జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : జిల్లా పరిపాలన కేంద్రమైన కలెక్టరేట్‌లో రెండు రోజులైనా చీకట్లు తొలగిపోలేదు. కోట్లలో పేరుకుపోయిన బకాయిలు చెల్లించడంలో ఆయా శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎప్పుడూ బిజీగా ఉండే కలెక్టరేట్ శుక్ర, శనివారాల్లో అంధకారంలోనే మగ్గిపోరుంది. కలెక్టరేట్ సముదాయంలోని 42 కార్యాలయాల్లో పాలనపరమైన వ్యవహారాలన్నీ పూర్తిగా స్తంభించారు. ఏ సమాచారం కావాలన్నా కంప్యూటర్‌పైనే ఆధారపడడంతో ఒక్క పనీ జరగలేదు.
ఆయా శాఖల అధికారులు, సిబ్బంది మొక్కుబడిగా వచ్చి కాలక్షేపానికే పరిమితమయ్యారు. కలెక్టరేట్‌లో మొత్తం రూ.3.87 కోట్ల విద్యుత్ బకారుులు ఉన్నారుు. తరచూ బకాయిలు పేరుకుపోతుండడంతో ఇటీవల శాఖలవారీగా విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కొన్ని కార్యాలయాల్లో మీటర్లు అమర్చినప్పటికీ.. బకాయిలు చెల్లించే వరకు కనెక్షన్ ఇవ్వబోమని ట్రాన్స్‌కో అధికారులు తేల్చి చెప్పేశారు. జిల్లా పాలనయంత్రాంగం నుంచి కూడా బకాయిల చెల్లింపుపై స్పందన లేకపోవడంతో విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేశారు. స్కాలర్‌షిప్ దరఖాస్తులకు గడువు సమయం కావడంతో సాంఘిక సంక్షేమ కార్యాలయంలో కార్యకలాపాలన్నీ నిలిచిపోయి విద్యార్థులు, వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రెండు రోజులు చీకట్లతోపాటు ఆదివారం సెలవుదినం కావడంతో వరుసగా మూడు రోజులు కలెక్టరేట్ కు కరెంట్ కట్‌కట తప్పడం లేదు.
సింగిల్‌ఫేస్.. ట్రాన్స్‌ఫార్మర్‌లో బ్రేక్
బకాయిల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాన్స్‌కో అధికారులు కలెక్టర్, జేసీ, డీఆర్వో కార్యాలయాలకు మినహాయింపునిచ్చారు. వీటికి సింగిల్ ఫేస్ ద్వారా కరెంట్ సరఫరా చేయడంతో ఓవర్‌లోడ్ పడి ట్రాన్స్‌ఫార్మర్లలో బ్రేక్ ఏర్పడింది. దీంతో ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మర్‌ను మరమ్మతు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్న బకాయిలను వసూలు చేసుకుందామనుకుంటే కొత్త సమస్యలు తలెత్తడంతో విద్యుత్‌శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ మరమ్మతుల వల్ల అదన పు భారాన్ని మోయాల్సి వస్తోందని వాపోతున్నారు.
తొలగని చీకట్లు
Published Sun, Sep 22 2013 4:42 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
Advertisement