Aset
-
ఆసెట్‌కు 21,586 దరఖాస్తులు
* 27 నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు * మే 5 నుంచి ప్రవేశ పరీక్షలు ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం పీజీ, సమీకృత ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆసెట్, ఆఈట్ ప్రవేశ పరీక్షకు 21,586 దరఖాస్తులు వచ్చినట్లు ప్రవేశాల సంచాలకుడు ఆచార్య ఒ.అనీల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ సెట్‌కు 18,546, ఆఈట్‌కు 2,210, ప్రవేశ పరీక్ష అవసరం లేకుండా ప్రవేశం కల్పించే కోర్సులకు 830 దరఖాస్తులు వచ్చాయి. విభాగాల వారీగా పరిశీలిస్తే.. లైఫ్ సెన్సైస్‌కు 3001, ఫిజికల్ సైన్స్‌లో 1655, మ్యాథ్‌మెటిక్స్ సైన్స్‌లో 2372, కెమికల్ సెన్సైస్‌కు 4581, జియాలజీలో 244, హ్యూమానిటీస్, సోషల్ సైన్స్‌కు 5319, ఇంగ్లిష్‌కు 736, తెలుగులో 638 దరఖాస్తులు వచ్చాయి. పరీక్ష వేళలివి.. ప్రవేశ పరీక్షలను మే 5, 6 తేదీలలో నిర్వహిస్తారు. 5వ తేదీ ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు లైఫ్ సైన్స్, జియాలజీ కోర్సులకు, ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హ్యూమానిటీస్, సోషల్సెన్సైస్కు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెలుగు, ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులకు, మే 6వ తేదీ ఉదయం 9 గంటలకు కెమికల్ సెన్సైస్, 11.30 గంటలకు మ్యాథమెటికల్ సెన్సైస్, మధ్యాహ్నం 2.30 గంటలకు ఫిజికల్ సెన్సైస్, ఇంగ్లిష్ కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలు... విశాఖపట్నంలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య, గాయత్రీ విద్యా పరిషత్, ఏయూ ఆర్ట్స్ కళాశాల, దూరవిద్యా కేంద్రం, శ్రీకాకుళం గాయత్రీ సైన్స్, మేనేజ్మెంట్ కళాశాల, విజయనగరం ఎంఆర్ అటానమస్ కళాశాల, కాకినాడ ఐడియల్ కళాశాల, రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, ఏలూరు సర్ సి.ఆర్.రెడ్డి పీజీ కళాశాల, భీమవరం కె.జి.ఆర్.ఎల్ కళాశాల, విజయవాడ ఎస్.ఆర్.ఆర్, సివిఆర్ డిగ్రీ కళాశాల, గుంటూరు జేకేజీ కళాశాల, అమలాపురం ఎస్.కె.బి.ఆర్ కళాశాలలో ఆసెట్ పరీక్షలు జరుగుతాయి. ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్ (ఆఈట్) ప్రవేశ పరీక్ష విశాఖపట్నంలోని గాయత్రీ విద్యా పరిషత్ డిగ్రీ కళాశాల(ఎంవిపీ కాలనీ), డాక్టర్ ఎల్.బి.కళాశాల, ఏయూ దూరవిద్యా కేద్రం, కాకినాడ ఐడియల్ కళాశాల, విజయవాడ ఎస్ఆర్ఆర్, సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష జరుపుతారు. ఈ నెల 27వ తేదీ నుంచి www.audoa.in.www.andhrauniversity.edu.in/doa వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చును. శారీరక వైకల్యం కలిగిన వారు ముందుగా పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ను సంప్రదించి సహాయకుడి అనుమతి పొందవచ్చును. పరీక్ష కేంద్రంలో ఒక గంట ముందుగా విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభం అయిన తరువాత విద్యార్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరు. -
నేటినుంచి ఆసెట్ కౌన్సెలింగ్
విశాఖపట్నం : ఆంధ్ర విశ్వవిద్యాలయం, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వర్సిటీ(శ్రీకాకుళం), అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు, ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ద్వారా నిర్వహిస్తున్న ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్ కోర్సులకు నేటినుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 9 గంటలకు ప్రవేశాల సంచాలకుని కార్యాలయంలో ప్రవేశాలు జరుపుతామని సంచాలకుడు ఆచార్య ఓ. అనిల్ కుమార్ తెలిపారు. వెబ్సైట్లో ఖాళీల వివరాలు రిజర్వేషన్ వారీగా పీజీ, ఇంజినీరింగ్ కోర్సుల సీట్ల వివరాలు ఏయూ ప్రవేశాల సంచాలకుని వెబ్సైట్లో పొందుపరిచారు. సీట్ల సంఖ్య, ఫీజుల వివరాలు, రిజర్వేషన్ వివరాలను దీనిలో విపులంగా తెలిపారు. ర్యాంకుల వారీగా విద్యార్థులు హాజరుకావలసిన తేదీలను కూడా ఇందులో పొందుపరిచారు. పూర్తి సమాచారం కోసం www.audoa.in,www.andhrauniversity.edu.in/doa వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. విద్యార్థులు తమ విద్యార్హత తెలిపే సర్టిఫికెట్లు, డిగ్రీ ప్రొవిజనల్, మార్కుల జాబితాలు, స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలి. ద్రవిడ వర్సిటీలో ప్రవేశాలుకుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలోని పలు కోర్సులకు సైతం ఆసెట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్లు సంచాలకుడు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల అర్హత ఆధారంగా ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. పూర్తి సమాచారం కోసం www.dravidianuniversity.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. -
