విజయవాడ దుర్గ గుడిలో కలకలం | religion propaganda in vijayawada durga temple | Sakshi
Sakshi News home page

విజయవాడ దుర్గ గుడిలో కలకలం

Published Sun, May 3 2015 1:25 PM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM

religion propaganda in vijayawada durga temple

విజయవాడ: విజయవాడ దుర్గ గుడిలో అన్యమత ప్రచారం కలకలం రేపింది. అరండల్ సత్రంలోని 302 గదిలో అన్యమతస్థులు ప్రార్థనలు నిర్వహించారు. ఫోటోలు, పుస్తకాలతో వారు ప్రార్థనలు నిరహించినట్టు గుర్తించిన భక్తులు ఆలయ కార్యనిర్వణాధికారికి ఫిర్యాదు చేశారు. ఆలయ ప్రాంగణంలో అన్యమత ప్రచారం జరగడంతో ఆందోళన చేశారు. ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఈవో ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామని చెప్పారు.

మరోవైపు ఆలయ ఈవోపై బీజేపీ నాయకులు, హిందూ మత సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. అన్యమత ప్రచారం  ఆపడం చేతకాకపోతే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అన్యమత ప్రచారం నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement