జియో సిమ్‌కు పూజలు
జియో సిమ్‌కు పూజలు
Published Wed, Mar 29 2017 8:08 PM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM
భట్టిప్రోలు: రిలయన్స్ జియో సిమ్ ఆఫర్ గడువు నేటితో ముగియనుండటంతో వినియోగదారులు ఆఫర్ గడువును పొడిగించాలని కోరుతూ జియో సిమ్‌కు పూజలు నిర్వహించారు. ఆరు నెలల కిందట ప్రారంభమైన జియో సిమ్ సేవలు వినియోగదారులు ఉచితంగా అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది పర్వ దినాన గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామానికి చెందిన వినియోగదారుడు మాచర్ల వీరేంద్ర జియో సిమ్‌కు పండ్లు, పూలు పెట్టి పూజలు నిర్వహించాడు.
Advertisement
Advertisement