చంద్రబాబుకు ఇన్ని రోజులు తెలివితేటలు లేవా.. | Sajjala Interesting Comments On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చం‍ద్రబాబుపై సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు

Published Thu, Apr 21 2022 5:48 PM | Last Updated on Thu, Apr 21 2022 6:10 PM

Sajjala Interesting Comments On Chandrababu Naidu - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చం‍ద్రబాబు తన పుట్టినరోజు సందర్బంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ తనకు శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఇవ్వాలని దుర్గమ్మను కోరుకుంటున్నట్టు చెప్పారు. అంటే ఇన్ని రోజులు చంద్రబాబుకు తెలివితేటలు లేవా..? అన్ని ప్రశ్నించారు. ఆయనకు మంచి ఆలోచనలు, మంచి మనసు ఉంటే దుర్గమ్మ తప్పకుండా కరుణిస్తుంది. 

అన్ని వర్గాలను అవహేళనగా మాట్లాడటం చూస్తే ఆయన రాజకీయాల్లో ఉండటం అవసరమా అనిపిస్తోంది. వాస్తవాలను దాచి ప్రజలకు అబద్దాలు చెబుతున్నారు. ఆయనకు మతి భ్రమించింది. పోలవరంపై టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తోంది. పోలవరం ఆలస్యానికి చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలే కారణం. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి’’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement