ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఆధార్ అనుసంధానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మంనగరంలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ ముట్టడించారు. తొలుత వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెవిలియన్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. అక్కడనుంచి ప్రదర్శనగా బయలుదేరి మయూరిసెంటర్, బస్టాండ్, వైరారోడ్, జడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్ కు చేరుకుని ఆందోళన చేపట్టారు. అప్పటికే వన్‌టౌ న్ సీఐ వెంకటేష్, ట్రాఫిక్ సీఐ రామోజీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించి కలెక్టరేట్ గేట్‌లను మూసివేసి ట్రాఫిక్‌ను దారిమళ్లిం చారు. విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసు లు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగిం ది. విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.
ఈ ఆందోళనను ఉద్దేశించి పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కెఎస్.ప్రదీప్ మాట్లాడుతూ విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆధార్‌కు అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించడం సరైంది కాదన్నారు. ఈ ప్రక్రియ వల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరినా స్కాలర్‌షిప్‌ల కోసం 30 శాతం మంది కూడా దరఖాస్తు చేసుకోలేదని, దీనికి ప్రధాన కారణం ఆధార్‌కార్డు ప్రక్రియే అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు ఇవ్వకుండా ఉండేందుకే ప్రభుత్వం ఆధార్‌తో స్కాలర్‌షిప్‌లను ముడిపెడుతోందన్నారు. సంక్షేమ పథకాలను ఆధార్‌తో జత చేయవద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినా ఏకపక్ష నిర్ణయాలతో వ్యవహరించడం సరికాదన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి పృధ్వి, జిల్లా ఉపాధ్యక్షులు సంధ్య, సురేష్, సీతారామరాజు, సహాయ కార్యదర్శి అశోక్, రాజా, నాయకులు మమత, శ్రీను, మహి, లక్ష్మణ్, సాయి, నాగుల్‌మీరా, సౌందర్య, ఉమామహేష్, రాజశేఖర్, అంజి, నవీన, లక్ష్మణ్, చంటి పాల్గొన్నారు.
ఆధార్ అనుసంధానం తొలగించాలి
Published Sun, Dec 22 2013 3:36 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
Advertisement
Advertisement