Anil Kumar Singal
-
సీనియర్ రెసిడెంట్లకు భారీగా స్టైఫండ్ పెంపు: ఏకే సింఘాల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్‌ను రూ. 45 వేల నుంచి 75 వేలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం తెలిపారు. కాగా రాష్ట్రంలో కరోనా విధుల్లో సుమారు 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఉన్నారని.. పెంచిన స్టైఫండ్ వీరికి వర్తిస్తుందని తెలిపారు. కాగా రాష్ట్రంలో ఉన్న జూనియర్ డాక్టర్ల డిమాండ్‌పై ప్రభుత్వం చర్చిస్తోందన్నారు. అలాగే రాష్ట్రంలో పీజీ పూర్తి చేసిన 800 మంది డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని వారు కోరారని.. పీజీ వైద్యుల డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని వివరించారు. విదేశాలకు వెళ్లేవారికి మొదటి ప్రాధాన్యత అనంతరం రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మాట్లాడుతూ.. '' ఏపీలో తాజా కరోనా కేసుల లెక్కల ప్రకారం పాజిటివిటీ రేట్ 13.02 శాతంగా ఉంది. గడచిన 24 గంటల్లో 443 టన్నుల మేర ఆక్సిజన్ వినియోగించాం. 25 లక్షల మందికి పైగా రెండు డోసులు పూర్తయ్యాయి. 50 లక్షల మందికి పైగా మొదటి డోస్ వేయడం పూర్తైంది. విదేశాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్ధులకు వ్యాక్సినేషన్ మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నాం. విదేశాలకు వెళ్లే వాళ్లు పాస్ పోర్టు నెంబర్ ఇవ్వాలి. గతంలో ఆధార్ నెంబరుతోనే కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకునేవారు. తాజాగా పాస్ పోర్టు నెంబరును కూడా కోవిన్ పోర్టల్‌లో పెట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరాం. అని తెలిపారు చదవండి: ఏపీలో కొత్తగా 12,768 కరోనా కేసులు -
వ్యాక్సిన్ కొరత దృష్ట్యా సెకండ్ డోస్‌కే ప్రాధాన్యత: ఏకే సింఘాల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.కరోనా రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు లభించేలా తగు చర్యలు తీసుకున్నామన్నారు. బెడ్లు, రెమిడెసివిర్పై ప్రత్యేక దృష్టిసారించామని పేర్కొన్నారు. ఆస్పత్రులకు 15,747 రెమిడెసివిర్ వయల్స్ ను పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత దృష్ట్యా సెకండ్ డోస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ లభ్యత వచ్చిన వెంటనే అందరికీ టీకాలు వేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రైవేట్ ఆస్పత్రులపై అధికారుల నిఘా కొనసాగుతోందని తెలిపారు.కాగా ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా 20,068 కరోనా కేసులు, 96 మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో 1,01,071 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చదవండి: పాజిటివ్ రేట్ 17%: ఏపీలో కొత్త కరోనా కేసులు ఎన్నంటే.. -
కరోనా ఎఫెక్ట్ : టీటీడీ సంచలన నిర్ణయం
సాక్షి, తిరుపతి : ప్రమాదకర కరోనా వైరస్ (కోవిడ్-19) దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నివారణకు భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా స్వస్తి పలికింది. టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి భక్తులను దర్శనానికి పంపాలని టీటీడీ నిర్ణయించింది. కంపార్ట్మెంట్లులో వేచి ఉంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కడప జిల్లాలోని ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణ భూమిపూజను వాయిదా వేసింది. అలాగే కరోనా నివారణను కోరుతూ.. శ్రీశ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి మహాయాగంను నిర్వహించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. మరోవైపు విశేషపూజ, సహస్త్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం సేవలను ముందుగా బుక్ చేసుకున్న భక్తులకు తేది మార్చుకునే అవకాశం, లేదా బ్రేక్ దర్శనంకు వెళ్లే వెసులుబాటును టీటీడీ కల్పించింది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం మంచిదికాదని భావించిన టీటీడీ ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వివరాలను వెల్లడించారు. ‘దేశ, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. వైరస్ వ్యాప్తి కాకుండా నిరంతరం చర్యలు చేపడుతున్నాం. ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం మంచిది కాదు. దీని వల్ల త్వరగా వైరస్ వ్యాపిస్తుంది. తిరుమలని సెక్టార్ లుగా విభజించి, శుభ్రత చర్యలు చేపట్టాము. గదులు కాళీ చేసిన వెంటనే పూర్తిగా సుద్ది చేసిన తర్వాత మరొకరికి కేటాయిస్తున్నాము. అనుమానితులను అలిపిరి, నడకదారిలో గుర్తించి వైద్య చికిత్సకోసం తరలించే ఏర్పాటు చేశాం. కరోనా వైరస్ ప్రభావితం వల్లా ఒకే చోట ఆరు గంటలు ఉండటం మంచిది కాదు. సీతారాముల కళ్యాణం రద్దు చేసి, లైవ్ ద్వరా కళ్యాణం వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మంగళవారం నుంచి టీటీడీ కేటాయించే సమయంలో మాత్రమే దర్శనానికి రావాలి. భక్తులు కూడా సహకరించాలి’ అని తెలిపారు. -
‘శ్రీవారి గరుడ సేవకు అన్ని ఏర్పాట్లు చేశాం’
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల భాగంగా గరుడ వాహన సేవకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సుమారు రెండు లక్షల మంది భక్తులు స్వామివారి గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేలా ఏర్పాట్లు చేశామన్నారు. గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. మాడ వీధుల్లో 20 ప్రాంతాల్లో, వెలుపల 14 ప్రాంతాల్లో గరుడ సేవను భక్తులు తిలకించడానికి ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశామని అనిల్ సింఘాల్ పేర్కొన్నారు. కట్టుదిట్టమైన భద్రత స్వామివారి గరుడ వాహన సేవకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని టీటీడీ సీవీఎస్ఓ గోపీనాథ్ జెట్టి తెలిపారు. సుమారు 4 వేల మంది పోలీసులు, 15000 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. నిరంతరం కంట్రోల్‌రూమ్ నుంచి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తారని పేర్కొన్నారు. 1600 సీసీ కెమెరాలతో గరుడసేవ నిరంతరం పర్యవేక్షణలో ఉంటుందన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి గ్యాలరీలలోకి భక్తులను అనుమతిస్తామని గోపీనాథ్ తెలిపారు. -
టీటీడీ బంగారంపై తవ్వే కొద్దీ నిజాలు..!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో పట్టుబడ్డ బంగారంపై తవ్వే కొద్దీ నిజాలు వెలుగుచూస్తున్నాయి. బంగారంపై టీటీడీ ద్వంద్వ వైఖరి, తమిళనాడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను బెదిరించి, పలు రకాలుగా ఒత్తిడి చేసి బంగారాన్ని విడిపించుకుపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. తమిళనాడులో ఈ నెల 18న ఎన్నికల పోలింగ్ జరగనుండగా 17 రాత్రి తిరువళ్లూరు జిల్లా సరిహద్దు పూందమల్లి తహశీల్దారు పరిధిలో రూ.400 కోట్లకు పైగా విలువైన 1,381 కిలోల బంగారు కడ్డీలను అక్కడి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. సీక్వెల్ గ్లోబల్ క్రిటికల్ లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన వాహనంలో బంగారం తరలిస్తుండగా ఈ వాహనానికి ముందు, వెనుక రెండు వాహనాలు ఉన్నాయి. ఒక వాహనానికి పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రైవేటు సాయుధ బందోబస్తు ఉంది. పట్టుబడ్డప్పుడు టీటీడీకి చెందిన బంగారమని వాహనాల్లోని వ్యక్తులు మౌఖికంగా చెప్పారేగానీ అందుకు తగిన ఆధారాలు వారి వద్ద లేవు. అంతేకాకుండా ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మొత్తం మూడు వాహనాలు కాగా రెవెన్యూ రికార్డుల్లో మాత్రం రెండే వాహనాలని రికార్డు చేశారు. మరి మూడో వాహనం ఏమైనట్లు? అది ఎవరికి చెందినది? బంగారం ఉన్న వాహనానికి ముందు, వెనక ఉన్న వాహనాల్లో ఒకటి అకస్మాత్తుగా ఎందుకు అదృశ్యమైనదో ఆ ఏడుకొండలవాడికే తెలియాలి. బంగారం పట్టుబడగానే ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రెవెన్యూ శాఖాధికారులకు అప్పగించారు. రెవెన్యూ శాఖ బంగారాన్ని ట్రెజరీలో భద్రపరిచి ఆదాయపన్ను (ఐటీ) శాఖాధికారులకు సమాచారం ఇచ్చింది. టీటీడీ నిర్లక్ష్యంపై ఐటీ శాఖ అనుమానాలు చెన్నై నుంచి తిరుపతికి రోడ్డు మార్గంలో బంగారం రవాణాలోనూ, పొందడంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల అంతులేని నిర్లక్ష్యంపై ఐటీ శాఖ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. బంగారం పట్టుబడ్డప్పుడు ఈ అంశంపై అనేక ప్రశ్నలను సంధించింది. వాహనంలోని వారు బంగారం టీటీడీకి చెందినదని చెప్పారు. అయితే, అధికారులు వాకబు చేయగా తమకేమీ సంబంధం లేదని టీటీడీ బదులిచ్చింది. అంతలోనే మరికొద్దిసేపటికి బంగారం తమదేనని, తీసుకోవడానికి అధికారులు వస్తున్నారంటూ మాటమార్చింది. బంగారం తమదే అయితే టీటీడీకి ఈ తడబాటు ఎందుకని ఐటీ శాఖ ప్రశ్నిస్తోంది. వందల కోట్ల విలువైన బంగారం టీటీడీకి చేరుకుంటున్నప్పుడు దాన్ని పొందేందుకు టీటీడీ ఈవో ప్రత్యేక అధికారుల బృందాన్ని తగిన పత్రాలతో ముందుగానే సిద్ధం చేయాల్సి ఉంది. ఫలానా రోజు బంగారం వస్తుందనే సమాచారాన్ని కూడా సదరు బృందానికి ముందురోజే తెలియజేయాల్సి ఉంది. అంతేకాకుండా బంగారాన్ని భద్రం చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే, బంగారం పట్టుబడ్డాక తమిళనాడు అధికారులు తెలియజేసిన తర్వాత కూడా ఆ బంగారంతో తమకేమీ సంబంధం లేదని చెప్పడం.. ఆ తర్వాత తేరుకుని తమదేనని చెప్పడంపై ఐటీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రూ.400 కోట్లకు పైగా విలువ చేసే బంగారంపై టీటీడీ ఇంత నిర్లక్ష్యంగా ఉండటాన్ని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈసీపై టీటీడీ ఈవో ఒత్తిడి బంగారం తమకు చేరే వరకు పంజాబ్ నేషనల్ బ్యాంకుదే బాధ్యత అని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వాదిస్తున్నారు. ఇది నిజమే అనుకున్నా బంగారం ఎప్పుడు వస్తోంది? ఎలా వస్తోంది? అనే అవగాహన లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఖరీదైన సరుకును రవాణా చేసే క్రమంలో పంపేవారు, పత్రాలు ఎంత ముఖ్యమో పొందుతున్న వ్యక్తులు లేదా సంస్థలు కూడా అంతే ముఖ్యం. అయితే, బంగారం విషయంలో పంపుతున్నవారి పత్రాలు ఉన్నాయి కానీ టీటీడీకి చెందిన బంగారమే అనే విషయంలో స్పష్టత లేదని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు. పట్టుబడ్డ బంగారం అధిక మొత్తంలో ఉండటంతో ఈ కేసు ఐటీ పరిధిని దాటి డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) చేతుల్లోకి వెళ్లిందని చెబుతున్నారు. డీఆర్ఐ అధికారులు కస్టమ్స్ క్లియరెన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంకు పత్రాలను తనిఖీ చేశారు. మొత్తం వ్యవహారాన్ని తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి నిర్ణయానికి వదిలేశారు. దీంతో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ నుంచి ఆయనపై ఒత్తిళ్లు పెరిగాయి. ‘ఇది టీటీడీకి చెందినదని తెలుసా.. దేవుడి బంగారానికి కూడా తనిఖీలా.. నేను కూడా ఐఏఎస్ అధికారినే.. చెబితే వినిపించుకోరా?’ అంటూ పరుష పదజాలంతో ఈసీని బెదిరించినట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పలుకోణాల్లో ఈసీపై ఒత్తిడి పెంచడంతో తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించి బంగారం అప్పగించినట్లు తెలుస్తోంది. బంగారం తమదే అయినప్పుడు టీటీడీ హడావిడిగా ఇంత హైరానా పడటం, ఈసీని బెదిరించడం, ఒత్తిళ్లకు గురిచేయడంలోని ఔచిత్యం ఏమిటనే వాదన ఐటీ వర్గాల్లో వినిపిస్తోంది. -
వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు
తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తిరుమలకు వచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు, సీవీఎస్వో గోపినాథ్‌జెట్టితో కలిసి ఆయన శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా 18న వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం 16వతేదీ అర్ధరాత్రి 12.30 గంటల నుంచి భక్తులను వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి అనుమతిస్తామన్నారు. అక్కడ 28 గంటలు భక్తులు వేచి ఉండాల్సి వస్తుందన్నారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చలికి ఇబ్బందులు పడకుండా ఈసారి మాడ వీధుల్లో దాదాపు 40 వేల మంది కూర్చునేందుకు ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటుచేశామన్నారు. భక్తులను ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్– 2, వైకుంఠం క్యూకాంప్లెక్స్– 1లోకి అనుమతిస్తామని, అవి నిండిన తర్వాత వరుసగా ఆళ్వార్ ట్యాంక్ లైన్, నారాయణగిరి ఉద్యానవనాల్లోని షెడ్లలోకి పంపుతామన్నారు. తరువాత మేదరమిట్ట వద్ద గల ఎన్–1 గేటు ద్వారా మాడ వీధుల్లో షెడ్లలోకి అనుమతిస్తామని తెలిపారు. షెడ్ల వద్ద తాగునీరు, అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. గతేడాది ఏకాదశి, ద్వాదశి రోజుల్లో 1.70 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామని చెప్పారు. ఈసారి భక్తులు యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. శ్రీవారికి రూ.5.19కోట్లు విరాళం తిరుమల శ్రీవారి వేంకటేశ్వరస్వామి ట్రస్ట్‌కు శుక్రవారం ఎన్నడూలేని విధంగా రూ.5.19 కోట్లు విరాళంగా వచ్చింది. ఇందులో శ్రీబాలాజీ ఆరోగ్యవరప్రసాదినికి రూ.5 కోట్లు, ఎస్వీ అన్నప్రసాదానికి రూ. 15.42లక్షలు, ఎస్వీ గోసంరక్షణకు రూ.2 లక్షలు, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ. ఒకలక్ష, ఎస్వీ విద్యాదాన ట్రస్టుకు రూ. ఒకలక్ష విరాళంగా భక్తులు సమర్పించుకున్నారు. తిరుమల జేఈవో కార్యాలయం సమీపంలో ఉన్న ఆదిశేష విశ్రాంతి సముదాయంలోని దాతల విభాగంలో అధికారులను యాత్రికులు కలసి విరాళాలను అందజేశారు. -
తిరుమలలో ఘనంగా బ్రహ్మోత్సవాలు
-
గరుడునిపై గోవిందుడు
తిరుమల: విశ్వపతి శ్రీవేంకటేశ్వరుడు తన ప్రియ వాహనమైన గరుడునిపై ఊరేగుతూ ఆదివారం భక్తకోటికి సాక్షాత్కరించారు. రాత్రి 7 గంటలకు ఆరంభమైన వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. లక్షలాది మంది భక్తులు ఉత్సవమూర్తిని దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. వాయు గమనంతో పోటీపడే గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని జగాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. ఉత్కృష్టమైన ఈ గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ కాసులమాల, సుదర్శన చక్రమాల వంటి ఎన్నెన్నో విశేష ఆభరణాలు అలంకరించారు. గరుడునితో స్వామికి ఉన్న అనుబంధాన్ని ఈ గరుడ వాహన సేవ లోకానికి తెలియజేస్తోంది. అశేష జనవాహిని గోవిందనామ స్మరణతో తిరుమల క్షేత్రం భక్తిభావంతో నిండింది. వాహనసేవ ప్రారంభం నుంచి ముగిసే వరకు వాహనాన్ని అటూఇటూ తిప్పుతూ భక్తులందరూ ఉత్సవమూర్తిని దర్శించుకునే విధంగా టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు స్వయం గా పర్యవేక్షించారు. ఇక వీఐపీల పేరుతో అధిక సంఖ్యలో వచ్చిన వారి మధ్య తోపులాట చోటుచేసుకున్నాయి. వారిని అదుపు చేసేందుకు అధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందిపడ్డారు. వాహన సేవల ముందు భక్త బృందాలు, భజనలు, డప్పు వాయిద్యా లు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల వేషధారణలు, నగర సంకీర్తనలతో కోలాహలం నిండింది. కాగా మధ్యలో కాసేపు వర్షం పడటంతో ఘటాటోపం నడుమ ఊరేగింపు కొనసాగించారు. భక్తజన సంద్రంగా తిరుమల కొండ.. గరుడ వాహన సేవను వీక్షించేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల కొండలు భక్తజన సంద్రంగా మారాయి. స్వామివారి దర్శనంకోసం ఉదయం నుంచే భక్తులు గ్యాలరీల్లో పడిగాపులు కాశారు. ఉదయం మోహినీ వాహన సేవలో పాల్గొన్న భక్తులు గరుడవాహనసేవ కోసం ఎక్కడికక్కడ నిరీక్షించారు. 2 లక్షల మంది కూర్చునేందుకు సిద్ధం చేసిన గ్యాలరీల్లో భక్తులు కిక్కిరిసి కనిపించారు.గ్యాలరీల్లో భక్తుల మధ్య తోపులాటలు లేకుండా పరిమిత సంఖ్యలోనే అనుమతించేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకున్నారు. రోడ్లపై నడిచి మాడ వీధుల్లోకి వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా బారికేడ్లు నిర్మించటంతో భక్తులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. అర్బన్ జిల్లా ఎస్పి అభిషేక్ మొహంతి పటిష్ట భద్రత కల్పించారు. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలు నడిచి వచ్చే భక్తులతో నిండింది. మోహిని అవతారంలో గోవిందుడు.. బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు ఆదివారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పాలకడలిని మధించడంలో ఉద్భవించిన అమృతాన్ని రాక్షసుల బారిన పడకుండా కాపాడిన మహావిష్ణువు కలియుగంలో మాయామోహాల బారిన పడకుండా తన శరణాగతిని పొందాలని ఈ మోహిని అవతారం ద్వారా సందేశాన్ని ఇచ్చారు. -
సామాన్య భక్తుల దర్శనానికే ప్రాధాన్యత
ఆగమశాస్త్రానికి లోబడి కైంకర్యాలు సాగితేనే స్వామివారు ప్రసన్నంగా ఉంటారు. భక్తులపై తన దివ్యకాంతులు ప్రసరింపజేస్తారు. అందుకే స్వామి కైంకర్యాల్లో ఏ లోటూ రాకుండా చూడాలి. దానితో పాటు భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి. ఇవన్నీ పద్ధతిగా జరిపించడం అంత తేలికైన విషయమేమీ కాదు. అయితే స్వామివారి అనుగ్రహం వుంటే అన్నీ వాటంతట అవే జరుగుతాయి అంటారు అనిల్‌కుమార్ సింఘాల్. తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారిగా అనిల్‌కుమార్ సింఘాల్ అనుభవాలు, అభిప్రాయాలివి ... ∙టీటీడీ కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టడం మీకు ఎలా అనిపిస్తోంది. ధర్మకర్తల మండలిలో సభ్యకార్యదర్శిగా కొంతమేర మాత్రమే సేవ చేయగలిగేవాణ్ణి. కానీ ఇప్పుడు పూర్తికాలం భగవంతుడికి, భక్తులకు సేవ చేసే అదృష్టం కలిగింది. ∙తిరుమలకు మీరు ఈవోగా రావాలనుకున్నారా? తిరుమల ఈవోగా వస్తే అదృష్టమని భావించాను. ఎప్పుడూ ఎవరిని అడగలేదు. భగవంతుడి ఆశీర్వాదంతో తిరుమలకు రావాలని మనస్సులో ఎప్పుడూ వుండేది. అదృష్టవశాత్తు అది ఇప్పుడు నాకు దక్కింది.చాలా సంతోషంగా ఫీలవుతున్నాను. ఉత్తరాది రాష్ట్రాల నుంచి నేనే మొదటిగా రావడం చాలా ఆనందం. చిత్తూరు జిల్లాలో జేసీగా పనిచేశాను. చిన్నతనం నుంచే వేంకటేశ్వరస్వామి అంటే అపారమైన భక్తి. ఆ భక్తే నన్ను ఇలా నడిపించింది. ∙మీరు వారం వారం తల నీలాలు ఇవ్వడం మొక్కుబడేనా లేదా తిరుమలకు వచ్చారని ఇస్తున్నారా? మొదటి నుంచే స్వామివారంటే అపారమైన భక్తి. ఏడాదికి నాలుగుసార్లు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుంటున్నాను. వచ్చిన ప్రతిసారీ తలనీలాలు సమర్పిస్తా. తిరుమలకు ఈవోగా వచ్చినప్పటి నుంచి ప్రతి శుక్రవారం అభిషేక దర్శనంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శిస్తున్నా. అందులో భాగంగా ముందురోజు గురువారం స్వామివారికి తలనీలాలు ఇస్తుంటాను. ఇలా ప్రతివారం ఇవ్వడమే ఆనవాయితీగా పెట్టుకున్నా. ∙సాధారణ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఈవోగా బాధ్యతలు చేపట్టిన తరువాత శ్రీవారి ఆలయంలో క్యూలైన్లను క్రమబద్ధీకరించి తోపులాట లేకుండా భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశాం. కాలినడక భక్తుల కోసం అలిపిరి మార్గంలో 14 వేల టోకెన్లు, శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల టోకెన్లు మంజూరు చేసి నిర్దేశిత సమయంలో స్వామివారి దర్శనం కల్పిస్తున్నాం. సర్వదర్శనం భక్తులు ఎక్కువసేపు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా టైమ్ స్లాట్ టోకెన్లు ప్రవేశపెట్టాం. తిరుమలలో కౌస్తుభం, సీఆర్వో, నందకం ప్రాంతాల్లో, తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయాలు, రైల్వేస్టేష¯Œ వెనుకవైపు గల చౌల్ట్రీలు, ఆర్టీసీ బస్టాండు, అలిపిరి బస్టాండ్ వద్ద గల భూదేవి కాంప్లెక్స్‌లో సర్వదర్శనం టోకె¯Œ కౌంటర్లు ఉన్నాయి. ∙దేవస్థానంలో మీ అనుభవం ఎలాంటిది? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక సంస్థ. పాలనలో పారదర్శకత వుంది. ఏటా 450కి పైగా ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పటికే కొన్నింటిలో ప్రత్యక్షంగా పాలుపంచుకుంటున్నాను. శ్రీవేంకటేశ్వరస్వామి వైభవ ప్రాశస్త్యం, ఆ స్వామి లీలలు ప్రత్యక్షంగా అనుభూతి చెందాను. ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక సంస్థను నడిపించే బాధ్యతను శ్రీవారే నాకు అప్పగించారనిపిస్తోంది. ∙ధర్మకర్తల మండలి, ధార్మికసంస్థకు వారధిగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టానికి లోబడి టీటీడీ పనిచేస్తోంది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యుల అభిప్రాయాలను స్వీకరిస్తాను. అవసరమైతే ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా తీసుకుంటాను. ∙మీరు ఎంచుకున్న ప్రాధాన్యతాంశాలేమిటి? ప్రాధాన్యత అంశాలనడం కంటే వాటిని బాధ్యతలనడం సరైనమాట. తిరుమల ఆలయంలోను, ఇతర అనుబంధ ఆలయాల్లోను వందల సంవత్సరాలుగా కైంకర్యాలన్నీ నిర్దిష్టంగా జరుగుతున్నాయి. ఈ పూజాకైంకర్యాల్లో ఏ లోటూ రాకుండా చూస్తాను. ఆగమశాస్త్ర నిబంధనలు విధిగా అమలు జరిపిస్తా. భక్తులకు మౌలిక వసతులు కల్పించేందుకు, బస సౌకర్యాలు మెరుగు పరిచేందుకు, ప్రతి భక్తుడి ఆకలే అర్హతగా రుచికరమైన భోజన సదుపాయాలు కల్పించేందుకు సంయుక్తంగా కృషి చేస్తా. సప్తగిరుల ప్రకృతి సంపదను పరిరక్షించేందుకు సభ్యులందరినీ కలుపుకుని పనిచేస్తా. ప్రతి భక్తుడు తిరుమల కొండపై కాలుష్య రహిత పదార్థాలు వాడే విధంగా ప్రత్యేక నియంత్రణ చర్యలు చేపడతాను. భక్తుల భద్రతపై కూడా దృష్టి పెడుతున్నాం. అలాగే ధర్మప్రచారం, వేద పరిరక్షణ మరింత ముందుకు తీసుకెళతాం. శ్రీనివాస వైభవాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లి భక్తితత్వాన్ని, «ధార్మిక చింతనను విస్తరిస్తూనే శ్రీవేంకటేశ్వరస్వామి వైభవ ప్రాశస్త్యాన్ని నలుదిశలా చాటుతాం. ∙సంతృప్తికరమైన దర్శనం కల్పించేందుకు మీ దగ్గర కొత్త ప్రణాళికలేమైనా ఉన్నాయా? ఉన్న నిబంధనలు సమర్థవంతంగా అమలు పరిస్తే చాలు. కొత్తవి అవసరం లేదని నా అభిప్రాయం. టీమ్ మేనేజ్మెంట్, టైమ్ మేనేజ్మెంట్తో మరింత సమర్థవంతంగా దర్శన సౌలభ్యం కల్పించే ప్రయత్నం చేయాలి. ఆధునిక సాంకేతిక ప్రయోగాలకు ఆలయ ఆగమాలు అనుమతించవు. కాబట్టి అందుబాటులో వున్న అవకాశాలను వినియోగించుకుంటూ ఆ పని చేయాలి. ఓవర్ బ్రిడ్జిని కొంచెం విశాలంగా చేస్తున్నాం. క్యూలో వుండే భక్తులకు ధార్మిక కథాకాలక్షేపాలు, దైవస్మరణకు అనుకూల వాతావరణం కల్పించడం, పిల్లలకు పాలు అందించడం, అన్న ప్రసాదాలు అందించడం వంటివి చేయాలి. అయితే దర్శన విషయంలో అందే ఫిర్యాదులు భక్తుల నుంచా, దళారుల నుంచా అన్నది కూడా అధ్యయనం చేయాల్సి వుంది. ∙బస, దర్శనం ఇబ్బందుల్ని తగ్గించడానికి రోజులో ఇంతమందికే దర్శనానికి అనుమతించాలన్న ప్రతిపాదన సంగతేమైంది? దైవదర్శనం కోసం వచ్చే భక్తులను కట్టడి చేయడం సరికాదు. అందుకే ఈ ఆలోచన కార్యరూపం దాల్చడం కష్టం. కాబట్టి శక్తి వంచన లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడమే మా ముఖ్య విధి.భక్తులు వేచి వుండే సమయాన్ని తగ్గించి, వారిని ఆయా భాషల్లో ఆత్మీయంగా పలుకరించే ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాలని ఆలోచన చేస్తున్నాం. రాబోయే 20 సంవత్సరాల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేసి అందుకు తగ్గ ఆచరణాత్మక ప్రణాళికలను ఇప్పుడే రూపొందించాల్సిన అవసరం వుంది. క్రైసిస్ మేనేజ్మెంట్ కంటే ఒక ఆచరణాత్మక మేనేజ్మెంట్ రూపొందించడం ముఖ్యం. ∙ నేత్ర ద్వారాలు (వెండివాకిలికి అటు ఇటుగా ప్రత్యేక దర్శనాలు, సన్నిధిలో రాములవారి మేడ నుంచి వైకుంఠ ద్వారం ప్రవేశం వరకు కొత్తద్వారం) తెరవాలని కొందరు, వద్దని మరి కొందరు అంటున్నారు..? ఇది భక్తుల విశ్వాసాలతో ముడిపడిన అంశం. కట్టడాల భద్రత పరిశీలించాలి, çపరీక్షించాలి, పరిరక్షించాలి, గతంలో తిరుమల ఆలయ తరహాలో తిరుపతి అలిపిరిలో నిర్మించిన శ్రీవారి నమూనా ఆలయంలోని మూవింగ్ ప్లాట్ఫారం ఏర్పాటు కోసం (కదిలే తివాచీ) పరిశీలించినా సరైన పరిష్కారం దొరకలేదని గత అనుభవాలు చెబుతున్నాయి. దీనిపై గతంలో ఉన్న నివేదికలు పరిశీలించాలి. ఆలయ అధికారులు, ఆగమ పండితులు, అర్చకులు, ఈ వ్యవస్థపై పట్టు వున్న రిటైర్డ్ అధికారులను సంప్రదించాల్సిన అవసరం వుంది. ∙టీటీడీ కొత్త ఈవోగా పరిపాలనలో సరికొత్త సంస్కరణలేమైనా చేపట్టబోతున్నారా? ఎందరో ఐఏఎస్ అధికారులు స్వామి సేవలో, ఆలయ పాలనలో వినూత్న సంస్కరణలు చేశారు. వారందరి కృషి ఫలితంగానే సంస్థ మహోన్నత స్థానంలో వుంది. ప్రస్తుతమున్న ప్రణాళికలు నిర్వహించడమే పెద్ద పని. కానీ కార్యాచరణలో ఉన్న చిన్న చిన్న లోపాలను సరిదిద్దుతాం. అధికార వికేంద్రీకరణతో క్షేత్రస్థాయిలో నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మార్గదర్శకంగా వుంటాం. ∙పాలకులు మారిన ప్రతిసారీ రకరకాలుగా దర్శనాలు పుట్టుకొస్తున్నాయి. దీనివల్ల నిత్య కైంకర్యాలకు కోతపడుతోందని మఠాధిపతులు, పీఠాధిపతులు, అర్చకులు ఆవేదన చెందుతున్నారు. దీనికి మీరేమంటారు? స్వామి కైంకర్యాల విషయంలో ఆగమ సలహా మండలి సూచనలను పాటిస్తున్నాం. పవళింపు సేవ వరకు కచ్చితమైన సమయాన్నే పాటిస్తున్నాం. స్వామివారి కైంకర్యాలు, ఆరాధనలన్నీ సంప్రదాయబద్ధంగానే జరుగుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. పీఠాధిపతులు, మఠాధిపతులు, అర్చకుల సలహాలను వీలైనంత వరకు అమలు చేయడానికి కృషి చేస్తున్నాం. సంప్రదాయంగా, ఆగమోక్తంగా జరుగుతున్న నిత్యకైంకర్యాలను కుదించే ప్రయత్నాలు జరగవు. దీనికి కొనసాగింపుగానే రాత్రివేళల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశాం. ఆ సమయాన్ని కూడా సామాన్య భక్తుల దర్శనానికే కేటాయించాం. ప్రస్తుతం అమలవుతున్న దర్శనాలు, క్యూలైన్లపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాం. ఏ చిన్న అవకాశం వచ్చినా సామాన్య భక్తుల దర్శనానికే ప్రాధాన్యత ఇస్తాం. ∙గోసంరక్షణ అంశంలో టీటీడీ అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని ఏవిధంగా అమలు చేయబోతున్నారు? గో సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేశాం. అందుకు అనుగుణంగా జాతీయస్థాయి సదస్సు తిరుపతిలో నిర్వహించాలని భావిస్తున్నాం. గో సంరక్షణకు పురాతన, శాస్త్రీయ పద్ధతిలో జరిపితే కలిగే ఉపయోగాలు, ఆర్థిక వెసులుబాటు ఔత్సాహికులకు తెలియజేసే ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తాం. శ్రీవేంకటేశ్వర డెయిరీలో ఒక ప్రదర్శనశాలను ఏర్పరచి, అందులో భారతీయ సంతతి గోవులను ఉంచి వాటి విశిష్టత, వాటి సంరక్షణ ద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాలను తెలియజే యాలనుకుంటున్నాం. అవసరమైతే ఇందుకోసం రాష్ట్ర దేవాదాయశాఖ సహకారం కూడా తీసుకుంటాం. – లక్ష్మీకాంత్, తిరుమల -
ఎట్టకేలకు టీటీడీ దిగొచ్చింది.
-
పరిమితంగా శ్రీవారి దర్శనం
సాక్షి, తిరుపతి/తిరుమల: ఎట్టకేలకు టీటీడీ దిగొచ్చింది. భక్తుల ఒత్తిడితో మహాసంప్రోక్షణ జరిగే ఆరురోజులు పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని పాలకమండలి నిర్ణయించింది. రోజుకు కొన్ని గంటలే శ్రీవారి దర్శన భాగ్యం కల్పించనున్నట్లు వెల్లడించింది. సర్వదర్శనం క్యూలో వచ్చే భక్తులకు మాత్రమే అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టదిగ్బంధన బాలాలయ మహా సంప్రోక్షణ సందర్భంగా వచ్చే నెల 11 నుంచి 16 వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈనెల 14న పాలకమండలి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టీటీడీ భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. దీనిలో భాగంగా మంగళవారం మరోసారి తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలకమండలి సమావేశమైంది. మహా సంప్రోక్షణ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించనున్నట్లు టీటీడీ చైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. ఎంత మందికి అనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వచ్చే భక్తులకు మాత్రమే స్వామి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ఆరు రోజుల్లో రూ.300 ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలు, టైంస్లాట్, దివ్యదర్శనం ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆగస్టు 11న 9 గంటలు, 12వ తేదీన 4 గంటలు, 13న 4 గంటలు, 14వ తేదీ 6 గంటలు, 15వ తేదీ 6 గంటలు, 16వ తేదీ 4 గంటల సమయం మాత్రమే భక్తులకు శ్రీవారి దర్శనానికి అవకాశం ఉంటుంది. అభిప్రాయ సేకరణలో 33 శాతం మంది భక్తులు అవకాశం ఉన్న సమయంలో దర్శనం కల్పించమని కోరినట్లు వివరించారు. సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు.. - వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పౌర్ణమి సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆగస్టు 23 నుంచి 26 వరకు ఏపీ, తెలంగాణలో మనగుడి కార్యక్రమం నిర్వహణ. - హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణలో ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించే జిల్లా, మండల ధర్మ ప్రచార మండలి సభ్యుల నిర్వాహక వర్గం పునర్వ్యవస్థీకరణకు ఆమోదం. - తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో రెండేసి చొప్పున అర్చక పోస్టులు, శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మూడు, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయంలో రెండు చొప్పున అర్చక పోస్టుల భర్తీకి నిర్ణయం. -
వసతి చూపవా గోవిందా..
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు అద్దెగదుల కోసం తిప్పలు తప్పడంలేదు. గదులు కేటాయింపునకు సంబంధించిన వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవటం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని భక్తులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతిక సమస్యలే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఏడుకొండలవాని దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. వచ్చే ప్రతి భక్తుడు తిరుమలలో ఓ రాత్రి నిద్రిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్ముతాడు. గదుల కోసం భక్తులు ముందుగా తిరుమలలో సీఆర్వో కార్యాలయానికి చేరుకుంటారు. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ జనరల్ కౌంటర్లు, దేవదాయశాఖ కౌంటర్, వీఐపీ, వీవీఐపీ, బోర్డు మెంబర్ల కోసం విడివిడిగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. గదులు అవసరమైన వారు కౌంటర్ వద్ద పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గదులు ఖాళీ అవుతుంటే... వరుస క్రమంలో ఉన్న భక్తుల మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు వస్తుంటాయి. ఆ సమాచారం తెలుసుకుని భక్తులు సీఆర్వో కార్యాలయానికి వెళ్లి గది తాళాలు తీసుకుంటారు. గతంలో అయితే గదులు ఖాళీ అవుతుంటే క్యూలో ఉండేవారికి కేటాయించేవారు. ఇలా గంటల తరబడి భక్తులు క్యూలో నిల్చొని ఇబ్బంది పడకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ పద్ధతిని అమల్లోకి తీసుకొచ్చారు. మెసేజ్ రాకపోతే గది లేనట్టే.. తిరుమలలో గదుల రిజిస్ట్రేషన్ కోసం టీటీడీ 10 కౌంటర్లు ఏర్పాటు చేసింది. అందులో సిబ్బంది వారాంతపు సెలవులు, అత్యవసర సెలవులు, ఇతరత్రా కారణాలతో రోజుకి ఆరేడు కౌంటర్లు మాత్రమే పనిచేస్తుంటాయి. ఈ కౌంటర్ల వద్ద క్యూలో 200 మంది లోపు మాత్రమే నిలబడే అవకాశం ఉంది. ఒకసారి క్యూలోకి చేరుకున్న భక్తులు సుమారు ఒకటిన్నర గంట సమయం బయటే నిలబడి ఉండాలి. క్యూలో ఉన్న వారి కంటే బయట వేచి ఉన్న వారి సంఖ్యే అధికంగా ఉంటోంది. మొదట్లో టీటీడీ నిర్ధేశించిన ప్రకారం భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని బయటకు వచ్చేస్తే... గది ఖాళీ అయినప్పుడు భక్తుడు రిజిష్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. సమాచారం అందిన అరగంటలో వెళ్లి గది తీసుకోవాలి. కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో కొందరికి గది కేటాయించినా ఎటువంటి మెసేజ్ రావడంలేదు. దీంతో సీఆర్వో కార్యాలయం వద్ద డిస్ప్లే బోర్డు చూస్తూ గంటల తరబడి నిలబడుతున్నారు. మరి కొందరు.. గది కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ‘2 లేదా 3’ గంటల తరువాత కేటాయించవచ్చు అని ఉజ్జాయింపుగా రశీదుపై సమయాన్ని ముద్రించి ఇస్తారు. దీంతో భక్తులు ఇంకా సమయం ఉందని తిరుమలలోని దర్శనీయ స్థలాలు చూసి వచ్చేందుకు వెళ్తుంటారు. ఒక్కో సారి రిజిస్ట్రేషన్ అయిన అరగంటలోనే గది కేటాయిస్తుంటారు. ఆ సమాచారం భక్తులకు వెళ్లడం లేదు. గది అలాట్ అయిన అరగంటలో తీసుకోకపోతే ఆటోమేటిక్‌గా అది రద్దయిపోతుంది. మొబైల్‌కి సమాచారం రాలేదని భక్తులు తిరుమల అంతా చుట్టి సీఆర్వో కార్యాలయానికి చేరుకునే సరికి.. గది అలాట్ అయ్యిందని, అరగంటలో తీసుకోకపోవటంతో రద్దయిందని చెబుతుండటంతో భక్తులు షాక్‌కు గురవుతున్నారు. పర్యవేక్షణ లోపమే.. అనిల్‌కుమార్ సింఘాల్ ఈవోగా వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ పద్ధతి అమల్లోకి తీసుకొచ్చారు. అయితే ఈ విధానంలో లోపాలను సరిదిద్దేవారు కరువయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భక్తులకు కేటాయించిన గదుల వివరాలపై వారికి ఎస్ఎంఎస్లు వెళ్లడం లేదని సంబంధిత అధికారులకు తెలియటం లేదని సమాచారం. కౌంటర్లు చాలక ఇబ్బంది పడుతున్న సమాచారమూ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం లేదు. అదే విధంగా కౌంటర్లలో పనిచేస్తున్న అధికారులకు సుమారు ఏడేళ్లుగా బదిలీలు లేకపోవటంతో వారు గదుల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. -
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు ఏసీజే
సాక్షి,తిరుమల/శ్రీశైలంటెంపుల్/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/నరసరావుపేట రూరల్: ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయ మహా ద్వారం నుంచి ఆలయానికి చేరుకున్న ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం శ్రీవారిని, వకుళమాతను దర్శించు కుని, హుండీలో కానుకలు సమర్పించారు. తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా, టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు శ్రీవారి చిత్రపటాన్ని, నూతన సంవత్సరం కేలండర్, లడ్డూప్రసాదాలు అందజేశారు. -
ఎక్కువ లడ్డూలు అడగటం వల్లే ధరలు పెంచాం
సాక్షి, తిరుమల: తిరుమలకు వచ్చే భక్తులు ఎక్కువ మోతాదులో లడ్డూలు కోరుతున్నారని.. అందుకే వాటిని మాత్రమే అధిక ధరలకు విక్రయించనున్నట్లు జేఈఓ శ్రీనివాసరాజు చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. రూ.100 ధరతో ఉన్న పెద్ద లడ్డూను రూ.200కి, రూ.25 ధరతో కూడిన వడను రూ.100కి, రూ.25 లడ్డూను రూ.50కి, ఆలయంలో ఉచితంగా అందజేసే ఉచిత లడ్డూను రూ.7 ధరతో సరఫరా చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. టీటీడీ నిర్వహిస్తున్న శ్రీనివాస కల్యాణాలతో పాటు ధార్మిక సంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు మాత్రమే పరిమితి సంఖ్యలో లడ్డూలు, వడలు సరఫరా చేసేవారమని చెప్పారు. తిరుమల ఆలయ నాలుగు మాడ వీధుల్లో 1.8 లక్షల మందికి భక్తులు గ్యాలరీల్లో కూర్చుని వాహన సేవల్ని వీక్షించే అవకాశ ముందని జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు ఎక్కువ మంది భక్తులు ఆలయ వీధుల్లో కూర్చునే విధంగా మాడ వీధులను విస్తరిస్తామని దానికి తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. -
తిరుమలలో ఎల్ఈడీ కాంతులు
తిరుపతి అర్బన్: తిరుమలలో మరింత మెరుగైన విద్యుత్ వెలుగులు నింపే క్రమంలో రానున్న ఫిబ్రవరి నాటికి మొత్తం ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశించారు. వివిధ టీటీడీ పథకాలు, అభివృద్ధి పనులపై శనివారం ఆయన సీనియర్ అధికారులతో సమీక్షించారు. ఈఓ మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలోనూ విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వెండివాకిలి ప్రాకారంలోని శ్రీనివాస కల్యాణం చిత్రాలకు ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల ద్వారా తిరుమలకు చేరుకునే కాలిబాట భక్తులకు మరింత పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలిపిరి కాలిబాట మార్గంలోని లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం వద్దనుంచి మోకాలిమిట్ట వరకు రోడ్డుపై ఉన్నందున భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు రాకుండా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అదే విధంగా కాలిబాట మార్గాల్లో భక్తులు జారిపడకుండా తగిన ఏర్పాట్లు తీసుకోవాలన్నారు. ఆలయంలో భక్తులు తడవకుండా.. తిరుమల ఆలయంలోని మహద్వారం నుంచి ధ్వజస్తంభం వరకు రిట్రాక్టబుల్ రూఫింగ్‌ను ఏర్పాటు చేసి భక్తులు వర్షంలో తడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రసాదాలు స్వీకరించే ప్రాంతంలోని కొళాయిల వద్ద పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, జారిపడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైతే పారిశుద్ధ్య సిబ్బందిని పెంచుకోవాలన్నారు. వేడినీటితో శుభ్రం చేసే యంత్రాలను వినియోగించేందుకు అనువైన చర్యలు తీసుకోవాలన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో క్యూలపై అధ్యయనం చేసి భక్తులు సౌకర్యంగా దర్శనానికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సీవీఎస్ఓ రవికృష్ణకు సూచించారు. శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఇతర ప్రాంతాల్లో జనవరి నాటికి ఎలక్ట్రికల్ వైరింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. ఘాట్రోడ్ల ద్వారా రాకపోకలు సాగించే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొండ చరియలు విరిగిపడకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలిపారు. చరియలు విరిగిపడే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. పరకామణి విభాగంలో లెక్కింపు మినహా మిగిలిన అన్ని కార్యక్రమాలు ఔట్సోర్సింగ్ వారిద్వారా చేయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తిరుమల, తిరుపతి జేఈఓలు శ్రీనివాసరాజు, పోల భాస్కర్, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి, తిరుపతి ఎస్టేట్ ఆఫీసర్ గౌతమి, సీవీఎస్వో ఆకె రవికృష్ణ, విద్యుత్ విభాగం అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. -
సెప్టెంబర్ 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
సెప్టెంబర్ 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
27న రాత్రి 7.30 గంటలకు గరుడసేవ సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ సమాయత్తమవుతోంది. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు ఇప్పటికే దృష్టిసారించారు. పుష్కరిణి నీటిని తొలగించి శుద్ధి పనులు చేస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవాల అనుబంధ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 27వ తేది రాత్రి 7.30 గంటలకు శ్రీవారి గరుడవాహన సేవ ప్రారంభించనున్నారు. ఈసారి ఉత్సవాల్లో కొత్త సర్వభూపాల వాహనం వాడనున్నారు. సెప్టెంబర్ 6న పౌర్ణమి గరుడవాహన సేవను మాదిరి బ్రహ్మోత్సవ గరుడవాహన సేవగా నిర్వహించి లోటుపాట్లు గుర్తించి, సవరించనున్నారు. -
ఇనుప నిచ్చెనలపై వెనక్కి తగ్గిన టీటీడీ
-
ఇనుప నిచ్చెనలపై వెనక్కి తగ్గిన టీటీడీ
వివాదాస్పదం కావడంతో నిచ్చెనల తొలగింపు సాక్షి, తిరుమల: తిరుమల ఆలయంలో వివాదానికి కారణమైన ఇనుప నిచ్చెనల ఏర్పాటును టీటీడీ ఉపసంహరించుకుంది. వెండివాకిలి ప్రాకారానికి ఆనుకుని 30 అడుగుల ఎత్తులో ఇనుప నిచ్చెనలు ఏర్పాటు చేయాలన్న టీటీడీ నిర్ణయాన్ని భక్తులు, ఆధ్యాత్మిక, ధార్మిక సం ఘాలు వ్యతిరేకించాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్చించింది. వివాదాస్పద నిచ్చె నలు తొలగించకపోతే దాని ప్రభావం ప్రభు త్వంపై పడే అవకాశముందని గుర్తించింది. దీంతో నిచ్చెనలు తొలగించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి నిచ్చెనలు తొలగించారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తాం వెండివాకిలి వద్ద తోపులాటలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేలా ఏర్పాటు చేసిన ఇనుప నిచ్చెనల నిర్మాణం నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. భక్తుల మనోభావాలు గౌరవించాలనే సంకల్పంతో నిచ్చెనలు తొలగించామన్నారు. నిర్మాణంలో భక్తుల సౌకర్యం తప్ప మరో ఉద్దేశమే లేదని ఈవో స్పష్టం చేశారు. స్వయంగా వచ్చే దాతలకే కాటేజీలు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనున్నాయి. ఆ రోజుల్లో స్వయం గా వచ్చే దాతలకు మాత్రమే కాటేజీలు కేటాయించనున్నారు. వారి సిఫారసులకు గదులు కేటాయించరు. సెప్టెంబర్ 27న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా సెప్టెంబర్ 26, 27న మాత్రం కాటేజీ దాత లకు గదుల కేటాయింçపు ఉండదని టీటీడీ ప్రకటించింది. ఒకే కాటేజీలో రెండు గదుల కంటే ఎక్కువగా విరాళంగా ఇచ్చిన దాతల కు రెండు గదులు రెండు రోజుల పాటు కేటాయిస్తారు. గదులు కావాల్సిన కాటేజీ దాతలు 4 రోజుల ముందుగా ttdsevaonline.com రిజర్వు చేసుకోవాలి. -
వెండి వాకిలి వద్ద అత్యవసర ద్వారం
రద్దీ పెరిగినప్పుడే వినియోగంలోకి తెస్తాం టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ సాక్షి ప్రతినిధి, తిరుపతి: భక్తుల భద్రత దృష్ట్యా వెండి వాకిలి వద్ద అత్యవసర ద్వారం ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావించినట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. దీనిని రద్దీ పెరిగినప్పుడు మాత్రమే వినియోగంలోకి తెస్తామని చెప్పారు. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘వెండివాకిలి వద్ద ఇనుప నిచ్చెనలు’ కథనంపై టీటీడీ అధికారులు స్పందించారు. ఈవోతో పాటు టీటీడీ జేఈవోలు మీడియాకు వివరణ ఇచ్చారు. శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగినప్పుడు వెండి వాకిలి ద్వారా ఒకేసారి 1,500 నుంచి 2 వేల మంది బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తుంటారని, అలాంటి సమయాల్లో తొక్కిసలాట జరిగే ప్రమాదముందన్నారు. అత్యవసర ద్వారం ఏర్పాటు చేయడం ద్వారా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇది కేవలం అత్యవసర ద్వారం మాత్రమేనని, రద్దీ పెరిగినప్పుడే వినియోగంలోకి తెస్తామన్నారు. పొరపాట్లకు ఆస్కారమివ్వకుండా, ఆగమశాస్త్రం ప్రకారమే నడుచుకుంటామని ఈవో వివరించారు. -
ఐదేళ్లలోపు పిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం
