
సాక్షి,తిరుమల/శ్రీశైలంటెంపుల్/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/నరసరావుపేట రూరల్: ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయ మహా ద్వారం నుంచి ఆలయానికి చేరుకున్న ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం శ్రీవారిని, వకుళమాతను దర్శించు కుని, హుండీలో కానుకలు సమర్పించారు. తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా, టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు శ్రీవారి చిత్రపటాన్ని, నూతన సంవత్సరం కేలండర్, లడ్డూప్రసాదాలు అందజేశారు.