* 27 నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు
* మే 5 నుంచి ప్రవేశ పరీక్షలు
ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం పీజీ, సమీకృత ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆసెట్, ఆఈట్ ప్రవేశ పరీక్షకు 21,586 దరఖాస్తులు వచ్చినట్లు ప్రవేశాల సంచాలకుడు ఆచార్య ఒ.అనీల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ సెట్‌కు 18,546, ఆఈట్‌కు 2,210, ప్రవేశ పరీక్ష అవసరం లేకుండా ప్రవేశం కల్పించే కోర్సులకు 830 దరఖాస్తులు వచ్చాయి. విభాగాల వారీగా పరిశీలిస్తే.. లైఫ్ సెన్సైస్‌కు 3001, ఫిజికల్ సైన్స్‌లో 1655, మ్యాథ్‌మెటిక్స్ సైన్స్‌లో 2372, కెమికల్ సెన్సైస్‌కు 4581, జియాలజీలో 244, హ్యూమానిటీస్, సోషల్ సైన్స్‌కు 5319, ఇంగ్లిష్‌కు 736, తెలుగులో 638 దరఖాస్తులు వచ్చాయి.
పరీక్ష వేళలివి..
ప్రవేశ పరీక్షలను మే 5, 6 తేదీలలో నిర్వహిస్తారు. 5వ తేదీ ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు లైఫ్ సైన్స్, జియాలజీ కోర్సులకు, ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హ్యూమానిటీస్, సోషల్‌సెన్సైస్‌కు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెలుగు, ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులకు, మే 6వ తేదీ ఉదయం 9 గంటలకు కెమికల్ సెన్సైస్, 11.30 గంటలకు మ్యాథమెటికల్ సెన్సైస్, మధ్యాహ్నం 2.30 గంటలకు ఫిజికల్ సెన్సైస్, ఇంగ్లిష్ కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాలు...
విశాఖపట్నంలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య, గాయత్రీ విద్యా పరిషత్, ఏయూ ఆర్ట్స్ కళాశాల, దూరవిద్యా కేంద్రం, శ్రీకాకుళం గాయత్రీ సైన్స్, మేనేజ్‌మెంట్ కళాశాల, విజయనగరం ఎంఆర్ అటానమస్ కళాశాల, కాకినాడ ఐడియల్ కళాశాల, రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, ఏలూరు సర్ సి.ఆర్.రెడ్డి పీజీ కళాశాల, భీమవరం కె.జి.ఆర్.ఎల్ కళాశాల, విజయవాడ ఎస్.ఆర్.ఆర్, సివిఆర్ డిగ్రీ కళాశాల, గుంటూరు జేకేజీ కళాశాల, అమలాపురం ఎస్.కె.బి.ఆర్ కళాశాలలో ఆసెట్ పరీక్షలు జరుగుతాయి.
ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్ (ఆఈట్) ప్రవేశ పరీక్ష విశాఖపట్నంలోని గాయత్రీ విద్యా పరిషత్ డిగ్రీ కళాశాల(ఎంవిపీ కాలనీ), డాక్టర్ ఎల్.బి.కళాశాల, ఏయూ దూరవిద్యా కేద్రం, కాకినాడ ఐడియల్ కళాశాల, విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్, సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష జరుపుతారు. ఈ నెల 27వ తేదీ నుంచి www.audoa.in.www.andhrauniversity.edu.in/doa వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. శారీరక వైకల్యం కలిగిన వారు ముందుగా పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ను సంప్రదించి సహాయకుడి అనుమతి పొందవచ్చును. పరీక్ష కేంద్రంలో ఒక గంట ముందుగా విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభం అయిన తరువాత విద్యార్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరు.
ఆసెట్‌కు 21,586 దరఖాస్తులు
Published Tue, Apr 26 2016 3:37 AM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM
Advertisement