తొలిరోజు 327 టోకెన్లపై 627 మందికి దర్శనం తిరుపతి అర్బన్: ఏడాదిలోపు చంటి పిల్లల తల్లిదండ్రులకే కాకుండా ఐదేళ్లలోపు వయసున్న పిల్లల తల్లిదండ్రులకు కూడా తిరుమల వెంకన్న దర్శన భాగ్యాన్ని కల్పించాలని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి బుధవారం పిల్లల తల్లిదండ్రులను తిరుమలలోని సుపథం ప్రవేశమార్గం ద్వారా అనుమతించి స్వామివారి దర్శనం కల్పించనున్నారు. తొలిరోజు బుధవారం 9 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు మొత్తం 327 మంది పిల్లలకు టోకెన్లు జారీ చేయగా, వారి తల్లిదండ్రులతో కలిసి 627 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవల కొందరు భక్తులు చేసిన విజ్ఞప్తి మేరకు టీటీడీ అధికారులు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదే కార్యక్రమం ద్వారా ఈనెల 26న కూడా ఐదేళ్లలోపు పిల్లలను, వారి తల్లిదండ్రులను సుపథం ప్రవేశ మార్గంలో శ్రీవారి దర్శనానికి అనుమతించాలని ఈవో అధికారులను ఆదేశించారు. -
నేత్రపర్వంగా ఆణివార ఆస్థానం
-
నేత్రపర్వంగా ఆణివార ఆస్థానం
శ్రీవారికి శ్రీరంగం నుంచి పట్టువస్త్రాల సమర్పణ సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఆణివార ఆస్థానం నేత్రపర్వంగా సాగింది. పూర్వం మహంతుల పాలనలో దేవస్థానం ఆదాయ, వ్యయాల లెక్కలన్నీ ఆణివార ఆస్థానం రోజునే ప్రారంభమయ్యేవి. దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పడ్డాక ఆర్థిక సంవత్సరంలోకి మారాయి. అయినప్పటికీ అనాదిగా నిర్వహించే ఆణివార ఆస్థానం ఉత్సవ సంప్రదాయాన్ని టీటీడీ నేటికీ ఆగమబద్ధంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం బంగారువాకిలిలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి, సేనాపతి విష్వక్సేనుల వారిని వేంచేపు చేసి కొలువు నిర్వహించారు. తమిళనాడు శ్రీరంగ క్షేత్రం నుంచి తీసుకొచ్చిన ఆరు నూతన పట్టువస్త్రాలను ఊరే గింపుగా తీసుకొచ్చి గర్భాలయంలోని మూలమూర్తికి 4 పట్టు వస్త్రాలు, మరొకటి మలయప్పకు, ఇంకొ కటి విష్వక్సేనుల వారికి సమర్పించారు. వాటిని అలంకరించిన తర్వాత గర్భాలయంలో సంప్ర దాయ, వైదిక పూజలు నిర్వహించారు. పెద్ద జీయర్, చిన్న జీయర్, టీటీడీ ఈవోలకు సంప్రదాయంగా జీయంగారి సీలు (మెహరు), తాళం చెవుల గుత్తి (లచ్చన) అందజేసి, తీర్థం, శఠారి మర్యాదలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి గమేకార్, హథీరాం మహంతు, మైసూరు, తాళ్లపాకం, తరిగొండవారి హారతులు సమర్పించారు. కార్యక్రమానికి హాజరైన వారి వద్ద నుంచి రూపాయి చొప్పున వసూలు చేసి టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు సమక్షంలో శ్రీవారి ఖజానా (హుండీ)లో జమ చేయటంతో స్వామివారికి ఆస్థాన కార్యక్రమం ముగిసింది. కోలాహలంగా పల్లకి ఊరేగింపు ఆణివార ఆస్థానం కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం పల్లకి ఊరేగింపు నిర్వహించారు. మొత్తం రెండు టన్నుల బరువు కలిగిన పల్లకిలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. -
వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం
ప్రత్యేక టోకెన్ కౌంటర్లు ప్రారంభించిన టీటీడీ జేఈవో సాక్షి, తిరుమల: తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులకు మరింత సౌకర్యంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఎస్వీ మ్యూజియం ఎదురుగా ప్రత్యేక టోకెన్ కౌంటర్లు ప్రారంభ మయ్యాయి. టీటీడీ జేఈవో కేఎస్.శ్రీనివాస రాజు బుధవారం ఈ కౌంటర్ల ద్వారా భక్తులకు టోకెన్ల మంజూరును ప్రారంభిం చారు. ఈ సందర్భంగా జేఈవో మీడియాతో మాట్లాడుతూ రోజుకు రెండు స్లాట్లలో 1,500 మంది వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం కల్పిస్తున్నా మన్నారు. ఇక్కడ భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోందని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కొత్తగా టోకెన్ కౌంటర్లు ప్రారంభించామన్నారు. మధ్యా హ్నం స్లాట్‌కు కూడా ఉదయమే టోకెన్లు మంజూరు చేస్తామని, దీనివల్ల ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేద న్నారు. దక్షిణ మాడ వీధిలో వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే హాలులో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు సీట్ల సామర్థ్యాన్ని పెంచామని జేఈవో తెలిపారు. రేపు డయల్ యువర్ టీటీడీ ఈవో తిరుమలలో జూన్ 2వ తేదీ శుక్రవారం డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతినెలా మొదటి శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9.30 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా భక్తులు 0877–2263261 నంబరుకు ఫోన్‌చేసి తమ సందేహలు, సూచనలను టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌కు తెలియజేయవచ్చు. -
నేనూ శ్రీవారి సేవకుడినే
టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘నేను మొదట్నుంచీ శ్రీవారి సేవకుడినే. 1994లో తొలిసారి స్వామిని దర్శించుకున్నా. అప్పట్నుంచి ఎక్కడున్నా కూడా ఏటా శ్రీవారి దర్శనానికి వస్తూనే ఉన్నాను. కానీ ఇలా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో)గా స్వామికి సేవ చేసే భాగ్యం లభిస్తుందని మాత్రం ఊహించ లేదు..’ అని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అనిల్‌కుమార్ సింఘాల్ అన్నారు. గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలకు లోబడి టీటీడీ బోర్డు నిర్ణయాలను గౌరవిస్తూ భక్తులకు సంతృప్తికర దర్శనం కలిగించడమే తన లక్ష్యమని చెప్పారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు కాలినడకన తిరుమల చేరుకుని సాధారణ క్యూలోనే దర్శనం చేసుకున్నానని, దీనివల్ల భక్తుల ఇబ్బందులు, అభిప్రాయాలు స్వయంగా తెలుసుకునే వీలు కలిగిందన్నారు. దివ్యాంగులు, వయో వృద్ధులకు వీలైనంత త్వరగా శ్రీవారి దర్శనం జరిగేలా కౌంటర్ల పనివేళల్లో మార్పులు తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పారు. కాగా, తనకన్నా ముందు పనిచేసిన ఈవోలందరూ టీటీడీ వృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. అవి రెండూ వేరు కాదు.. తిరుపతి, తిరుమల వేర్వేరు కాదని.. రెండు చోట్లా అభివృద్ధి జరగాలని ఈవో సింఘాల్ అభిప్రాయపడ్డారు. నిర్మాణ దశలో ఆగిపోయిన భవనాలను పూర్తి చేస్తామని చెప్పారు. దేశవిదేశాలు, సుదూర ప్రాంతాల నుంచి తిరుపతి చేరుకునే యాత్రికులకు బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక మరుగుదొడ్లు, రవాణా సదుపాయాలు కల్పించే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. అలాగే స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందేలా పర్యవేక్షణ పెంచుతామన్నారు.