ప్రభుత్వ అనుమతితోనే టీటీడీలో ఉద్యోగాల భర్తీ
ప్రభుత్వ అనుమతితోనే టీటీడీలో ఉద్యోగాల భర్తీ
Published Tue, Jul 11 2017 12:57 AM | Last Updated on Mon, Jul 29 2019 6:06 PM
రూ.300 స్లాట్ తరహాలో దివ్యదర్శనానికి ఏర్పాట్లు: టీటీడీ ఈవో అనిల్ కుమార్
తిరుపతి అర్బన్: ఖాళీగా ఉన్న టీటీడీ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే భర్తీచేస్తామని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడ టీటీడీ ఈవోతో ‘మీట్ ద ప్రెస్’ను ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 5 ఏళ్ల లోపు పిల్లల తల్లి దండ్రుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసినట్లు తెలి పారు. నడిచివచ్చే భక్తులకు అమలు చేస్తున్న దివ్య దర్శనం విధానాన్ని రద్దుచేసే ఆలోచన లేదన్నారు. రూ.300 స్లాట్ తరహాలో ఈ నెల 17 నుంచి దివ్యదర్శనం భక్తులకు ప్రత్యేక విధానం ద్వారా రోజుకు 20వేల మందికి దర్శనం కల్పించేలా ప్రణాళికలు రూపొందించి ప్రయో గాత్మకంగా పరిశీలిస్తామన్నారు.
గదుల మంజూరుకూ రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్ విధానంతో గదులు పొందే సౌలభ్యాన్ని అమలులోకి తేనున్నా మని ఈవో వెల్లడించారు. భక్తులు గదుల కేటాయింపు కౌంటర్ల వద్ద వివరాలను టీటీడీ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోగానే రెఫరెన్స్ టోకెన్ ఇచ్చి పంపేస్తారన్నారు. కేటాయించిన కాటేజీ, గది నంబర్‌లను వారి మొబైల్‌కు మెసేజ్ ద్వారా పంపుతామన్నారు. భక్తుడు ఆ సమయానికి కౌంటర్ వద్దకు వచ్చి డబ్బు చెల్లిస్తే గది మంజూరు చేస్తామన్నారు.
Advertisement
Advertisement