ఆసెట్ ఫలితాలు విడుదల
జూన్ 7 నుంచి ఆన్లైన్ కౌన్సెలింగ్ ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం, పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్, సమీకృత ఇంజినీరింగ్ ఏయూ ఈఈటీ 2014 కోర్సుల ప్రవేశ పరీక్ష ఫలితాలు గురువారం ఉదయం వీసీ జి.ఎస్.ఎన్.రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాంక్ కార్డులు, కౌన్సెలింగ్ విధానం, తేదీల వివరాలను www.andnra university.edu.in,www.audoa.in వెబ్సైట్లో పొందుపర్చినట్టు చెప్పారు. కౌన్సెలింగ్ వివరాలు : ప్రవేశ ప్రక్రియను ఆన్లైన్ విధానంలో అమలు చేస్తున్నారు. ఏయూ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు ర్యాంక్ కార్యులను డౌన్లోడ్ చేసుకోవాలి. ఎన్సీసీ, సీఏపీ విభాగాల వారికి జూన్ 7న, వికలాంగులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాల విద్యార్థులకు జూన్ 8న ప్రవేశాల సంచాలకుల కార్యాలయం లో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. జూన్ 9 నుంచి 12 వరకు విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడలలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. జూన్ 9 నుంచి 14 వరకు ర్యాంకుల వారీగా వెబ్ ఆప్షన్లు విద్యార్థులు ఆన్లైన్ విధానంలో ఎంపిక చేసుకోవాలి. మొదటి దశ సీట్ల కేటాయింపు వివరాలను జూన్ 15న విడుదల చేస్తారు. ఈ దశలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు జూన్ 15 నుంచి 18లోగా ఫీజులు చెల్లించాలి. జూన్ 20, 21 తేదీలలో రెండో దశ కౌన్సెలింగ్‌కు సర్టిఫికెట్ల పరిశీలన జరుపుతారు. రెండో దశకు జూన్ 21 నుంచి 23వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వవలసి ఉంటుంది. రెండో దశ సీట్ల కేటాయింపు జూన్ 24న జరుపుతారు. రెండో దశలో సీట్లు పొందినవారు జూన్ 25 నుంచి 28లోగా ఫీజులు చెల్లించాలి. విభాగాల వారీగా ఖాళీల వివరాలను జూన్ 29న వెబ్‌లో ఉంచుతారు. వర్సిటీ కళాశాలల్లో ఖాళీలను జూన్ 30, జూలై ఒకటో తేదీలలో స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తారు. అనుబంధ కళాశాల్లో మిగులు సీట్లను జూలై 2,3 తేదీల్లో స్పాట్ అడ్మిషన్ల విధానంలో భర్తీ చేపట్టనున్నారు. విభాగా వారీ ర్యాంకర్లు : లైఫ్‌సెన్సైస్ విభాగంలో డి.షాలిని (విశాఖ) ప్రథమ, జి.వి హర్షిత(విశాఖ) ద్వితీయ, జి.బి కృష్ట(ప్రకాశం) తృతీయ, ఫిజికల్సైన్స్లో పి.సాయికుమార్ (పశ్చిమ గోదావరి) ప్రథమ, డి.ఆర్.ఎల్.అంబికామణి(తూర్పుగోదావరి) ద్వితీయ, ఎ.మంగబాబు (తూర్పుగోదావరి) తృతీయ, మ్యాథమెటికల్ సైన్స్‌లో ఎం.లక్ష్మీప్రియ (విశాఖ) ప్రథమ, ఎస్.రమ్య (విశాఖ) ద్వితీయ, సి.హెచ్.డి.ఎల్.ప్రసన్న (తూర్పుగోదావరి) తృతీయ ర్యాంకులు సాధించారు. కెమికల్ సైన్స్‌లో ఎస్.మనీష్‌కుమార్ రెడ్డి(వైఎస్ఆర్ కడప) ప్రథమ, ఎం.సుప్రియ (తూర్పుగోదావరి) ద్వితీయ, పి.వి.సౌందర్య(విశాఖ) తృతీయ, జియాలజీలో ఎస్.యు.ఉమావెంకటేశ్వరరావు(పశ్చిమగోదావరి) ప్రథమ, కె.అలెక్సీ మరియా ద్వితీయ, ఎల్.లోకనాథ్(ఒరిస్సా) తృతీయ, హ్యూమానిటీస్, సోషల్‌సైన్స్‌లో కె.రాజు (విశాఖ) ప్రథమ, కె.కె.ప్రద్యుమ్న (విశాఖ) ద్వితీయ, ఇ.శ్రీనివాసరావు (శ్రీకాకుళం) తృతీయ, ఆంగ్లంలో డి.ఉమా శంకర్ (విశాఖ) ప్రథమ, ఎ.ప్రణీత (విశాఖ) ద్వితీయ, ఆర్.శాన్సి(విశాఖ) తృతీయ, తెలుగులో ఎం.సత్యారావు (విజయనగరం) ప్రథమ, పి.ధనుంజయరావు (విజయనగరం) ద్వితీయ, బి.వీరబాబు(కృష్ణా)తృతీయ స్థానాలలో నిలచారు. ఐదేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సుకు నిర్వహించిన ఏయూఈఈడీలో డి.ల లిత్ రాజ్ (విజయనగరం) ప్రథమ, జి.జయధర్ (విజయనగరం) ద్వితీయ, జి.సాయి కిరణ్(విశాఖ) తృతీయ స్థానాలలో నిలిచారు.