ఇనుప నిచ్చెనలపై వెనక్కి తగ్గిన టీటీడీ
వివాదాస్పదం కావడంతో నిచ్చెనల తొలగింపు
సాక్షి, తిరుమల: తిరుమల ఆలయంలో వివాదానికి కారణమైన ఇనుప నిచ్చెనల ఏర్పాటును టీటీడీ ఉపసంహరించుకుంది. వెండివాకిలి ప్రాకారానికి ఆనుకుని 30 అడుగుల ఎత్తులో ఇనుప నిచ్చెనలు ఏర్పాటు చేయాలన్న టీటీడీ నిర్ణయాన్ని భక్తులు, ఆధ్యాత్మిక, ధార్మిక సం ఘాలు వ్యతిరేకించాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్చించింది. వివాదాస్పద నిచ్చె నలు తొలగించకపోతే దాని ప్రభావం ప్రభు త్వంపై పడే అవకాశముందని గుర్తించింది. దీంతో నిచ్చెనలు తొలగించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి నిచ్చెనలు తొలగించారు.
భక్తుల మనోభావాలను గౌరవిస్తాం
వెండివాకిలి వద్ద తోపులాటలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేలా ఏర్పాటు చేసిన ఇనుప నిచ్చెనల నిర్మాణం నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. భక్తుల మనోభావాలు గౌరవించాలనే సంకల్పంతో నిచ్చెనలు తొలగించామన్నారు. నిర్మాణంలో భక్తుల సౌకర్యం తప్ప మరో ఉద్దేశమే లేదని ఈవో స్పష్టం చేశారు.
స్వయంగా వచ్చే దాతలకే కాటేజీలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనున్నాయి. ఆ రోజుల్లో స్వయం గా వచ్చే దాతలకు మాత్రమే కాటేజీలు కేటాయించనున్నారు. వారి సిఫారసులకు గదులు కేటాయించరు. సెప్టెంబర్ 27న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా సెప్టెంబర్ 26, 27న మాత్రం కాటేజీ దాత లకు గదుల కేటాయింçపు ఉండదని టీటీడీ ప్రకటించింది. ఒకే కాటేజీలో రెండు గదుల కంటే ఎక్కువగా విరాళంగా ఇచ్చిన దాతల కు రెండు గదులు రెండు రోజుల పాటు కేటాయిస్తారు. గదులు కావాల్సిన కాటేజీ దాతలు 4 రోజుల ముందుగా ttdsevaonline.com రిజర్వు చేసుకోవాలి.