మహబూబ్‌బాషా కథనం మేరకు.. ఆకలివలస సమీపంలో ఎర్రచందనం దుంగలను ఓ ట్రక్కులో లోడ్ చేస్తున్నట్లు అధికారులకు సమాచారమందింది. వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతంలో గాలింపు ప్రారంభించారు. 6 దుంగలతో వస్తున్న ట్రక్కును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దుంగల విలువ రూ.60 వేలు, వాహనం విలువ రూ.6 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. వాహనం నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన పేరు రఘురాముడని అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వాడినని ఆ వ్యక్తి వెల్లడించారు. తమ యజమాని కమ్మకోడూరు ఆచారి ఆదేశాల మేరకు రాపూరు మండలం గరిమెనపెంటకు చెందిన నరసింహులుకు వాహనం అప్పగించేందుకు వచ్చినట్లు వివరించారు. దుంగలతో పాటు వాహనాన్ని ఆదూరుపల్లిలోని అటవీశాఖ గోదాముకు తరలించారు. తనిఖీల్లో డీఆర్వో రమణయ్య, స్క్వాడ్ సెక్షన్ అధికారులు వేదయ్య, పి.వి.కృష్టయ్య సిబ్బంది శ్రీరాములు, సలీం, వెంకటేశ్వర్లు, విజయ్, ఏఆర్ కానిస్టేబుళ్లు శ్రావణ్,చంద్ర పాల్గొన్నారు.