సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.కరోనా రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు లభించేలా తగు చర్యలు తీసుకున్నామన్నారు. బెడ్లు, రెమిడెసివిర్‌పై ప్రత్యేక దృష్టిసారించామని పేర్కొన్నారు. ఆస్పత్రులకు 15,747 రెమిడెసివిర్ వయల్స్ ను పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత దృష్ట్యా సెకండ్ డోస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ లభ్యత వచ్చిన వెంటనే అందరికీ టీకాలు వేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రైవేట్ ఆస్పత్రులపై అధికారుల నిఘా కొనసాగుతోందని తెలిపారు.కాగా ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా 20,068 కరోనా కేసులు, 96 మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో 1,01,071 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
చదవండి: పాజిటివ్ రేట్ 17%: ఏపీలో కొత్త కరోనా కేసులు ఎన్నంటే..
Comments
Please login to add a commentAdd a comment