ఆసెట్ ఫలితాలు విడుదల | Released the results of aset | Sakshi
Sakshi News home page

ఆసెట్ ఫలితాలు విడుదల

Published Fri, May 30 2014 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM

Released the results of aset

  • జూన్ 7 నుంచి ఆన్‌లైన్ కౌన్సెలింగ్
  •  ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం, పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్, సమీకృత ఇంజినీరింగ్ ఏయూ ఈఈటీ 2014 కోర్సుల ప్రవేశ పరీక్ష ఫలితాలు గురువారం ఉదయం వీసీ జి.ఎస్.ఎన్.రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాంక్ కార్డులు, కౌన్సెలింగ్ విధానం, తేదీల వివరాలను www.andnra university.edu.in,www.audoa.in వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్టు చెప్పారు.
     
    కౌన్సెలింగ్ వివరాలు  : ప్రవేశ ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో అమలు చేస్తున్నారు. ఏయూ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు ర్యాంక్ కార్యులను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎన్‌సీసీ, సీఏపీ విభాగాల వారికి జూన్ 7న, వికలాంగులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాల విద్యార్థులకు జూన్ 8న ప్రవేశాల సంచాలకుల కార్యాలయం లో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. జూన్ 9 నుంచి 12 వరకు విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడలలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. జూన్ 9 నుంచి 14 వరకు ర్యాంకుల వారీగా వెబ్ ఆప్షన్లు విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలో ఎంపిక చేసుకోవాలి.
     
    మొదటి దశ సీట్ల కేటాయింపు వివరాలను జూన్ 15న విడుదల చేస్తారు. ఈ దశలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు జూన్ 15 నుంచి 18లోగా ఫీజులు చెల్లించాలి. జూన్ 20, 21 తేదీలలో రెండో దశ కౌన్సెలింగ్‌కు సర్టిఫికెట్ల పరిశీలన జరుపుతారు. రెండో దశకు జూన్ 21 నుంచి 23వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వవలసి ఉంటుంది.  రెండో దశ సీట్ల కేటాయింపు జూన్ 24న జరుపుతారు. రెండో దశలో సీట్లు పొందినవారు జూన్ 25 నుంచి 28లోగా ఫీజులు చెల్లించాలి. విభాగాల వారీగా ఖాళీల వివరాలను జూన్ 29న వెబ్‌లో ఉంచుతారు. వర్సిటీ కళాశాలల్లో ఖాళీలను జూన్ 30, జూలై ఒకటో తేదీలలో స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తారు. అనుబంధ కళాశాల్లో మిగులు సీట్లను జూలై 2,3 తేదీల్లో స్పాట్ అడ్మిషన్ల విధానంలో భర్తీ చేపట్టనున్నారు.
     
    విభాగా వారీ ర్యాంకర్లు : లైఫ్‌సెన్సైస్ విభాగంలో డి.షాలిని (విశాఖ) ప్రథమ, జి.వి హర్షిత(విశాఖ) ద్వితీయ, జి.బి కృష్ట(ప్రకాశం) తృతీయ, ఫిజికల్‌సైన్స్‌లో పి.సాయికుమార్ (పశ్చిమ గోదావరి) ప్రథమ, డి.ఆర్.ఎల్.అంబికామణి(తూర్పుగోదావరి) ద్వితీయ, ఎ.మంగబాబు (తూర్పుగోదావరి) తృతీయ, మ్యాథమెటికల్ సైన్స్‌లో ఎం.లక్ష్మీప్రియ (విశాఖ) ప్రథమ, ఎస్.రమ్య (విశాఖ) ద్వితీయ, సి.హెచ్.డి.ఎల్.ప్రసన్న (తూర్పుగోదావరి) తృతీయ ర్యాంకులు సాధించారు.
     
    కెమికల్ సైన్స్‌లో ఎస్.మనీష్‌కుమార్ రెడ్డి(వైఎస్‌ఆర్ కడప) ప్రథమ, ఎం.సుప్రియ (తూర్పుగోదావరి) ద్వితీయ, పి.వి.సౌందర్య(విశాఖ) తృతీయ, జియాలజీలో ఎస్.యు.ఉమావెంకటేశ్వరరావు(పశ్చిమగోదావరి) ప్రథమ, కె.అలెక్సీ మరియా ద్వితీయ, ఎల్.లోకనాథ్(ఒరిస్సా) తృతీయ, హ్యూమానిటీస్, సోషల్‌సైన్స్‌లో కె.రాజు (విశాఖ) ప్రథమ, కె.కె.ప్రద్యుమ్న (విశాఖ) ద్వితీయ, ఇ.శ్రీనివాసరావు (శ్రీకాకుళం) తృతీయ, ఆంగ్లంలో డి.ఉమా శంకర్ (విశాఖ) ప్రథమ, ఎ.ప్రణీత (విశాఖ) ద్వితీయ, ఆర్.శాన్సి(విశాఖ) తృతీయ, తెలుగులో ఎం.సత్యారావు (విజయనగరం) ప్రథమ, పి.ధనుంజయరావు (విజయనగరం) ద్వితీయ, బి.వీరబాబు(కృష్ణా)తృతీయ స్థానాలలో నిలచారు. ఐదేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సుకు నిర్వహించిన ఏయూఈఈడీలో డి.ల లిత్ రాజ్ (విజయనగరం) ప్రథమ, జి.జయధర్ (విజయనగరం) ద్వితీయ, జి.సాయి కిరణ్(విశాఖ) తృతీయ స్థానాలలో నిలిచారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement