విశాఖపట్నం : ఆంధ్ర విశ్వవిద్యాలయం, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వర్సిటీ(శ్రీకాకుళం), అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు, ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ద్వారా నిర్వహిస్తున్న ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్ కోర్సులకు నేటినుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 9 గంటలకు ప్రవేశాల సంచాలకుని కార్యాలయంలో ప్రవేశాలు జరుపుతామని సంచాలకుడు ఆచార్య ఓ. అనిల్ కుమార్ తెలిపారు.
వెబ్‌సైట్‌లో ఖాళీల వివరాలు
రిజర్వేషన్ వారీగా పీజీ, ఇంజినీరింగ్ కోర్సుల సీట్ల వివరాలు ఏయూ ప్రవేశాల సంచాలకుని వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. సీట్ల సంఖ్య, ఫీజుల వివరాలు, రిజర్వేషన్ వివరాలను దీనిలో విపులంగా తెలిపారు. ర్యాంకుల వారీగా విద్యార్థులు హాజరుకావలసిన తేదీలను కూడా ఇందులో పొందుపరిచారు. పూర్తి సమాచారం కోసం www.audoa.in,www.andhrauniversity.edu.in/doa వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. విద్యార్థులు తమ విద్యార్హత తెలిపే సర్టిఫికెట్లు, డిగ్రీ ప్రొవిజనల్, మార్కుల జాబితాలు, స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలి.
ద్రవిడ వర్సిటీలో ప్రవేశాలుకుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలోని పలు కోర్సులకు సైతం ఆసెట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్లు సంచాలకుడు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల అర్హత ఆధారంగా ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. పూర్తి సమాచారం కోసం www.dravidianuniversity.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
నేటినుంచి ఆసెట్ కౌన్సెలింగ్
Published Thu, May 28 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM
Advertisement