తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వచ్చే నెల 3 నుంచి ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ రెడ్డి చెప్పారు. అక్టోబరు 3న ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో తొలి ప్రాంతీయ సదస్సు జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు రాయలసీమతోపాటు నెల్లురు జిల్లా సమైక్యవాదులు హాజరుకావాలని కోరారు.
అక్టోబర్ 5న గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రెండో సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. దీనికి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సమైక్యవాదులు హాజరుకావాలని కోరారు. అక్టోబర్ 7న మూడో ప్రాంతీయ సదస్సు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తామన్నారు. దీనికి తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సమైక్యవాదులు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర కోసం కట్టుబడటాన్ని స్వాగతిస్తున్నామని లక్ష్మణ రెడ్డి చెప్పారు. టీడీపీ కూడా సమైక్యాంధ్రకు కట్టుబడాలని ఆయన కోరారు.
సీమాంధ్రలో ప్రాంతీయ సదస్సులు
Published Wed, Sep 25 2013 2:57 PM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM
Advertisement
Advertisement