సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో గతవారం కురిసిన వర్షాలతో పెద్దఎత్తున పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో అంచనాలకు ఉపక్రమించిన అధికారులు ప్రాథమిక నివేదికలు తయారు చేశారు. ఈ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 32,227 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 24,080 ఎకరాల వ్యవసాయ పంటలు కాగా, 8,147 ఎకరాలు ఉద్యాన పంటలు. అధికంగా వరి 8,962 ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. 6,877 ఎకరాల్లో పత్తి, 5,680 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు పాడైనట్లు అధికారుల ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సగం మునిగితేనే లెక్కలోకి..!
పంటనష్టం అంచనాల సేకరణలో నిబంధనలు రైతుపాలిట శాపంగా మారాయి. రైతు సాగు చేసిన విస్తీర్ణంలో సగానికిపైగా నష్టం సంభవిస్తేనే పరిగణలోకి తీసుకుంటున్నారు. సగానికంటే తక్కువ విస్తీర్ణంలో పంటనష్టం కలిగితే లెక్కలోకి రాదన్నమాట.
ఈ నిబంధనలతో రైతులకు పరిహారం సగంతేమోగానీ అసలుకే ఎసరు వస్తోంది. మరోవైపు ఐదు ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటవేసి నష్టపోయిన రైతుల వివరాల సేకరణలోనూ సర్కారు నిబంధనలు ఇబ్బంది తెచ్చిపెడుతున్నాయి. ప్రత్యేక ఆదేశాలు వస్తేనే పెద్ద రైతులు నష్టపోయిన వివరాలు లెక్కిస్తామని అధికారులు పేర్కొనడం గమనార్హం.
పంట నష్టంపై అధికారుల అంచనాలివీ!
Published Thu, Oct 31 2013 12:57 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement